కరోనా-లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించిన మరుసటి రోజు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఇందుకు సంబంధించిన కొన్ని వివరాలు వెల్లడించారు. ఒక్కో రోజు ఒక్కో ప్యాకేజీని వెల్లడించనున్నారు. నిన్న రూ.6 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించారు ఆర్థికమంత్రి. ఎంఎస్ఎంఈలకు రూ.3 లక్షల భారీ ప్యాకేజీ ప్రకటించారు. స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత కల్పించేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. బకాయిలు తీర్చేందుకు డిస్కంలకు తోడ్పాటుగా ఉంటామని తెలిపారు. లాక్ డౌన్ నేపథ్యంలో చిరు ఉద్యోగులకు మరో 3 నెలల పాటు పీఎఫ్ చెల్లించనున్నట్లు చెబుతూ, ప్రయివేటు పెద్ద సంస్థల ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్‌ను 2 శాతం తగ్గిస్తూ వెసులుబాటు కల్పించింది కేంద్రం. ఆదాయపు పన్నులో వెసులుబాటు కల్పించారు. రియల్ ఎస్టేట్‌కు భారీ ఊరట కల్పించారు. మొత్తంగా ప్యాకేజీకి సంబంధించి రూ.6 లక్షల కోట్లను నిన్న ప్రకటించారు.

రూ.6 లక్షల కోట్ల ప్యాకేజీ.. దేనికి ఎంత?
రూ.20 లక్షల కోట్ల మెగా ప్యాకేజీలో భాగంగా SMSEలకు రూ.3,70,000 కోట్ల ప్రయోజనం కల్పిస్తోంది కేంద్ర ప్రభుత్వం. కేంద్రం రూ.2,500 కోట్ల ఈపీఎఫ్ వాటాను చెల్లించనుంది. అలాగే, రూ.6,750 కోట్ల ఈపీఎఫ్ వాటాను సంస్థలకు తగ్గించింది. ఎన్‌బీఎఫ్‌సీ, హెచ్‌ఎఫ్‌సీ, ఎంఎఫ్ఐలకు రూ.75,000 కోట్ల ప్యాకేజీ ప్రకటించింది. డిస్కంలకు రూ.90,000 కోట్ల రుణాలను ప్రకటించింది కేంద్రం. రూ.50,000 కోట్ల రాయితీలు ఉన్నాయి. మొత్తంగా రూ.5,94,000 కోట్ల ప్యాకేజీని ప్రకటించింది.

16 అంశాలు.. ఎవరికి ఎన్ని..
ప్యాకేజీ పథకంలో 16 అంశాలు ఉండగా, MSMEలకు సంబంధించి 6, పీఎఫ్ రూపంలో ఉద్యోగుల కోసం 2, ఎన్‌బీఎఫ్‌సీల కోసం 2, రియల్ ఎస్టేట్ రంగానికి ఊతమిచ్చేందుకు 2, ఆధాయపు పన్ను విషయంలో 3, డిస్కంలకు సంబంధించి 1 అంశం ఉంది. మొత్తం 16 అంశాలకు సంబంధించి నిర్మలా సీతారామన్ ప్రకటన చేశారు.

MSMEలకు ఇలా ప్రయోజనం
MSMEలకు, చిన్న వ్యాపారాల కోసం హామీలేని రూ.3 లక్షల రుణాలను నిర్మల ప్రకటించారు. దీంతో 45 లక్షల సంస్థలకు ప్రయోజనం దక్కనుంది. ఉద్యోగాలు తొలగించకుండా కార్యకలాపాలు ప్రారంభించే వీలు ఉంటుంది. ఈ రుణాలను 4 ఏళ్ల గడువుపై 12 నెలల పాటు మారటోరియం ఉంటుంది. అయితే ఇక్కడ వడ్డీ మాత్రం కట్టవలసి ఉంటుంది. దీనికి ప్రభుత్వం గ్యారంటీ ఉంటుంది. 31 అక్టోబర్ వరకు ఈ స్కీం అమలులో ఉంది. హామీ రుసుము ఉండదు. ఎలాంటి హామీ అవసరం లేదు. రూ.25 కోట్ల పెట్టుబడులు, రూ.100 కోట్ల వరకు టర్నోవర్ ఉన్న చిన్న వ్యాపారులకు ఈ పథకం వర్తిస్తుంది. ఇవే కాకుండా ఆర్థిక ఒత్తిడిలో ఉన్న సంస్థలకు రూ.20,000 కోట్లు, రూ.50,000 కోట్ల ద్రవ్యలభ్యత ప్రయోజనాలు చేకూరుతాయి. రూ.200 కోట్ల వరకు ప్రభుత్వ ప్రొక్యూర్మెంట్ టెండర్లలో విదేశీ కంపెనీలను అనుమతించకుండా, జనరల్ ఫైనాన్షియల్ రూల్స్‌లో సవరణలు చేపట్టనున్నారు. ఇది ఆత్మనిర్భర్ భారత్ దిశగా కొత్త అడుగు. భారత్‌లో తయారీకి ఉతమిస్తున్నారు. ఎస్ఎంఎస్ఈలు తమ వ్యాపారం పెంచుకునే వెసులుబాటు.

నగదు లభ్యత
ప్రజల చేతిలో నగదు లభ్యత పెంచేందుకు టీడీఎస్, టీసీఎస్‌లో 25 శాతం తగ్గింపును ప్రకటించింది. దీంతో రూ.50,000 కోట్ల వరకు ప్రజల చేతుల్లో నగదు అందుబాటులో ఉంటుందని అంచనా. ఆదాయపు పన్ను రిటర్న్స్ గడువును నవంబర్ 30వ తేదీ వరకు పొడిగించారు. రియల్ ఎస్టేట్, డిస్కంలకు ఊతమిచ్చారు. చిన్న కంపెనీల వృద్ధి, ఉద్యోగాలు కాపాడటం వంటి అంశాలే లక్ష్యంగా ఈ ప్యాకేజీని ప్రకటించినట్లు చెప్పారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్‌డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications