Reliance Power Stock: అనిల్ అంబానీ పరిస్థితి కూడా ఇటీవలి కాలంలో చూస్తుంటే గౌతమ్ అదానీ మాదిరిగానే మారింది. అంబానీ తన వ్యాపారాలను తిరిగి పునః నిర్మిస్తున్న వేళ అనేక అడ్డంకులను ఎదుర్కొంటున్నారు. గత ఏడాది నుంచి అదానీ సైతం హిండెన్ బర్గ్ వంటి అనేక ఆరోపణలను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. అయితే తన ప్రయత్న లోపం లేకుండా అనిల్ అంబానీ చేస్తున్న ప్రయత్నాలు ఆయనకు మంచి లాభాలను తెచ్చిపెడుతున్నాయని తెలుస్తోంది.
నేడు మార్కెట్ల ఇంట్రాడేలో ఇన్వెస్టర్ల చూపు ప్రధానంగా అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్ కంపెనీ షేర్లపై కొనసాగుతోంది. దీంతో స్టాక్ ఏకంగా 5 శాతం లోయర్ సర్క్యూట్‌లో లాక్ అయ్యింది. అయితే దీని వెనుక ఒక పెద్ద శుభవార్త ఉంది. అదేంటంటే సెప్టెంబర్ తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ.2,878.15 కోట్లకు చేరుకుంది. అయితే గత ఏడాది ఇదే సమయంలో కంపెనీ రూ.237.76 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. కంపెనీ ఒక్కసారిగా లాభదాయకంగా మారటం ఇన్వెస్టర్లలో పెద్ద జోష్ నింపుతోంది. ఇక ఆదాయం విషయానికి వస్తే కంపెనీ రెండవ క్వార్టర్‌లో రూ.1,962.77 కోట్లుగా ఉంది. గత ఏడాది ఇదే త్రైమాసిక సమయంలో ఆదాయం రూ.2116.37 కోట్ల కంటే ఇది తక్కువ.

వాస్తవానికి అనుబంధ కంపెనీని రద్దు చేయటంతో రిలయన్స్ పవర్ రూ.3,230.42 కోట్ల లాభాన్ని ఆర్జించిందని కంపెనీ తన స్టాక్ మార్కెట్ ఫైలింగ్స్‌లో వెల్లడించింది. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో రిలయన్స్ పవర్ దాని అనుబంధ సంస్థ విదర్భ ఇండస్ట్రీస్ పవర్ లిమిటెడ్ కోసం రూ.3,872 కోట్ల విలువైన గ్యారెంటర్ బాధ్యతలను పరిష్కరించుకుంది. రిలయన్స్ పవర్ దేశంలోని ప్రముఖ ప్రైవేట్ రంగ విద్యుత్ ఉత్పత్తి, బొగ్గు వనరుల సంస్థగా కొనసాగుతోంది. సాయంత్రం 2.47 గంటల సమయంలో రిలయన్స్ పవర్ లిమిటెడ్ కంపెనీ షేర్లు 5 శాతం తగ్గిన తర్వాత రూ.36.46 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి.
చాలా మంది ఇన్వెస్టర్లు కంపెనీ రెండవ త్రైమాసిక ఆదాయాలు తగ్గటంపై ప్రస్తుతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గడచిన ఐదు రోజుల్లో కంపెనీ షేర్లు 20 శాతం మేర పతనాన్ని చూశాయి. మార్చి 27, 2020లో కంపెనీ షేర్లు ఒక్కోటి కేవలం రూ.1.15 వద్ద ఉండగా.. ప్రస్తుతం రూ.36.46 వద్ద ఉంది. 2008 నుంచి 2020 వరకు మార్కెట్లో పవర్ కంపెనీ షేర్లు దాదాపు 99 శాతం క్షీణతను చూశాయి. దీని తర్వాత ప్రస్తుతం దీర్ఘకాలిక పెట్టుబడిదారులు స్టాక్ తన ఇన్వెస్టర్లకు 815 శాతం రాబడిని తెచ్చిపెట్టింది.


Click it and Unblock the Notifications