Anil Ambani: 5 రోజులుగా అంబానీ స్టాక్ అప్పర్ సర్క్యూట్.. ఈవారం 46% అప్, మీరూ కొన్నారా..?
Reliance Infra: దేశీయ స్టాక్ మార్కెట్లలో ప్రస్తుతం ఏం నడుస్తోంది అంటే అనిల్ అంబానీ కంపెనీల షేర్ల సునామీ అని చెప్పుకోవచ్చు. దివాలాతో కాలగర్భంలో కలిసిపోయిన అనిల్ అంబానీ పేరు ప్రస్తుతం ఆయన కమ్ బ్యాక్ స్టోరీతో మళ్లీ మీడియా ఫోకస్ సంపాదించుకుంటోంది. ఈ క్రమంలో అనిల్ అంబానీ ముందుగా తన పాత రుణాల చెల్లింపులను చేపడుతూ కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు.
ఈ చర్యలు లిస్టెడ్ అనిల్ అంబానీ కంపెనీ షేర్లకు స్వర్ణ యుగాన్ని తిరిగి తీసుకొస్తున్నాయని చెప్పుకోవచ్చు. దీంతో నమ్మకంగా పెట్టుబడులను దీర్ఘకాలం నుంచి కొనసాగిస్తున్న చాలా మందికి ప్రస్తుతం కనకవర్షం కురుస్తోంది. దీనికి తోడు అనిల్ అంబానీ భవిష్యత్తు వ్యాపార ప్రణాళికలు బయటకు పొక్కటం కూడా ఆయన ప్రయాణంపై పెట్టుబడిదారుల్లో కొత్త ఆశలను చిగురింపజేస్తోంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది రిలయన్స్ ఇన్‌ఫ్రా కంపెనీ షేర్ల గురించే. నేడు ఇంట్రాడేలో కంపెనీ షేర్లు ఏకంగా 9 శాతం పెరుగుదలతో దూసుకుపోతున్నాయి. దీంతో స్టాక్ సరికొత్త 52 వారాల గరిష్ఠ ధర రూ.312.98ని చేరుకున్నాయి. ఈ వారం ప్రారంభం నుంచి కంపెనీ షేర్ల పనితీరును పరిశీలిస్తే.. రాకెట్ వేగంతో నిరంతరాయంగా అప్పర్ సర్క్యూట్ కొడుతున్న షేర్లు 46 శాతం పెరుగుదలను చూశాయి.

ఇప్పటికే వారం ప్రారంభంలో రిలయన్స్ పవర్ కంపెనీ పూర్తిగా రుణ విముక్తులైందనే వార్త పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించగా.. దీనికి తోడు ప్రస్తుతం ఇన్‌ఫ్రా కంపెనీ నుంచి మరో శుభవార్త కూడా అందించింది. అవును తాజాగా అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ తన విస్తరణ ప్రణాళికలకు నిధులు సమకూర్చేందుకు రూ.6,014 కోట్లు సమీకరించాలని యోచిస్తోంది. తొలి దశలో ప్రిఫరెన్షియల్ ఇష్యూ ద్వారా రూ.3,014 కోట్లు, రెండవ దశలో క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్ డీల్ ద్వారా మరో రూ.3,000 కోట్లు సమీకరించనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో బ్లాక్‌స్టోన్ మాజీ చీఫ్ మాథ్యూ సిరియాక్, ఈక్విటీ ఇన్వెస్టర్ నిమిష్ షా మైనారిటీ వాటా కోసం రిలయన్స్ ఇన్‌ఫ్రా ప్రిఫరెన్షియల్ ఇష్యూలో రూ.1,814 కోట్లు పెట్టుబడి పెట్టనున్నారు. కంపెనీ ఈ సొమ్మును వర్కింగ్ క్యాపిటల్, విస్తరణ ప్రణాళికల కోసం వినియోగించాలని చూస్తోంది.
రిలయన్స్ ఇన్‌ఫ్రాలో రైజీ ఇన్ఫినిటీకి ఇప్పటికే దాదాపు 16 శాతం వాటా ఉంది. రిలయన్స్ ఇన్‌ఫ్రా ఈక్విటీ షేర్లు జారీ చేయాలా లేదా కన్వర్టబుల్ వారెంట్లు జారీ చేయాలా అనేదానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కంపెనీ వ్యాపారాన్ని పరిశీలిస్తే.. రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రధానంగా దిల్లీలో విద్యుత్ పంపిణీ, EPC సేవలను అందిస్తోంది. అలాగే కీలకమైన రక్షణ రంగంలో కొన్ని ప్రాజెక్టులను కూడా నిర్వహిస్తోంది. అలాగే మెట్రో సేవలు, టోల్ రోడ్లు, విమానాశ్రయ మౌలిక సదుపాయాలను నిర్వహరణలో సైతం కంపెనీ తన ఆపరేషన్స్ కలిగి ఉంది.


Click it and Unblock the Notifications