Reliance Power: ఒకప్పుడు అంబానీ బ్రదర్స్ ఇద్దరూ దేశంలోనే కాక ప్రపంచ కుబేరుల జాబితాలో ఉండేవారు. అయితే తర్వాతి కాలంలో అనిల్ అంబానీ సంపదను కోల్పోవటంతో ఆయన ప్రాచుర్యం నుంచి కనుమరుగయ్యారు. అయితే ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే అనిల్ బౌన్సింగ్ బ్యాక్ అన్నట్లు కనిపిస్తోంది.
వివరాల్లోకి వెళితే.. 2024 ఆర్థిక సంవత్సరం చివరి వారంలో రిలయన్స్ పవర్ షేర్లలో విపరీతమైన పెరుగుదల నమోదైంది. రిలయన్స్ అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్ కంపెనీ రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ ద్వారా రుణ తగ్గింపు, మూలధన పెట్టుబడికి సంబంధించి వార్తలు మార్కెట్లు ఉన్నాయి. దీంతో రిలయన్స్ పవర్ షేర్లలో జోరు పెరిగింది. ఈ ర్యాలీ కారణంగా అనిల్ అంబానీ కంపెనీ షేర్ల ధర మార్చి 13, 2024న ఒక్కో షేరుకు రూ.20.40 వద్ద ముగిసిన తర్వాత NSEలో ఒక్కో షేరుకు రూ.28.25 స్థాయికి చేరుకుంది. గడచిన వారంలో షేర్లు దాదాపు 40 శాతం పెరుగుదలను చూశాయి.

రిలయన్స్ ADAG కంపెనీ స్టాక్ కోవిడ్ అనంతర రీబౌండ్‌లో బలమైన లాభాలను కనబరిచింది. గత నాలుగేళ్లలో NSEలో రిలయన్స్ పవర్ షేర్ ధర ఒక్కో షేరుకు రూ.1.20 నుంచి రూ.28.25కి పెరిగింది. ఈ సమయంలో దాదాపు 2,250 శాతం పెరుగుదల నమోదైంది. వాస్తవానికి 2008లో రిలయన్స్ పవర్ కంపెనీ షేరు లిస్టింగ్ సమయంలో ఒక్కోటి రూ.450 ధరకు మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఎన్ఎస్ఈలో రూ.530, బీఎస్ఈలో రూ.547.80 రేటుకు జాబితా అయిన సంగతి తెలిసిందే.
ఛాయిస్ బ్రోకింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుమీత్ బగాడియా రిలయన్స్ పవర్ షేర్ల ఔట్‌లుక్‌పై మాట్లాడుతూ.. గత రెండు వారాలుగా రిలయన్స్ పవర్ షేర్లు స్థిరమైన పెరుగుదలను కలిగి ఉన్నాయన్నారు. అయితే రిలయన్స్ షేరు రూ.30 వద్ద అడ్డంకులు ఎదుర్కొంటోందన్నారు. పవర్ షేర్‌లు ఒక్కో షేరుకు రూ.22 స్థాయిలో బలమైన మద్దతును కలిగి ఉన్నాయన్నారు. అందువల్ల రిలయన్స్ పవర్ షేర్‌లను వారి పోర్ట్‌ఫోలియోలో కలిగి ఉన్నవారు ఒక్కో షేరుకు రూ.22 స్థాయిలో స్టాప్ లాస్‌ను కొనసాగించాలని, స్వల్ప కాలంలో స్టాక్ ధర రూ.34ను తాకవచ్చని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications