బంగారం కొనాలనుకునే వారికి షాకులు అలవాటయి పోయాయి. ఎందుకంటే పైపైకే చూస్తున్న బంగారం ధరలతో, ధరలు పెరుగుతున్న క్రమంలో సామాన్యులు బంగారం గురించి దిగులు పడటం తప్ప ఇంకేం చెయ్యలేని పరిస్థితులు కనిపించడం లేదు. బంగారం కొనుక్కోవాలనే ఆశ ఉన్నప్పటికీ ధరల కారణంగా బంగారం కొనడం కష్టమే అన్న ఆవేదన ప్రతి ఒక్కరికి వ్యక్తమవుతుంది. మళ్లీ ఎప్పటికైనా బంగారం ధరలు కిందికి రావా అన్నట్టు ఆశగా ఎదురుచూస్తున్నారు .
మళ్ళీ పెరుగుతున్న బంగారం ధరలు
మొన్న కాస్త తగ్గినట్టుగా కనిపించిన బంగారం మళ్ళీ వరుసగా రెండు రోజులు పాటు ధరలు దూకుడును కొనసాగించింది. డాలర్ పుంజుకోవడంతో బంగారం ధరలు పెరిగినట్టు తెలుస్తుంది. ఇక ఇంటర్నేషనల్ మార్కెట్లో బంగారం ధర స్పాట్ గోల్డ్ రేట్ ఔన్స్ కు కు 2357 డాలర్లుగా కొనసాగుతుంది.

ఢిల్లీలో బంగారం ధరలిలా
ఇక భారత దేశంలో బంగారం ధరల విషయానికి వస్తే ఈరోజు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 72 వేల 760 రూపాయలు కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 66,700 రూపాయలుగా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధర 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారానికి 72 వేల 910 కాగా 22 క్యారెట్ల బంగారం ధర 66 వేల 850రూపాయలుగా ఉంది.
ముంబై, హైదరాబాద్ లలో ధరలిలా
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 72 వేల 760 రూపాయలు కాగా, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 66 వేల 700 రూపాయలుగా ఉంది. హైదరాబాద్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 72 ,760, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 66,700 రూపాయలుగా ప్రస్తుతం విక్రయించబడుతుంది.
ఏపీలోనూ నేడు బంగారం ధరలిలా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, అనంతపురం, గుంటూరు, చిత్తూరు, నెల్లూరు లలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 72,760 రూపాయలు గాను, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 66, 700 రూపాయలు గానూ కొనసాగుతుంది. రూపాయి మారకం విలువ పతనం కావడంతో, డాలర్ ధర పుంజుకోవడంతో మళ్లీ బంగారం ధరలు పెరుగుతున్నాయి.


Click it and Unblock the Notifications