ఈ కంపెనీలో జీతాలు కోట్ల రూపాయల పైమాటే.. ఉద్యోగుల జీవితాలను ఒక్కసారిగా మార్చేసిన AI బూమ్..

ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మోడళ్లయిన 'క్లాడ్' (Claude), 'మిథోస్' (Mythos) రూపకర్త అయిన 'ఆంత్రోపిక్' (Anthropic) సంస్థ సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ ఏడాది మే నెలలో జరిగిన భారీ సిరీస్-హెచ్ ఫండింగ్ రౌండ్ తర్వాత ఈ స్టార్టప్ విలువ ఏకంగా $965 బిలియన్లకు (దాదాపు ₹81 లక్షల కోట్లు) చేరుకుంది.

ఈ అసాధారణ వృద్ధితో ఓపెన్‌ఏఐ (OpenAI) సంస్థను సైతం వెనక్కి నెట్టి.. ప్రపంచంలోనే అత్యంత విలువైన ప్యూర్-ప్లే ఏఐ కంపెనీగా ఆంత్రోపిక్ అవతరించింది. ప్రస్తుతం టెక్ ప్రపంచంలో ఏఐ నిపుణుల కోసం విపరీతమైన పోటీ నడుస్తున్నప్పటికీ, ఆంత్రోపిక్ తన ఉద్యోగులకు మిలియన్ల డాలర్ల భారీ వేతన ప్యాకేజీలను ఆఫర్ చేస్తూ ఇతర ల్యాబ్‌ల కంటే అత్యధిక స్థాయిలో తన ప్రతిభావంతులను నిలుపుకోగలుగుతోంది.

Anthropic Anthropic salary H-1B visa H-1B salaries AI jobs AI engineer salary artificial intelligence tech salaries US tech jobs AI hiring machine learning engineer software engineer salary AI talent Claude AI Silicon Valley jobs technology news base salary H-1B workers AI careers tech industry Anthropic H-1B H-1B AI AI AI AI Claude AI AI

బిజినెస్ ఇన్‌సైడర్‌కు లభించిన అమెరికా ఫెడరల్ హెచ్-1బి (H-1B) వీసా ఫైలింగ్‌ల ప్రకారం.. ఈ సంస్థలో పని చేస్తున్న కొందరు కీలక ఉద్యోగుల జీతాల వివరాలు వెల్లడయ్యాయి. ఇందులో టెక్నికల్ స్టాఫ్ మెంబర్ కేటగిరీ కింద ఉన్న ఇద్దరు ఉద్యోగులకు ఏకంగా $1.12 మిలియన్లు (సుమారు రూ. 10.2 కోట్లు) మరియు $1.38 మిలియన్ల (సుమారు రూ. 13.02 కోట్లు) వార్షిక మూల వేతనాన్ని (Base Salary) ఆంత్రోపిక్ చెల్లిస్తోంది. అయితే, ఈ ఫైలింగ్‌లలో కేవలం మూల వేతనం మాత్రమే ప్రస్తావించబడింది.

సాధారణంగా సిలికాన్ వ్యాలీలోని టెక్ కంపెనీలు అందించే బోనస్‌లు, సైన్-ఆన్ అలవెన్సులు లేదా ఈక్విటీ (స్టాక్ ఆప్షన్స్) వంటి భారీ ప్రయోజనాలు ఇందులో చేర్చలేదు. అవి కూడా కలిపితే మొత్తం వేతన ప్యాకేజీ విలువ ఊహించని స్థాయిలో ఉంటుంది. అమెరికా ప్రభుత్వ కఠిన విధానాల వల్ల పలు కంపెనీలు హెచ్-1బి వీసాల విషయంలో వెనకడుగు వేస్తున్నా, ఆంత్రోపిక్ మాత్రం ఓపెన్‌ఏఐ, ఎన్విడియా వంటి సంస్థలతో పోటీ పడుతూ 2026 ఆర్థిక సంవత్సరం మొదటి రెండు త్రైమాసికాలలోనే దాదాపు 80 మంది హెచ్-1బి ఉద్యోగులకు ధృవీకరణ (Certifications) పొందింది.

Also Read

ఆంత్రోపిక్ సంస్థలో వివిధ విభాగాలకు లభిస్తున్న వార్షిక వేతనాల పరిధి చాలా ఆకర్షణీయంగా ఉంది. అత్యున్నత సాంకేతిక సిబ్బందికి రూ. 1.26 కోట్ల ($133,952) నుండి గరిష్టంగా రూ. 13.02 కోట్ల ($1,380,000) వరకు లభిస్తుండగా, మేనేజర్ స్థాయిలో ఉన్న సాంకేతిక సిబ్బందికి రూ. 1.26 కోట్ల ($134,139) నుండి రూ. 8.02 కోట్ల ($850,000) వరకు అందుతోంది. ఏఐ పరిశోధనలో అత్యంత కీలకమైన 'రీఇన్‌ఫోర్స్‌మెంట్ లెర్నింగ్' పరిశోధకులకు రూ. 1.06 కోట్ల ($112,778) నుండి రూ. 4.71 కోట్ల ($500,000) వరకు వేతనం లభిస్తోంది.

కేవలం సాంకేతిక రంగానికే పరిమితం కాకుండా ప్రొడక్ట్ డిజైన్ మేనేజర్లకు రూ. 1.32 కోట్ల నుండి ₹3.6 కోట్ల వరకు, ప్రొడక్ట్ ఆపరేషన్స్, రీసెర్చ్ ఆపరేషన్స్ విభాగాలకు రూ. 1.17 కోట్ల నుండి రూ.4.71 కోట్ల వరకు ప్యాకేజీలు ఉన్నాయి. వీటితో పాటు కమర్షియల్ కౌన్సెల్ (వాణిజ్య సలహాదారు)గా చేసేవారికి రూ. 1.87 కోట్ల నుండి రూ. 3.01 కోట్ల వరకు, ఫైనాన్స్ & స్ట్రాటజీ విభాగానికి రూ. 1.72 కోట్ల నుండి రూ. 2.92 కోట్ల వరకు, అకౌంటింగ్ రంగానికి రూ. 1.33 కోట్ల నుండి రూ. 2.17 కోట్ల వరకు, టెక్నికల్ సేల్స్ ప్రతినిధులకు రూ. 1.46 కోట్ల నుండి రూ. 4.71 కోట్ల వరకు భారీ వేతనాలు అందుతున్నాయి. మార్కెటింగ్ విభాగం కూడా రూ.1.50 కోట్ల నుండి రూ. 1.88 కోట్ల వరకు వార్షిక వేతనాన్ని అందుకుంటూ టెక్ మార్కెట్లో సంచలనం సృష్టిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+