కరోనా దెబ్బ, భారత్‌కు ఆస్ట్రాజెనికా రూ.1.8 కోట్ల సహకారం
భారత్‌లో కరోనా సెకండ్‌వేవ్ విజృంభిస్తోన్న నేపథ్యంలో బ్రిటిష్-స్వీడిష్ డ్రగ్ తయారీదారు సంస్థ అస్ట్రాజెనికా అండగా నిలబడుతోంది. భారత్‌కు 2,50,000 డాలర్ల సహకారం అందించేందుకు ముందుకు వచ్చింది. మన కరెన్సీ రూపాయిలో ఇది దాదాపు రూ.1.8 కోట్లు. ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, మెడిసిన్స్, పీపీఈ కిట్స్, ఇతర సరుకుల రూపంలో ఈ సాయం చేస్తామని అస్ట్రాజెనికా తెలిపింది. భారత్‌లోని జనాభాలో దాదాపు 10 శాతం మంది ఇప్పటికే కొవిషీల్డ్ వ్యాక్సిన్ తొలి డోస్ తీసుకున్నారు. రెండో డోస్ తీసుకోవడానికి రెడీ అవుతోందని అస్ట్రాజెనికా తెలిపింది.
'ఈ రోజు ఆస్ట్రాజెనికా భారత్‌తో పాటు ప్రపంచంలోని ఇతర దేశాల్లో సహాయక చర్యలకు మద్దతుగా 1 మిలియన్ సహాయాన్ని ప్రకటించింది' అని పేర్కొంది. భారత్‌కు మద్దతుగా 2,50,000 డాలర్ల ప్రత్యక్ష సహకారం అందిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ట్వీట్ చేసింది.

కరోనా మహమ్మారి దేశాన్ని అతలాకుతలం చేస్తోన్న విషయం తెలిసిందే. దీంతో చాలా కంపెనీలు అండగా ఉండేందుకు ముందుకు వచ్చాయి. పెద్ద ఎత్తున నిధులను అందిస్తున్నాయి. మారుతీ వంటి కంపెనీలు ఉత్పత్తిని నిలిపివేసి ఆక్సిజన్ రూపంలో సహకరిస్తున్నాయి. ఇన్ఫోసిస్, రిలయన్స్, టాటా, విప్రో, టెక్ మహీంద్రా వంటి కంపెనీలు తమవంతుగా కరోనాపై పోరుకు సహకరిస్తున్నాయి.


Click it and Unblock the Notifications