Lotteries in AP: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టి దాదాపు ఏడాది పూర్తవుతోంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ పన్నులు, జీఎస్టీ ఆదాయం క్రమంగా తగ్గుతూ ఉండటం ప్రభుత్వాన్ని వేధిస్తోంది. గతంలో జగన్ సర్కార్ కంటే ప్రస్తుతం పన్నుల వసూళ్లు తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణం ప్రజల వద్ద ఖర్చు చేసేందుకు డబ్బు లేకపోవటమే అనే వాదన కూడా వినిపిస్తోంది.
ఇలాంటి పరిస్థితుల్లో ఏపీ సర్కార్ పన్ను ఆదాయాన్ని పెంచుకోవడానికి వివిధ అదనపు పన్నులు, సెస్‌ల ద్వారా రూ.13,100 కోట్ల వరకు ఆదాయం పొందే ప్రణాళికలను రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా లాటరీలు, ఆన్‌లైన్ గేమింగ్‌ను అనుమతించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు ఈ అంశంపై ప్రభుత్వం తరఫు నుంచి ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ ప్రతిపాదనలను ఆర్థిక శాఖ ఇప్పటికే సంబంధిత విభాగాలకు పంపిందని సమాచారం. సీఎం చంద్రబాబు దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఒక సీనియర్ అధికారి అందించిన సమాచారం ప్రకారం తెలుస్తోంది.
ఏపీలో ప్రస్తుతం లాటరీలపై నిషేధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే లాటరీలు, ఆన్‌లైన్ గేమింగ్‌లపై ప్రతిపాదిత పన్నుపై చట్టపరమైన అభిప్రాయం కూడా అవసరమని సదరు అధికారి పేర్కొన్నారు. వీటి నుంచి అదనపు పన్ను ఆదాయానికి ఉన్న వివిధ మార్గాలను ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అన్వేషించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒక శాతం స్టేట్ జీఎస్టీ ద్వారా రూ.4700 కోట్లు, మద్యంపై వ్యాట్, మెుబైల్ ఫోన్లపై పన్నుల ద్వారా మరో రూ.1300 కోట్లను సంపాదించాలని కూటమి చూస్తోంది. అలాగే స్టేట్ లాటరీల ద్వారా రూ.3000 కోట్లు, వినోదంపై పన్ను ద్వారా రూ.2300 కోట్లను సముపార్జించుకోవాలని కూటమి ప్రభుత్వం చూస్తున్నట్లు సీనియర్ అధికారి వెల్లడించారు.

ఆమోదం పొందిన తర్వాత వినోద పన్ను పెంపు సినిమా థియేటర్లు, పార్కులు, ఇతర పర్యాటక ఆకర్షణలలో అధిక ఛార్జీలకు దారితీస్తుంది. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడానికి, సూపర్ సిక్స్ పథకాల కింద ఎన్నికల ముందు వాగ్దానాలలో భాగంగా రాష్ట్రంలో అమలు చేయబడుతున్న మెగా సంక్షేమ పథకాలను కొనసాగించడానికి రాష్ట్రంలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉన్నందున, పన్ను ఆదాయం పెరగడం రాష్ట్ర ప్రభుత్వానికి చాలా కీలకంగా మారిపోయింది. అందుకే గడచిన కొన్నాళ్లుగా అధికారులు కొత్త ఆదాయాల అన్వేషణ పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.
కొత్త పన్ను ప్రతిపాదన ఆమోదించబడితే పన్ను ఆదాయం గణనీయంగా పెరుగుతుందని తెలుస్తోంది. అలాగే ఇప్పటికే చాలా కాలంగా నిర్లక్ష్యానికి గురైన ఏపీ రాజధాని అమరావతి పూర్తికి కూడా ఈ ఆదాయంలో కొంత భాగాన్ని కూటమి ప్రభుత్వం కేటాయించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. కాగా ఇప్పటికే అమరావతి ప్రాజెక్టు సెల్ఫ్ ఫైనాన్స్ ద్వారా పూర్తవుతుందని, పన్ను చెల్లింపుదారులపై ఎలాంటి అదనపు భారం ఉండబోదని కూటమి సర్కార్ చెప్పిన సంగతి తెలుస్తోంది. జాతీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి దీని కోసం తెచ్చే నిధుల లేదా రుణాల చెల్లింపులకు అదనపు పన్ను ఆదాయం వెన్నుదన్నుగా నిలుస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఆన్‌లైన్ గేమింగ్‌కు సంబంధించి విషయం ఏపీ హైకోర్టులో ఇప్పటికే విచారణలో ఉన్న సంగతి తెలిసిందే.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications