అసోం ప్రభుత్వం కీలక నిర్ణయం...పెట్రోల్,డీజిల్‌పై రూ.5,లిక్కర్‌పై 25శాతం పన్ను తగ్గింపు...
మరో రెండు నెలల్లో అసోం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అక్కడి బీజేపీ ప్రభుత్వం ఓటర్లను ఆకర్షించే నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా పెట్రోల్,డీజిల్‌పై రూ.5,ఆల్కాహాల్‌పై 25శాతం సుంకాన్ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అసోం ఆర్థిక మంత్రి హిమంత బిశ్వ శర్మ ఈ ప్రకటన చేశారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి కొత్త ధరలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
శుక్రవారం(ఫిబ్రవరి 12) అసోం అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా మంత్రి హిమంత బిశ్వ శర్మ మాట్లాడారు. 'దేశంలో కరోనా వ్యాప్తి తీవ్ర స్థాయికి చేరినప్పుడు పెట్రోల్,డీజిల్,ఆల్కాహాల్‌పై అదనపు పన్ను విధించాం. ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య తగ్గిపోయింది. కాబట్టి పెట్రోల్,డీజిల్,ఆల్కాహాల్‌పై అదనపు సుంకాన్ని రద్దు చేయాలని నిర్ణయించాం. ఇందుకు సహకరించిన కేబినెట్ సహచరులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.' అని పేర్కొన్నారు.

ఎన్నికల నేపథ్యంలో రూ.60,784.03కోట్లుతో మంత్రి హిమంత ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2016-17,2019-2020లలో అసోం జీడీపీ గణనీయంగా పెరిగిందన్నారు. జాతీయ వార్షిక వృద్ది రేటు 6.11శాతం ఉండగా రాష్ట్ర వార్షిక వృద్ది రేటు 7.71శాతం ఉందన్నారు.
కాగా,ఈ ఏడాది ప్రారంభం నుంచి పెట్రోల్,డీజిల్ రేట్లు పైపైకి ఎగబాకుతూనే ఉన్నాయి. శుక్రవారం వరుసగా నాలుగో రోజు పెట్రోల్,డీజిల్ ధరలు 39పైసల మేర పెరిగాయి. పెరిగిన ధరలతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.91.65, డీజిల్ రూ.85.50లకు చేరింది. పెరుగుతున్న ఇంధన రేట్లపై జనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్,డీజిల్‌పై పన్నుల బాదుడు తగ్గించాలని కోరుతున్నారు. ఆల్ ఇండియా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అజయ్ బన్సల్ పెట్రోల్, డీజిల్‌లను వన్ నేషన్ వన్ రేట్ పద్దతిలో జీఎస్టీలో చేర్చాలని డిమాండ్ చేశారు. అలా అయితే చాలావరకు ధరలు తగ్గుతాయన్నారు.


Click it and Unblock the Notifications