మరోసారి ఈ పెద్ద కంపెనీ నుంచి భారీ లేఅఫ్స్! ఈ సారి HR డిపార్ట్మెంట్ ఏ టార్గెట్
ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మరోసారి ఉద్యోగుల కోతలను ప్రకటించనుంది. ఈ కొత్త రౌండ్‌లో ముఖ్యంగా హ్యూమన్ రిసోర్సెస్ (HR) విభాగంలో సుమారు 15% ఉద్యోగాలు తగ్గించబడ్డాయి. అలాగే కంపెనీని మద్దతిచ్చే కొన్ని ఇతర విభాగాల పై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. Fortune తన విశ్వసనీయ వర్గాల ఆధారంగా ఈ సమాచారాన్ని వెల్లడించింది.
ఈ లేఅఫ్స్ ప్రధానంగా ఖర్చులను తగ్గించడం, అలాగే కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉత్పత్తులు మరియు AI ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో భారీగా పెట్టుబడులు పెట్టడం అని రిపోర్ట్‌లో వివరించారు. ఈ రౌండ్ ద్వారా HR విభాగంలోనే ఎక్కువ మంది ఉద్యోగులు కోల్పోతారని, ఇతర ప్రధాన విభాగాల ఉద్యోగులపై కూడా కొంత ప్రభావం ఉండే అవకాశం ఉందని మూలాలు చెబుతున్నాయి. కాని అమెజాన్ ప్రతినిధి కెల్లీ నాంటెల్ ఈ విషయం పై ఏమ్ స్పందించలేదు.

2022-23లో అమెజాన్ ఇప్పటికే 27,000 ఉద్యోగాలను కోల్పోయింది, ప్రధానంగా కార్పొరేట్ ఆఫీసులు, మేనేజ్‌మెంట్ విభాగాల్లో. ఆ సమయంలో మెటా, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి ఇతర పెద్ద టెక్ కంపెనీలు కూడా పెద్ద ఎత్తున లేఅఫ్స్ చేపట్టాయి. ఈ లేఅఫ్స్ వెనుక ముఖ్య కారణం AI. కంపెనీలు AI సిస్టమ్స్, ఆటోమేషన్ టూల్స్‌ను ఎక్కువగా ఉపయోగించడం వల్ల, మానవ శక్తి మీద ఆధారపడే పనులు తగ్గాయి. ఫలితంగా, వర్క్‌ఫోర్స్ సంఖ్య తగ్గినప్పటికీ, పనుల ఫలితాల సమర్థత పెరిగింది. అంటే, ఒక ఉద్యోగి కంటే AI మరియు టెక్నాలజీ ఉపయోగించి ఎక్కువ పనిని తక్కువ సమయంలో పూర్తి చేయగలగడం ద్వారా కంపెనీలకు ఖర్చు తగ్గించడానికి, పనితీరు మెరుగు పర్చడానికి అవకాశమొచ్చింది.
ఎందుకు లేఅఫ్స్?
రిపోర్ట్ ప్రకారం, అమెజాన్ ఈ లేఅఫ్స్ ద్వారా ఉద్యోగులు పై ఖర్చులు తగ్గించుకోవాలని చూస్తోంది. కంపెనీ ఇప్పుడు AI ఉత్పత్తులు, AI ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పై భారీగా పెట్టుబడి పెట్టడం
వల్ల, ఖర్చులను తగ్గించుకోవాలనీ అనుకుంటుంది. అమెజాన్ 2025లో $100 బిలియన్ పైగా పెట్టుబడి పెట్టి AI డేటా సెంటర్లు, క్లౌడ్ కంప్యూటింగ్ సెంటర్లు నిర్మించబోతోంది. ఇవి వినియోగదారుల కోసం అంతర్గత అవసరాల కోసం ఉపయోగపడతాయి. 2022 చివరి నుండి 2023 వరకు, CEO ఆండీ జాస్సీ ఇప్పటికే అమెజాన్లో "27,000 ఉద్యోగాలను" కోల్పోయిది అని ఆమోదం ఇచ్చారు. ఈ సమయంలో మెటా, గూగుల్ వంటి పెద్ద టెక్ కంపెనీలూ కూడా పెద్ద లేఅఫ్స్ చేస్తున్నాయి.
ఆండీ జాస్సీ ఉద్యోగులకు AI నేర్చుకుని ఇందులో ప్రావీణ్యం సాధించినవారే కంపెనీని కొత్తగా అభివృద్ధి చేయడంలో, కస్టమర్లకు మంచి సేవ అందించడంలో ముఖ్యంగా పాత్ర పోషిస్తారు. అదే సమయంలో AIను ఎక్కువగా ఉపయోగించటం వల్ల కంపెనీకి అవసరమయ్యే కార్పొరేట్ ఉద్యోగుల సంఖ్య తగ్గుతుందని కూడా ఆయన సూచించారు.
అమెజాన్ ఈ హాలిడే సీజన్‌లో 2,50,000 కొత్త ఉద్యోగులను నియమించనుంది, వీటిలో ఫుల్ టైమ్, పార్ట్‌టైం మరియు సీజనల్ రోల్స్ ఉంటాయి. తాత్కాలిక ఉద్యోగులు సగటున ఒక గంటకు $19 వేతనం పొందతారు, అలాగే శాశ్వత ఉద్యోగులు సగటున ఒక గంటకు $23 వేతనం పొందతారు.


Click it and Unblock the Notifications