ముంబై: దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో తన వ్యాపార లావాదేవీలను నిర్వహిస్తోన్న డీమార్ట్ హైపర్ చైన్ మార్కెట్లను లీడ్ చేస్తోన్న అవెన్యూ సూపర్‌మార్ట్స్.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి సంబంధించిన ఫలితాలను ప్రకటించింది. నెట్ ప్రాఫిట్‌లో 110 శాతం మేర పురోభివృద్ధిని సాధించింది. 417.80 కోట్ల రూపాయల నెట్ ప్రాఫిట్‌ను ఆర్జించింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లోనూ అంచనాలకు అనుగుణంగా డీమార్ట్ రాణించినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
2021-2022 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో 417.80 కోట్ల రూపాయలతో 110 శాతం మేర నెట్ ప్రాఫిట్‌ను నమోదు చేసినట్లు అవెన్యూ సూపర్‌మార్ట్స్ వెల్లడించింది. ఈ మేరకు స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లో ప్రతిపాదనలను ఫైల్ చేసింది. ఇదే ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంతో పోల్చుకుంటే- ఈ మొత్తం చాలా అధికం. తొలి త్రైమాసికంలో డీమార్ట్ నమోదు చేసిన నెట్ ప్రాఫిట్ 199 కోట్ల రూపాయలు. కరోనా వైరస్ సెకెండ్ వేవ్ ప్రభావం వల్ల తొలి త్రైమాసికంలో నికర ఆదాయం తగ్గినట్లు పేర్కొంది.

రెండో త్రైమాసికం నాటికి పరిస్థితులు మెరుగు పడటంతో ఆదాయం పెరిగినట్లు వివరించింది. 417.80 కోట్లరూపాయలను నెట్ ప్రాఫిట్‌గా చూపించింది. జులై-ఆగస్టు-సెప్టెంబర్ మధ్యకాలంలో మొత్తంగా 7,789 కోట్ల రూపాయల వ్యాపార లావాదేవీలను నిర్వహించింది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ మొత్తం 46.8 శాతం అధికం. అప్పట్లో 5,218 కోట్ల రూపాయల లావాదేవీలను రికార్డ్ చేసింది. ఎర్నింగ్ బిఫోర్ ఇంటరెస్ట్, ట్యాక్స్, డిప్రిషియేషన్ అండ్ అమోర్టైజేషన్ తరువాత 670 కోట్ల రూపాయలను నమోదు చేసినట్లు తెలిపింది.
గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి ఎర్నింగ్ బిఫోర్ ఇంటరెస్ట్.. 325 కోట్ల రూపాయలు. అప్పట్లో 6.2 శాతం మేర ఎర్నింగ్ బిఫోర్ ఇంటరెస్ట్ నమోదు కాగా.. అది 8.8 శాతానికి చేరింది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 5.8 శాతంగా నమోదు చేసింది డీమార్ట్. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి ఈ సంఖ్య 4 శాతమే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి రెండు త్రైమాసికాలకు కలిపి 12,681 కోట్ల రూపాయలను రెవెన్యూను సాధించినట్లు అవెన్యూ సూపర్ మార్ట్ తెలిపింది. గత ఏడాది తొలి రెండు త్రైమాసికాల్లో 9,051 కోట్ల రూపాయల రెవెన్యూ అందుకుంది.
అవెన్యూ సూపర్‌మార్ట్స్‌కు రాధాకృష్ణ దమాని, ఆయన కుటుంబ సభ్యులు ప్రమోటర్లుగా వ్యవహరిస్తోన్నారు. డీమార్ట్ బ్రాండ్ నేమ్‌తో దేశవ్యాప్తంగా ఈ సంస్థకు జెయింట్ సూపర్ మార్కెట్స్ ఉన్నాయి. సంస్థలో పనిచేస్తోన్న ఉద్యోగుల్లో 96 శాతం మందికి వ్యాక్సిన్ వేయించినట్లు అవెన్యూ సూపర్‌మార్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ నెవెల్లె నొరొన్హా తెలిపారు. తొలి త్రైమాసికంలో నెట్ ప్రాఫిట్ తగ్గడానికి కరోనా వైరస్ సెకెండ్ వేవ్ పరిస్థితులు కారణం అయ్యాయని, రెండో త్రైమాసికానికి మళ్లీ గాడిన పడ్డామని అన్నారు.


Click it and Unblock the Notifications