Reliance Power: అనిల్ అంబానీ దేశీయ స్టాక్ మార్కెట్లలో ప్రస్తుతం ట్రెండింగ్ అవుతున్న పేరు. దశాబ్ధాల తర్వాత పతనం నుంచి తిరిగి పుంచుకుంటున్న అనిల్ అంబానీ సరికొత్త అధ్యాయానికి నాంది పలికారు. ప్రస్తుతం ఆయన తన లిస్టెడ్ కంపెనీల రుణాలను సెటిల్ చేసుకుంటూ తిరిగి సెకండ్ ఇన్నింగ్స్ ఆడేందుకు వ్యాపార ప్రయాణాన్ని స్టార్ట్ చేయటం పెద్ద విజయాన్ని సాధిస్తోంది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్ కంపెనీ షేర్ల గురించే. పవర్ స్టాక్ షేర్లు ప్రస్తుతం పవర్‌ఫుల్ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో స్టాక్ నిరంతరం 5% అప్పర్ సర్క్యూట్ తాకుతూనే ఉంది. దీంతో నేడు స్టాక్ సరికొత్త 52 వారాల గరిష్ఠ ధర రూ.51.10ని చేరుకుంది. గడచిన 10 ట్రేడింగ్ సెషన్లలో నిరంతరాయంగా అప్పర్ సర్క్యూట్ కొడుతూ సంచలనం సృష్టిస్తోంది. ఈ క్రమంలో గత ఐదు రోజుల్లో కంపెనీ షేర్లు 23% పెరుగుదలను చూసింది.

గడచిన నాలుగేళ్లలో కంపెనీ షేర్లు భారీ పతనం నుంచి పెరిగి 4343 శాతం బలమైన రాబడిని అందుకున్నాయి. మార్చి 27, 2020న ఈ షేర్ ధర కేవలం రూ.1.15 వద్ద ఉంది. దీనికి ముందు కంపెనీ షేర్లు 2008, మే 23న అత్యధికంగా రూ.274 నుంచి భారీ పతనాన్ని చూసింది. ఈ క్రమంలో 2008-2020 మధ్య కాలంలో స్టాక్ విలువ అత్యధికంగా 99 శాతం నష్టాన్ని చవిచూసింది. కానీ ఇప్పుడు కంపెనీ షేర్లకు మంచి సమయం వచ్చింది. కంపెనీ రుణాన్ని త్వరగా తిరిగి చెల్లించడం, నిధులను సమీకరించడం వంటి కీలక పరిణామాలు రిలయన్స్ పవర్ కంపెనీ షేర్ల పెరుగుదలకు దారితీశాయి. రిటైల్ ఇన్వెస్టర్లు సైతం కంపెనీ షేర్లను దక్కించుకునేందుకు ఎక్కువగా ఆసక్తి చూపటంతో షేర్లు నిరంతరాయంగా పెరుగుతూనే ఉన్నాయి.
రిలయన్స్ పవర్ కంపెనీ గడచిన నెలలో ఏకంగా మూడు కీలకమైన ప్రకటనలు చేసింది. ఈ కారణంగా కంపెనీ షేర్లపై ఇన్వెస్టర్ల ఫోకస్ పెరిగింది. ముందుగా పవర్ కంపెనీ అనుబంధ సంస్థ రోసా పవర్ సింగపూర్ ఆధారిత రుణదాత వెర్డే పార్ట్‌నర్స్‌కు రూ.850 కోట్ల రుణాన్ని చెల్లించింది. దీని తర్వాత కంపెనీ అప్పులు సున్నాకు చేరుకున్నాయి. రోజా పవర్ ఇప్పుడు రుణ రహితంగా మారిన తర్వాత.. రిలయన్స్ పవర్ లిమిటెడ్‌కు చెందిన మరో అనుబంధ విభాగమైన విదర్భ ఇండస్ట్రీస్ పవర్‌కు సంబంధించిన గ్యారెంటర్‌కు సంబంధించిన రూ.3,872 కోట్ల బాధ్యతలు పూర్తయ్యాయి. ఇవి కంపెనీని రుణ బాధ్యతల నుంచి తప్పించింది.
ఇక చివరిగా కంపెనీ బోర్డు ప్రిఫరెన్షియల్ ఇష్యూ ద్వారా రూ.1,525 కోట్లను సమీకరించేందుకు ప్రయత్నించటానికి ఆమోదాన్ని ఇవ్వటం షేర్లలో కొత్త ట్రిగర్ తీసుకొచ్చింది. ఈ నిధులతో కంపెనీ వ్యాపారాన్ని విస్తరించాలని చూస్తోంది. రిలయన్స్ పవర్ షేర్లు గత ఐదేళ్లలో 1,985% రాబడిని అందించాయి. ఈ కాలంలో దీని ధర రూ.2.45 నుంచి ప్రస్తుత ధర రూ.51.10కి పెరిగింది.


Click it and Unblock the Notifications