Personal Tax: ఫిబ్రవరి 1న ప్రతి ఏటా మాదిరిగానే కేంద్రం తన వార్షిక బడ్జెట్ ప్రసంగానికి అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో సాధారణ ప్రజల నుంచి కార్పొరేట్ ప్రపంచం వరకు అందరి నుంచి వినతుల వర్షం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు కొనసాగుతూనే ఉంది. ప్రధానంగా ఆదాయపుపన్నుకు సంబంధించిన వినతి ఎక్కువగా వినిపిస్తోంది.
కేంద్ర బడ్జెట్ 2025లో వ్యక్తిగత ఆదాయపు పన్ను రేట్లను తగ్గించడాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పరిశీలించాలని పరిశ్రమల సంస్థ అసోచామ్ పేర్కొంది. కార్పొరేట్ పన్నుల మాదిరిగానే వ్యక్తిగత పన్నుల్లో కోతలు ఆవస్యకమని సూచించింది. ఈ క్రమంలో పర్సనల్-కార్పొరేట్ టాక్స్ మధ్య ఉన్న గణనీయమైన వ్యత్యాసాలను అసోచామ్ ఎత్తి చూపటం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. గడచిన ఏడాది సైతం సాధారణ ప్రజల నుంచి పన్నుల తగ్గింపు విషయంలో వినతులు వచ్చినప్పటికీ ఆర్థిక మంత్రిత్వ శాఖ మాత్రం దానికి సానుకూలంగా స్పందించ లేదు.

అనేక సంవత్సరాలుగా కార్పొరేట్ టాక్స్ రేట్లు తగ్గుతున్నాయని.. అయితే ఇది పర్సనల్ టాక్స్ రేట్లతో పోల్చినప్పుడు అంతరాన్ని భారీగా పెంచుతోందని అసోచామ్ ఆర్థిక మంత్రికి రాసిన లేఖలో పేర్కొంది. ప్రస్తుతం ఉన్న సాధారణ కార్పొరేట్ పన్ను రేటు 25.17%తో పోలిస్తే.. వ్యక్తుల కోసం అత్యధిక ఉపాంత రేటు ఇప్పుడు అత్యధిక స్లాబ్‌లో 42.74%, కొత్త పన్ను విధానంలో 39%కి పెరిగిందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో కార్పొరేట్ పన్ను రేట్లు ప్రపంచ స్థాయిలో పోటీగా మారినప్పటికీ పర్సనల్ టాక్సుల విషయంలో అలా లేదని పేర్కొంది. వ్యక్తిగత పన్ను రేట్లలో ఇదే విధమైన తగ్గింపు అత్యవసరంగా అసోచామ్ పేర్కొంది.
ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశంలో వ్యక్తులకు అధిక వ్యక్తిగత పన్ను రేటు అనూహ్యంగా ఎక్కువగా ఉందని అసోచామ్ తెలిపింది. ఒకసారి ప్రపంచ వ్యాప్తంగా ఇతర దేశాల్లోని ప్రస్తుతం వ్యక్తిగత ఆదాయపు పన్ను గరిష్ఠ రేట్లను పరిశీలిస్తే.. హాంకాంగ్‌లో 15%, శ్రీలంక 18%, బంగ్లాదేశ్ 25%, సింగపూర్ 22% కంటే దాదాపు రెండు నుంచి మూడు రెట్లు ఇండియాలో ఉండటమే ప్రస్తుతం రేట్ల తగ్గింపులకు పెరుగుతున్న డిమాండ్ కు కారణంగా తెలుస్తోంది. అలాగే ప్రస్తుతం దేశంలో అమలులో ఉన్న రెండు పన్ను విధానాలు ప్రజలకు క్లిష్టంగా ఉన్నాయని అసోచామ్ పేర్కొంది.
2018-19 నుంచి 2022-23 మధ్య కాలంలో ఇండియాలో పన్ను వసూళ్లు దాదాపు 76 శాతం పెరుగుదలను చూశాయి. 2018-19లో సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్‌తో సహా వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లు రూ.4,73,179 కోట్లుగా ఉండగా.. 2022-23 నాటికి ఈ సంఖ్య రూ.8,33,307 కోట్లకు పెరిగినట్లు సీబీడీటీ డేటా వెల్లడించింది. ఇక కార్పొరేట్ పన్నులను ఇదే కాలంలో పరిశీలిస్తే.. 2018-19లో రూ.6,63,572 కోట్ల నుంచి 2022-23లో రూ.8,25,834 కోట్లకు పెరిగాయి. స్థూల పన్ను రాబడికి కార్పొరేట్ పన్ను వాటా నిష్పత్తిని తగ్గించడానికి ప్రభుత్వం ఇటీవల ప్రయత్నాలు చేసింది.
More From GoodReturns

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications