Anil Ambani: మెగా సోలార్ పవర్ ప్రాజెక్టుపై అంబానీ గురి.. ఎన్నివేల కోట్లంటే, టార్గెట్ ఏపీ..
Reliance Power: ముఖేష్ అంబానీ సోదరుడు ఒకప్పడి ప్రపంచ కుబేరుడు అనిల్ అంబానీ తన సెకండ్ ఇన్నింగ్స్ షురూ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎవ్వరు ఎన్ని అన్నా ఆయన తన పనిని తాను చాపకింద నీరులా చేసుకుంటూ పోతున్నారు.
ఇప్పుడు మనం మాట్లాడుకుబోతోంది అనిల్ అంబానీకి చెందిన సోలార్ పవర్ కంపెనీ గురించే. దేశం వేగంగా రెన్యూవబుల్ ఎనర్జీ వైపుకు మారుతున్న వేళ కొత్త వ్యాపార అవకాశాలను అనిల్ అన్వేషిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో రిలయన్స్ ఎన్యూ సన్టెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏపీలో దాదాపు రూ.10,000 కోట్లు పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేస్తోంది. కర్నూలు జిల్లాలో సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తోందని సమాచారం. వాస్తవానికి ఈ కంపెనీ రిలయన్స్ పవర్ అనుబంధ సంస్థ.

ప్రస్తుతం అంబానీ కంపెనీ ఏపీలో నిర్మిస్తున్న ప్రాజెక్టును సొంతంగా నిర్మించి ఆపరేట్ చేయాలని చూస్తోందని సమాచారం. ఇది ఆసియాలోనే అతిపెద్ద సోలార్ అండ్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్టుగా ఉండనుందని తెలుస్తోంది. ఈ 930 మెగావాట్ల ప్రాజెక్టులో 465 మెగావాట్లు/1,860 మెగావాట్ల బ్యాటరీ శక్తి నిల్వ వ్యవస్థ ఉంది. ఇది రోజుకు 4 గంటల గరిష్ట విద్యుత్ సరఫరాను హామీ ఇస్తుంది. అంటే ఏర్పాటు చేసే బ్యాటరీలు రోజుకు 4 గంటల డిశ్చార్జ్ వ్యవధితో విద్యుత్ అందిస్తుంది.
ఈ సోలార్ ప్రాజెక్టును అనిల్ అంబానీ కంపెనీ ప్రాజెక్టును 24 గంటల్లో పూర్తి చేయాలని చూస్తోంది. అలాగే ఇది ఎస్ఈసీఐతో 25 ఏళ్ల పాటు విద్యుత్ సరఫరా కోసం పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ చేసుకోవాలని చూస్తోంది. ఈ ప్రాజెక్టు నేరుగా 1000 మందికి ఉపాధిని కల్పించటంతో పాటు పరోక్షంగా మరో 5,000 మందికి ఉపాధి అవకాశాలను కల్పించనుందని తెలుస్తోంది. ఏపీ సర్కార్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్ట్రాటజీని అవలంభిస్తున్నందున ప్రాజెక్టు త్వరలోనే ప్రారంభం అవనుందని తెలుస్తోంది.
సోలార్ ఎనర్జీని అధునాతన శక్తి నిల్వ వ్యవస్థలతో అనుసంధానించడం ద్వారా, పునరుత్పాదక ఇంధ విశ్వసనీయత, ఖర్చు-సమర్థతను పెంచుతుందని తెలుస్తోంది. తక్కువగా సోలార్ ఎనర్జీ ఉత్పత్తయ్యే సమయంలో కూడా అంబానీ ఏర్పాటు చేస్తున్న ప్లాంట్ స్థిరమైన విద్యుత్ సరఫరాను అందించటానికి తాజా బ్యాటరీ టెక్నాలజీ దోహదపడుతుందని తెలుస్తోంది. రెన్యూవబుల్ ఎనర్జీతో శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించాలని భారతప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ఇది దోహదపడుతుందని తెలుస్తోంది.
అయితే అనిల్ అంబానీ చేస్తున్న తాజా ప్రయత్నాలతో రిలయన్స్ పవర్ కంపెనీ ఇన్వెస్టర్లు పండుగ చేసుకుంటున్నారు. కంపెనీ షేర్లు లాభపడతాయని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. మంగళవారం మార్కెట్ల ముగింపు సమయంలో స్టాక్ ధర ఎన్ఎస్ఈలో రూ.39.20 వద్ద ఒక్కోటి ముగిసింది.


Click it and Unblock the Notifications