భాగ్యనగరానికి చెందిన అరబిందో ఫార్మా అమెరికాలోని తమ అనుబంధ యూనిట్ నాట్రోల్‌ను అమ్మివేయడానికి సంతకం చేసింది. ప్రయివేట్ ఈక్విటీ సంస్థ న్యూమౌంటేన్ క్యాపిటల్‌కు రూ.4,048 కోట్లకు(550 బిలియన్ డాలర్లు) విక్రయించేందుకు ఒప్పందం కుదిరింది. ఈ మేరకు సోమవారం అరబిందో ఫార్మా వెల్లడించింది. జారో ఫార్ములాస్‌తో కలిసి న్యూమౌంటేన్ క్యాపిటల్ దీనిని కొనుగోలు చేయనున్నట్లు ఆ ప్రకటనలో తెలిపింది. ఈ డీల్‌కు సంబంధించి ఈ నెల 25వ తేదీన సంతకాలు చేసినట్లు తెలిపింది. జనవరి 2021 నాటికి విక్రయం పూర్తవుతుందని భావిస్తున్నారు.

రుణభారం తగ్గించుకోవడానికి
న్యూమౌంటేన్ క్యాపిటల్-అరబిందో ఫార్మా కంపెనీ డీల్ నగదు రూపంలోనే జరుగుతుందని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది జనవరి నాటికి ఈ లావాదేవీ పూర్తికావచ్చన్నారు. ఈ మేరకు స్టాక్ ఎక్స్చేంజీలకు సోమవారం తెలిపింది. నాట్రోల్ ఈ ఏడాది మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి 157 మిలియన్ డాలర్ల టర్నోవర్‌ను నమోదు చేసింది. 82.41 మిలియన్ డాలర్ల నికర నిలువలు ఉన్నాయి. సంస్థ రుణ భారాన్ని తగ్గించుకోవడంతోపాటు ఇతర నూతన వ్యూహాత్మక కార్యక్రమాలకు విక్రయించగా వచ్చిన ఈ నిధులను వెచ్చిస్తామని అరబిందో ఫార్మా ఎండీ గోవిందరాజన్ తెలిపారు. ఈ సంస్థ తమ చేతికి వచ్చినప్పటి నుండి దీని వృద్ధికి కృషి చేశామన్నారు.

ఆరేళ్ల క్రితం కొనుగోలు
పోషకాహార ఉత్పత్తుల రంగంలో ఉన్న నాట్రోల్ కంపెనీని అరబిందో ఫార్మా 2014 డిసెంబర్‌లో కొనుగోలు చేసింది. నాటి నుండి నాట్రోల్ కంపెనీ మంచి లాభాల్లో ఉంది. ప్రధానంగా కాస్మోటిక్స్, న్యూట్రాస్మ్యటికల్స్ తయారీలో ఉంది. వ్యూహాత్మక ప్రణాళికలను పరిగణలోకి తీసుకొని నాట్రోల్‌ను విక్రయించాలని నిర్ణయించినట్లు అరబిందో వెల్లడించింది.

1980 నుండి నాట్రోల్..
నాట్రోల్‌ను అత్యుత్తమ ప్రయివేట్ ఈక్విటీ ప్లేయర్‌కు విక్రయించడం ఆనందంగా ఉందని, వారు నాట్రోల్, దాని ఉత్పత్తులను, బ్రాండ్‌ను మరింతగా పెంచడానికి అదనపు వనరులను కేంద్రీకరించగలరని గోవిందరాజన్ అన్నారు. నాట్రోల్ 1980లో స్థాపించారు. దశాబ్దాలుగా న్యూట్రాస్యూటికల్స్ విభాగంలో ముందుంది. 2014లో అరబిందో చేతికి వచ్చింది.
More From GoodReturns

మాట తప్పిన అమెరికాతో చర్చలు ఇక ఉండవని స్పష్టం చేసిన ఇరాన్.. గల్ఫ్ దేశాల తాగునీటిపై గురి పెట్టిన టెహ్రాన్..

భారతదేశంలో లాక్డౌన్.. గూగుల్‌లో తెగ వెతికేస్తున్న నెటిజన్లు.. వెస్ట్ ఆసియా దేశాల్లో ఎమర్జెన్సీ ప్రకటన..

హార్ముజ్ జలసంధిపై ఇరాన్ కీలక ప్రకటన..శత్రుదేశాల నౌకలకు ప్రవేశం లేదని స్పష్టం చేసిన టెహ్రాన్..

అమెరికాతో చర్చలేమి జరగలేదు..ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన ఇరాన్.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందనే భయంతోనే..

చమురు సంక్షోభంలో స్నేహితుడికి అండగా రష్యా.. భారత రిఫైనరీ కంపెనీలకు 6 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు సరఫరా

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!



Click it and Unblock the Notifications