జనవరి నెలలో ఆటో సేల్స్ పుంజుకున్నాయి. మారుతీ, హ్యుండాయ్, టాటా, మహీంద్రా సేల్స్ పెరగగా, మారుతీ సుజుకీ విక్రయాలు మాత్రం తగ్గాయి. అలాగే, ఫోర్డ్, స్కోడా, జీప్ సేల్స్ కూడా తగ్గాయి. హ్యుండాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్, కియా, హోండా, నిస్సాన్, వీడబ్ల్యు సేల్స్ భారీగా పెరిగాయి. కరోనా నేపథ్యంలో గత ఏడాది ఏప్రిల్ నుండి వాహనాల సేల్స్ పడిపోయాయి. కొన్ని కంపెనీలు గత ఏప్రిల్‌లో జీరో సేల్స్ నమోదు చేశాయి. ఆరు నెలలుగా ఆటో సేల్స్ క్రమంగా కోలుకుంటున్నాయి. కారు సేల్స్ నెల ప్రాతిపదికన 10 శాతం, ఏడాది ప్రాతిపదికన 16 శాతం పెరిగాయి.

మారుతీ సుజుకీ సేల్స్
దేశీయ ఆటో దిగ్గజం మారుతీ సుజుకీ సేల్స్ ఏడాది ప్రాతిపదికన 0.6 శాతం క్షీణించాయి. ఈ కంపెనీ మార్కెట్ వాటా 45.8 శాతంగా ఉంది. 2020 జనవరి నెలలో మార్కెట్ వాటా 53 శాతంగా ఉండగా, ఈసారి తగ్గింది. గత నెల (డిసెంబర్)లోను 51 శాతం వాటా ఉంది. ఏడాది ప్రాతిపదికన సేల్స్ తగ్గిన నేపథ్యంలో మారుతీ సుజుకీ కంపెనీ స్టాక్ నేడు నష్టపోయింది. కంపెనీ హోల్ సేల్స్ జనవరిలో 1,39,000గా నమోదయ్యాయి. నెల ప్రాతిపదికన (1,40,754), ఏడాది ప్రాతిపదికన (1,39,844) తగ్గాయి. అయితే జిప్సీ, ఎర్టిగా, ఎస్-క్రాస్, ఎక్స్ఎల్-6, బ్రెజ్జా సేల్స్ స్వల్పంగా పెరిగాయి.

హ్యుండాయ్, టాటా మోటార్స్
హ్యుండాయ్ మోటార్ సేల్స్ ఏడాది ప్రాతిపదికన 23.82 శాతం పెరిగాయి. భారత మార్కెట్ వాటా 17.11 శాతంగా ఉంది. గత ఏడాది జనవరిలో 42,002 యూనిట్లు విక్రయించగా, ఈసారి 52,005 యూనిట్లకు పెరిగింది. డిసెంబర్ నెలలో 47,400 యూనిట్లుగా నమోదయింది.
టాటా మోటార్స్ సేల్స్ 94.82 శాతం పెరిగాయి. మార్కెట్ వాటా దాదాపు 9 శాతంగా ఉంది. గత ఏడాది జనవరిలో టాటా మోటార్స్ వాహన విక్రయాలు 13,893 కాగా, ఈసారి 26,980కి పెరిగాయి. డిసెంబర్ నెలతో 15 శాతం పెరిగాయి.

మహీంద్రా
మహీంద్రా సేల్స్ 4.82 శాతం పెరిగాయి. కంపెనీ మార్కెట్ వాటా 6.74 శాతంగా ఉంది. గత ఏడాది జనవరిలో 19,555 వాహనాలు విక్రయించగా, ఈసారి 20,498 యూనిట్లకు పెరిగింది. డిసెంబర్ నెల 16,050 యూనిట్లతో 28 శాతం పెరిగింది. మహీంద్రా ప్రస్తుతం మైక్రో ప్రాసెసర్ సెమీ కండక్టర్స్ కొరతను ఎదుర్కొంటోంది. అయితే సప్లయర్లతో చర్చించి, మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా పంపిణీ చేసేందుకు సిద్ధమైంది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications