Reliance Power: అనిల్ అంబానీకి చెందిన కంపెనీలు ప్రస్తుతం దేశీయ స్టాక్ మార్కెట్లో పవర్ ఫుల్ జర్నీని చూస్తున్నాయి. చాలా కాలం తర్వాత అంబానీపై మార్కెట్లో ఇన్వెస్టర్లు బలమైన విశ్వాసాన్ని చూపిస్తున్నారు. తిరిగి తన వ్యాపార ప్రస్థానాన్ని ఉత్తమ స్థాయిలకు తీసుకెళ్లేందుకు అనిల్ చేస్తున్న ప్రయత్నాలకు ఇన్వెస్టర్లు అండగా నిలుస్తున్నారు.
ఈ క్రమంలో అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్ షేర్లు గడచిన వారం రోజులుగా తమ బులిష్ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి. దీంతో షేర్ల ధర నేడు సరికొత్త 52 వారాల గరిష్ఠం రూ.42.06ని తాకింది. వరుసగా ఆరు ట్రేడింగ్ సెషన్ల నుంచి కంపెనీ షేర్లు 5 శాతం అప్పర్ సర్క్యూట్ తాకుతూ ఇన్వెస్టర్లకు లాభాల పంట కురిపిస్తున్నాయి. అలాగే రియలన్స్ గ్రూప్ ఇతర లిస్టెడ్ కంపెనీల షేర్లు సైతం తమ జోరును కొనసాగిస్తున్నాయి. ఒక దశలో దివాలా తీసిన అనిల్ అంబానీ సంపద ఏకంగా సున్నాకు దిగజారిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం తన కుమారుల సాయంతో తిరిగి తన వ్యాపార సామ్రాజ్యాన్ని అనిల్ అంబానీ రివైవ్ చేస్తున్నారు.

ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తుంటే.. అనిల్ అంబానీ కంపెనీలు మళ్లీ ట్రాక్‌లోకి వచ్చాయి. దీనికి అసలైన కారణాన్ని పరిశీలిస్తే.. కొద్దిరోజుల క్రితం రిలయన్స్ గ్రూప్ కంపెనీలు బ్యాంకులకు రుణాల చెల్లింపులను వేగవంతం చేయటమే దీనికి కారణం. అయితే రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ రుణాల విషయంలో ముందుగా సెబీ నుంచి ఎదురుదెబ్బ తిన్న అనిల్ అంబానీ, నిన్న అతని కుమారుడు అన్మోల్ అంబానీకి కూడా తగిలింది. సెబీ అనిల్ అంబానీపై రూ.25 కోట్ల భారీ జరిమానాను విధించగా, కుమారుడిపై రూ.కోటి జరిమానా విధించబడింది. ఈ పరిస్థితులతో కొంత ఒడిదొడుకులకు అనిల్ అంబానీ లిస్టెడ్ స్టాక్స్ గురైనప్పటికీ స్థిరంగా వృద్ధి బాటలోనే ప్రస్తుతం కొనసాగుతున్నాయి.
దీనికి తోడు ఇటీవల.. రిలయన్స్ పవర్ ఫండ్ రైజింగ్‌ను ప్రకటించడంతో స్టాక్‌పై ఇన్వెస్టర్ల ఆసక్తి రోజురోజుకూ పెరిగిపోతోంది. మరోవైపు రిలయన్స్ పవర్ తన రుణాలన్నింటినీ సెటిల్ చేసుకుని రుణ రహిత సంస్థగా మారినట్లు గతవారం స్టాక్ మార్కెట్లకు అందించిన వివరాల్లో పేర్కొంది. ఇదే క్రమంలో రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ 90 శాతానికి పైగా రుణాలను క్లియర్ చేసినట్లు తెలిపింది. దీంతో రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ షేర్లు మళ్లీ అప్పర్ సర్క్యూట్‌ను తాకుతున్నాయి. నిన్న ఇంట్రాడే సమయంలో రిలయన్స్ పవర్ షేర్లు 5 శాతం పెరిగి రూ.40.05 వద్ద ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి.
గతవారం రోజులుగా స్టాక్ పనితీరును పరిశీలిస్తే 5 రోజుల కింద నుంచి ఒక్కో షేరు ధర రూ.21.47 పెరిగింది. ప్రస్తుత మార్కెట్ క్యాప్ రూ.16.09 వేల కోట్లుగా ఉండగా.. ఇటీవల కంపెనీ రూ.1,525 కోట్ల విలువైన ప్రిఫరెన్స్ షేర్లను జారీ చేస్తున్నట్లు ప్రకటించింది. కంపెనీ ప్రమోటర్ అయిన రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ తన ఈక్విటీ వాటాను రూ.600 కోట్లకు పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. సంస్థ ఈ నిధులను నేరుగా లేదా అనుబంధ సంస్థలు, జాయింట్ వెంచర్లలో పెట్టుబడుల ద్వారా వ్యాపార కార్యకలాపాలను విస్తరించడానికి ఉపయోగించబడతాయి.


Click it and Unblock the Notifications