Reliance Infra Stock: దేశంలో ప్రస్తుతం అందరూ అంబానీ ఫ్యామిలీ గురించే మాట్లాడుకుంటున్నారు. అంబానీ సోదరుల్లో ఒకరైన ముఖేష్ తన చిన్న కుమారుడు అనంత్ వివాహాన్ని గ్రాండ్‌గా నిర్వహించటమే దీనికి కారణం. ఇదే క్రమంలో సోదరుడు అనిల్ అంబానీకి చెందిన కంపెనీల పేర్లు స్టాక్ మార్కెట్లో చాలా కాలం తర్వాత చర్చకు వస్తున్నాయి.
వివరాల్లోకి వెళితే.. అనిల్ అంబానీకి చెందిన చాలా కంపెనీలు దివాలా ప్రక్రియను ఎదుర్కొంటున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలో ఆయనకు చెందిన కొన్ని కంపెనీలు మాత్రం రుణాల చెల్లింపులతో వార్తల్లో నిలుస్తున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ స్టాక్ గురించే. ఏప్రిల్ 4, 2024న 52 వారాల గరిష్ట స్థాయి రూ.308 వద్ద ఉంది. వాస్తవానికి జనవరి 2008లో రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ షేర్ల ధర ఒక్కోటి రూ.2,400 స్థాయిని అధిగమించిన సంగతి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అయితే ప్రస్తుతం రికవరీ మోడ్‌లో ఉన్న స్టాక్ గత ఏడాదిలో 40%, ఐదేళ్లలో 270% లాభపడింది.

ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం మెట్రో-1ని కొనుగోలు చేసే తన ప్రణాళికలను వెనక్కి తీసుకుంది. అయితే రాష్ట్ర మంత్రివర్గం ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ(MMRDA) కార్యనిర్వాహక కమిటీకి ఒక ముఖ్యమైన దిశను ఇచ్చింది. ముంబై మెట్రో వన్ ప్రైవేట్ లిమిటెడ్(MMOPL) రుణదాతలకు ఇచ్చిన రూ.1,700 కోట్ల రుణాన్ని మూల్యాంకనం చేసిన తర్వాత సెటిల్‌మెంట్ ఆర్డర్ ఇవ్వబడింది.
ముంబైలోని ఈ మెట్రో లైన్ ప్రైవేట్ పబ్లిక్ పార్టనర్‌షిప్ మోడల్ కింద నిర్మించబడింది. దీనిని రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ స్పెషల్ పర్పస్ వెహికల్(SPV), ముంబై మెట్రో వన్ ప్రైవేట్ లిమిటెడ్(MMOPL) సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. కంపెనీలో అనిల్ రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు 74 శాతం వాటా కలగి ఉంది. అలాగే ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ(MMRDA) 26 శాతం వాటాను కలిగి ఉంది. ఈ మెట్రో ద్వారా రోజూ 4.6 లక్షల మంది ప్రయాణికులకు సేవలందిస్తోంది. రుణాలు చెల్లించేందుకు జరుగుతున్న ప్రయత్నాలతో ప్రాజెక్టు ఫైనాన్స్ చేసిన 6 రుణ సంస్థలకు త్వరలోనే డబ్బు చేరే అవకాశం ఉందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications