2020 డిసెంబర్ నెలలో ఆటో సేల్స్ పెరిగాయి. దేశీయ ఆటో మొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా(MSI) విక్రయాలు గత ఏడాది చివరి నెలలో ఏడాది ప్రాతిపదికన 20 శాతం పెరిగాయి. 2020 డిసెంబర్ నెలలో మారుతీ విక్రయాలు 160,226గా నమోదయ్యాయి. 2020-21 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో 495,897 యూనిట్లుగా నమోదయ్యాయి. ఏడాది ప్రాతిపదికన 13.4 శాతం వృద్ధిని నమోదు చేశాయి. డొమెస్టిక్ సేల్స్ 146,480గా ఉన్నాయి. కంపెనీ ఎగుమతులు 9,938గా నమోదయ్యాయి.

ఎంత పెరిగాయంటే
ఆల్టో, ఎస్ ప్రెస్సో వంటి మినీ కారు సేల్స్ 4.4 శాతం వృద్ధిని నమోదు చేసి, 24,927 యూనిట్లుగా నమోదయ్యాయి. 2019 డిసెంబర్ నెలలో ఈ సేల్స్ 23,883గా ఉన్నాయి.
వాగన్ఆర్, స్విఫ్ట్, సెలెరియో, ఇగ్నిస్, బాలెనో, డిజైర్ వంటి కాంపాక్ట్ సెగ్మెంట్ కారు సేల్స్ ఏకంగా 18.2 శాతం వృద్ధిని నమోదు చేశాయి. 2019 డిసెంబర్‌లో 65,673 యూనిట్లు కాగా, 2020 డిసెంబర్ నెలలో 77,641 యూనిట్లు సేల్ అయ్యాయి.
సియాజ్ వంటి మిడ్ సైజ్ కారు సేల్స్ ఏడాది ప్రాతిపదికన 28.9 శాతం క్షీణతను నమోదు చేశాయి. 2019 డిసెంబర్ నెలలో 1,786 యూనిట్లు కాగా, గత నెలలో 1,270 యూనిట్లకు క్షీణించాయి.
యుటిలిటీ వెహికిల్ సేల్స్ (విటారా బ్రెజ్జా, ఎస్ క్రాస్, ఎక్ఎల్ 6, ఎర్టిగా) సేల్స్ 8 శాతం పెరిగాయి. అంతకుముందు ఏడాది డిసెంబర్‌లో 23,808 యూనిట్లు సేల్ కాగా, గత నెలలో 25,701 యూనిట్లు నమోదయ్యాయి.

ఎగుమతులు 31 శాతం జంప్
ఎగుమతుల విషయానికి వస్తే ఏడాది ప్రాతిపదికన 31.4 శాతం పెరిగాయి. 2019 డిసెంబర్ నెలలో 7,561 యూనిట్లు కాగా, గత నెలలో 9,938 యూనిట్లకు పెరిగాయి.
ఇక, అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో ఈ ఆటో దిగ్గజం సేల్స్ 13.4 శాతం పెరిగి 4,95,897 యూనిట్లుగా నమోదయ్యాయి.
కాగా, మారుతీ సుజుకీ షేర్ ధర జనవరి 1, 2021న 0.76 శాతం లాభపడి రూ.7,708 వద్ద ట్రేడ్ అయింది.

మహీంద్రా సేల్స్ అదుర్స్, స్టాక్ జంప్
మరో దేశీయ ఆటో దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా సేల్స్ డిసెంబర్ నెలలో పెరిగాయి. దీంతో నేడు ఈ స్టాక్ జంప్ చేసింది. ఓ సమయంలో దాదాపు 3 శాతం మేర లాభపడింది. మహీంద్రా కంపెనీ పాసింజర్ వెహికిల్స్, కమర్షియల్ వెహికిల్స్, ఎగుమతులు... అన్నీ కలిపి 2020 డిసెంబర్ నెలలో 35,187 యూనిట్లుగా నమోదయ్యాయి. 2019 డిసెంబర్ నెలలో ఇది 39,230 యూనిట్లుగా ఉన్నాయి.
యుటిలిటీ వెహికిల్ సెగ్మెంట్ విషయానికి వస్తే 5 శాతం వృద్ధితో 15,225 యూనిట్ల నుండి 16,050 యూనిట్లకు, పాసింజర్ వెహికిల్ సేల్స్ 3 శాతం పెరిగి 16,182 యూనిట్లుగా నమోదయ్యాయి.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications