Reliance Power Stock: అనిల్ అంబానీ ప్రస్తుతం తరచుగా వార్తల్లో వినిపిస్తున్నారు. దివాలా తర్వాత మసకబారిన బిలియనీర్ పేరు ప్రఖ్యాతలు ప్రస్తుతం తిరిగి పుంజుకుంటున్నాయి. తన ఇద్దరు కుమారులు వ్యాపార బాధ్యతలు చేపట్టిన తర్వాత అనిల్ అంబానీ కంపెనీ షేర్లు ఎగబాకుతున్నాయి.
ఈ క్రమంలో తాజాగా రిలయన్స్ పవర్ షేర్లు నేడు ఇంట్రాడేలో అప్పర్ సర్క్యూట్ తాకాయి. అంబానీ పవర్ స్టాక్ 5 శాతం అప్పర్ సర్క్యూట్ తాకటంతో షేర్ ధర రూ.32.81 స్థాయికి చేరుకున్నాయి. దీనికి ముందు ఆగస్టు 16 ట్రేడింగ్ సెషన్లో సైతం కంపెనీ షేర్లు అప్పర్ సర్క్యూట్‌లో లాక్ అయ్యాయి. అయితే ఇక్కడ ఇన్వెస్టర్లు గమనించాల్సిన ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. రిలయన్స్ పవర్ షేర్ల పెరగడానికి అదానీ పవర్‌కి సంబంధించిన ఒక వార్తని తెలుస్తోంది.

రిలయన్స్ పవర్‌కు చెందిన 600 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్‌ను కొనుగోలు చేసేందుకు అదానీ గ్రూప్ కంపెనీ అదానీ పవర్ చర్చలు జరుపుతోందని నివేదికల ద్వారా వెల్లడైంది. అదానీ పవర్ నాగ్‌పూర్‌లోని 600 మెగావాట్ల బుటిబోరి థర్మల్ పవర్ ప్రాజెక్ట్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తిగా ఉందని తెలుస్తోంది. CFM అసెట్ రీకన్‌స్ట్రక్షన్ రిలయన్స్ పవర్ అన్ని రుణాలను రూ.1,265 కోట్లకు కొనుగోలు చేసింది. అలాగే ప్రస్తుతం ప్రాజెక్ట్‌కు ఏకైక రుణదాతగా ఉంది.
ఈ క్రమంలో కంపెనీ కొనుగోలు కోసం అదానీ పవర్ CFM అసెట్ రీకన్‌స్ట్రక్షన్‌తో చర్చలు జరుపుతోందని విషయంపై అవగాహన ఉన్న వ్యక్తి తెలిపారు. ఇంతకు ముందు ఈ పవర్ ప్లాంట్ మొత్తం ఖర్చు దాదాపు రూ.6,000 కోట్లు. ఇందులో రెండు పవర్ ప్లాంట్ యూనిట్లు కూడా ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఈ యూనిట్లు మూతపడ్డాయి. దీంతో వాల్యుయేషన్ తగ్గింది. చర్చలకు సంబంధించి ఇప్పటి వరకు అదానీ గ్రూప్, సీఎఫ్ఎమ్ ఎటువంటి అధికారిక ప్రకటన ఇప్పటి వరకు చేయలేదు. ఈ ఊహాగానాలు మార్కెట్లో కొనసాగటంతో నేడు ఇంట్రాడేలో రిలయన్స్ పవర్ షేర్ల ధర పెరిగింది. గడచిన ఏడాది కాలంలో స్టాక్ ధర 98 శాతం, ఆరు నెలల్లో 23 శాతం, ఒక్క నెలలో 16 శాతం మేర ఎగబాకాయి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications