లుంబినీ ప్రావిన్స్‌లోని తిలోత్తమ మునిసిపాలిటీ-1కి చెందిన అంజు థాపాకు 11 ఏళ్ల వయసులో మొదటి పీరియడ్ వచ్చింది. స్థానిక సంప్రదాయం ప్రకారం ఆమె తొమ్మిది రోజుల పాటు గోశాలలో విడిగా నివసించవలసి వచ్చింది. రక్తస్రావం అడ్డుకోవడానికి గుడ్డలను ఉపయోగించారు. మురికి గుడ్డ ముక్కలను పదే పదే ఉపయోగించడం వల్ల ఆమెకు ఇన్ఫెక్షన్ సోకింది.
అప్పుడే అంజు థాపాకు ప్యాడ్స్ తయారు చేయాలని ఆలోచన వచ్చింది. చిన్నతనంలో ఏం చేయలేకపోయింది. కానీ పెళ్లైన తర్వాత భర్త సాయంతో అనుకున్నది చేసి పారిశ్రామికవేత్తగా మారింది. " పెళ్లైన తర్వాత నేను స్థానిక మార్కెట్లో లభించే అన్ని రకాల శానిటరీ ప్యాడ్‌లను ప్రయత్నించాను. కానీ అవి సరిగా లేవు" అని థాపా పేర్కొన్నారు. సౌదీ అరేబియాలో ఉద్యోగం చేస్తున్న భర్త ప్రకాష్‌తో థాపా తన సమస్యను పంచుకుంది. అతను ఆమెకు అక్కడ నుంటు పునర్వినియోగపరచదగిన శానిటరీ ప్యాడ్‌లవప పంపించాడు.

అవి స్థానిక మార్కెట్లో లభించే వాటి కంటే మెరుగ్గా ఉన్నాయని అంజు థాపా చెప్పారు. ఎటువంటి అలెర్జీ రాలేదన్నారు.
థాపా గర్భం దాల్చడంతో బ్యాంకు ఉద్యోగాన్ని వదులుకోవాల్సి వచ్చింది. దీంతో ఇంట్లో ఉంటూ తను అనుకున్న వ్యాపారాన్ని ప్రారంభించాడనికి కసరత్తు మొదలు పెట్టింది. ట్యుటోరియల్స్ విని ప్యాడ్‌లను తయారు చేయడం నేర్చుకుంది. మొదట్లో స్థానికంగా లభించే మెటీరియల్స్ తో ప్యాడ్స్ తయారు చేసింది.
ఆమె రెండు సంవత్సరాల ప్రయత్నంలో ప్యాడ్స్ తయారీలో నైపుణ్యం సాధించింది. 2019లో ఆమె శానిటరీ ప్యాడ్‌లను తయారు చేయడానికి తన సొంత ఫ్యాక్టరీని ఏర్పాటు చేసింది. ఆమె రూ.2.5 మిలియన్లు వెచ్చించి ఏడు యంత్రాలను కొనుగోలు చేసింది. చైనా, బంగ్లాదేశ్ నుంచి ముడి పదార్థాలను కొనుగోలు చేసింది. థాపా తన ఫ్యాక్టరీలో నలుగురు మహిళలు పనిచేస్తున్నారు. ఆమె భర్త ప్రకాష్ తన వ్యాపారాన్ని విస్తరించడంలో సహాయం చేయడానికి సౌదీ అరేబియా నుంచి తిరిగి వచ్చాడు.
ప్రకాష్ ఉత్పత్తిని విక్రయించడానికి డిజిటల్ మార్కెటింగ్, సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నాడు. పునర్వినియోగ ప్యాడ్స్ కు డిమాండ్ క్రమంగా పెరుగుతోందన్నాడు. యూజ్ అండ్ త్రో శానిటరీ ప్యాడ్‌ల వల్ల కలిగే కాలుష్యంపై అవగాహన పెరగడం కూడా పునర్వినియోగ ఉత్పత్తులకు డిమాండ్ పెరగడానికి కారణమని భార్యాభర్తల చెబుతున్నారు.
థాపా ఉత్పత్తులు ఇప్పుడు దేశవ్యాప్తంగా అమ్ముడవుతున్నాయి. వివిధ స్థానిక సంస్థలు, ఆరోగ్య సంస్థలు, మహిళా సంఘాల అభ్యర్థన మేరకు పునర్వినియోగ ప్యాడ్‌లను తయారు చేయడంలో మహిళలకు నేర్పించడానికి ఆమె వివిధ జిల్లాలకు కూడా వెళ్తున్నారు. అంజు థాపా విజయవంతమైన మహిళా పారిశ్రామికవేత్తగా ఎదిగారు.
More From GoodReturns

Trending: స్కూల్ మానేస్తే రూ. 2.8 కోట్లు ఇస్తామన్నారు.. కానీ, ఈ 16 ఏళ్ల కుర్రాడు ఏం చేశాడో చూడండి!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications