ఆసియాలోని టాప్ 20 కుబేరుల వద్ద ఎంత సంపద ఉందో తెలుసా? కేవలం ఈ ఇరవై మంది దగ్గర 463 బిలియన్ డాలర్ల సంపద ఉంది. భారత కరెన్సీలో ఇది 34 లక్షల కోట్లకు పైగా. ఆసియా కుబేరుడు, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సంపద 74 బిలియన్ డాలర్లు. అంటే ఆసియాలోని టాప్ 20 మందిలో ఉన్న సంపదలో 17 శాతం అంబానీ వద్ద ఉంది. అతని సంపద దాదాపు రూ.6 లక్షల కోట్లు. ఆయన ప్రపంచ టాప్ 10 కుబేరుల జాబితాలోను చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే.

వారి కంటే ముఖేష్ ఫ్యామిలీ ఆస్తులు డబుల్
హంగ్‌కాంగ్‌కు చెందిన వోక్ ఫ్యామిలీ కంటే ముఖేష్ అంబానీ కుటుంబం ఆస్తుల ఇప్పుడు రెండింతల కంటే ఎక్కువగా ఉంటాయి. ఆసియాలో రెండో ధనిక ఫ్యామిలీ వీరిదే కావడం గమనార్హం. శాంసంగ్ అధినేత, సౌత్ కొరియాకు చెందిన కుబేరుడు లీ ఫ్యామిలీ సంపద కంటే అంబానీ కుటుంబం ఆస్తి మూడు రెట్లు ఎక్కువ. కరోనా మహమ్మారి సమయంలో అంబానీ ఆస్తులు భారీగా పెరిగాయి. జియో, రిలయన్స్ రిటైల్‌లోకి భారీగా పెట్టుబడులు రావడం, జియో కస్టమర్లు వేగంగా పెరగడం ఇందుకు దోహదపడింది. చమురు రంగం నుండి టెలికం, రిటైల్ సహా వివిధ రంగాల్లో ఉన్న ముఖేష్ అంబానీ తమ గ్రూప్ సంస్థల్లోకి పెట్టుబడులు ఆహ్వానిస్తున్నారు.

పెట్టుబడుల వెల్లువ
ప్రముఖ డిజిటల్ ఈక్విటీ సంస్థలు కేకేఆర్, టీపీజీలతో పాటు టెక్ దిగ్గజాలు ఫేస్‌బుక్, గూగుల్ వంటి సంస్థల నుండి జియో ప్లాట్‌ఫాంలోకి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయి. జియో ప్లాట్‌ఫాంలోకి 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. రిలయన్స్ రిటైల్‌లోకి నిధుల సేకరణ కోసం మరోసారి ఫండ్‌రెయిజింగ్ ప్రారంభించారు. రిలయన్స్ రిటైల్‌లో 10.09 శాతం వాటా విక్రయం ద్వారా ఇప్పటి వరకు రూ.47,000 కోట్లు సమీకరించారు. భారీ నిధుల సమీకరణ నేపథ్యంలో రిలయన్స్ షేర్ ఈ ఏడాది భారీగా పెరిగింది. అయితే ఇటీవల రూ.2300 దాటిన స్టాక్ ఇప్పుడు రూ.2000 దిగువకు పడిపోయింది.

16 బిలియన్ డాలర్లు అప్
రిలయన్స్ స్టాక్ భారీగా జంప్ చేయడంతో ముఖేష్ ఆస్తి కూడా ఈ ఏడాది 16 బిలియన్ డాలర్లు పెరిగింది. దీంతో ఆసియా టాప్ 20లోని ధనికుల సంపద మధ్య భారీ అంతరం ఏర్పడింది. ఆయన సోదరుడు అనిల్ అంబానీ ప్రస్తుతం అఫ్పుల్లో కూరుకుపోయారు. కానీ ముఖేష్ సంపద మాత్రం రోజురోజుకు పెరుగుతోంది. కాగా, ఈ జాబితాలో అలీబాబా గ్రూప్ హోల్డింగ్స్ జాక్‌మా వంటి ఫస్ట్ జనరేషన్ బిలియనీర్లను లెక్కలోకి తీసుకోలేదు. అందుకే చైనా నుండి జాబితాలో ఎవరూ లేరు. అయినప్పటికీ జాక్ మా ఆస్తుల కంటే ముఖేష్ అంబానీ ఆస్తి చాలా ఎక్కువ.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Bengaluru: బెంగళూరులో రియల్ ఎస్టేట్ మంట! మైసూరు నెక్స్ట్ టెక్ హబ్‌గా మారుతుందా?

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?



Click it and Unblock the Notifications