Reliance Infrastructure: దేశీయ స్టాక్ మార్కెట్లలో కొనసాగుతున్న బుల్ జోరు ఇన్వెస్టర్లతో పాటు ప్రమోటర్లను ధనవంతులుగా మార్చుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఒకప్పుడు దెబ్బతిన్న బిలియనీర్ అంబానీ సోదరుడు అనిల్ కంపెనీలకు సైతం మేలు చేస్తోంది.
దాదాపు దశాబ్దకాలం తర్వాత తిరిగి లైమ్ లైట్ లోకి వచ్చిన అనిల్ అంబానీ తన సోదరుడితో సమానంగా సంపద ఉన్న స్థాయి నుంచి దివాలా స్థాయికి చేరుకున్నారు. వాస్తవానికి ఆయన పెట్టిన కంపెనీలకు చెందిన రంగాలు ప్రస్తుతం దేశంలో ప్రధాన రంగాలుగా మారాయి. అయితే భారీ అప్పులు కంపెనీలకు చేటుచేశాయి. ఈ క్రమంలో అనిల్ వ్యాపారాలు ప్రస్తుతం వరకు కొనసాగి ఉంటే అదానీ స్థానంలో ఉండేవారేమో.

అయితే అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ షేర్లు గత కొన్ని రోజులుగా భారీ పతనం తర్వాత బుల్ ర్యాలీలో చేరాయి. దీంతో షేర్ ధర మళ్లీ రూ.200 మార్కును దాటింది. నేడు ఇంట్రాడేలో స్టాక్ 3 శాతం లాభపడి రూ.205.70 స్థాయిలకు చేరింది. గడచిన నాలుగేళ్లలో స్టాక్ తన పెట్టుబడిదారులకు ఏకంగా 2100 శాతం కంటే ఎక్కువ రాబడిని అందించింది. ఈ క్రమంలో స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ.308 వద్ద ఉండగా కనిష్ఠ ధర రూ.143.70గా ఉంది. స్టాక్ ధర జనవరి 4, 2008లో అత్యధికంగా రూ.2510.35 వద్ద ఉంది. అక్కడి నుంచి అనిల్ అంబానీ స్టాక్ 99 శాతం పడిపోయి మార్చి 27, 2020లో రూ.9.20కి పడిపోయింది.
ఇక మూడేళ్లల కాలాన్ని పరిశీలిస్తే రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ షేర్లు 167% కంటే ఎక్కువ రాబడిని అందించాయి. జూలై 30, 2021న అనిల్ అంబానీకి చెందిన కంపెనీ షేర్లు రూ.76.45 రేటు నుంచి జూలై 30, 2024న కంపెనీ షేర్లు రూ.205.70 పెరిగాయి. 2024లో కంపెనీ షేర్ల ధర జూన్ 5న కనిష్ఠమైన రూ.143.70కి దిగజారింది. అక్కడి నుంచి తిరిగి బుల్స్ జోరులో చేరిన రిలయన్స్ ఇన్‌ఫ్రా కంపెనీ షేర్లు దాదాపు 40 శాతానికి పైగా ఎగబాకాయి. అలాగే 6 నెలల కాలంలో స్టాక్ దాదాపు 12 శాతం పడిపోయాయి. ఈరోజు మధ్యాహ్నం 3.01 గంటల సమయంలో ఎన్ఎస్ఈలో స్టాక్ ధర ఒక్కోటి రూ.202 వద్ద కొనసాగుతోంది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.7,984గా ఉంది.
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns Telugu would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications