Anil Ambani: కొత్త వ్యాపారంలోకి అనిల్ అంబానీ.. టార్గెట్ గౌతమ్ అదానీ-ముఖేష్ అంబానీలే..!!
Reliance Infra: అనిల్ అంబానీ 2008 పతనం తర్వాత తిరిగి కోలుకోడని వ్యాపార వర్గాలు భావించాయి. అయితే పెద్దలు చెప్పినట్లుగా పడినవాడు మళ్లీ ఓపిక కూడబెట్టుకుని మరింత బలంగా తిరిగి వస్తాడనే మాట అనిల్ అంబానీ విషయంలో ప్రస్తుతం జరగుతోంది. అనిల్ తన కుమారుల రాకతో వ్యాపారంలో తిరిగి పుంజుకుంటున్నారు.
ఈ క్రమంలోనే అనిల్ అంబానీ మరో కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టాలని నిర్ణయించారు. అయితే ఈ సారి సోదరుడు ముఖేష్ అంబానీతో పాటు దేశంలోని అగ్ర వ్యాపారవేత్తగా గుర్తింపు తెచ్చుకున్న గౌతమ్ అందానీని సైతం ఢీ కొట్టడానికి సిద్ధమౌతున్నట్లు వెల్లడైంది. ఇందుకోసం అనిల్ అంబానీ ఎంచుకున్నది రెన్యూవబుల్ ఎనర్జీ రంగం కావటం గమనార్హం. భవిష్యత్తులో భారీ వృద్ధికి అవకాశం ఉన్న ఈ రంగంలో కొత్త వ్యాపార అవకాశాన్ని అందిపుచ్చుకోవటానికి రిలయన్స్ ఇన్‌ఫ్రా ముందుకు రావటంతో మరోసారి అందరి చూపు మార్కెట్లో అనిల్ అంబానీ కంపెనీపై పడింది.

ప్రణాళికకు అనుగుణంగా రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ తన పోర్ట్‌ఫోలియోను విస్తరించాలని నిర్ణయించింది. కంపెనీ కొత్త ప్లాన్ ప్రకారం రెన్యూవబుల్ ఎనర్జీ పరికరాల తయారీలోకి ప్రవేశించబోతోంది. ఈ వార్త బయటకు రావటంతో నేడు ఇంట్రాడేలో రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్ కొనుగోలు కోసం ఇన్వెస్టర్లు పరుగులు తీయటంతో షేర్లు విపరీతమైన పెరుగుదలను చూశాయి. మార్కెట్ల ముగింపు సమయంలో కంపెనీ షేర్లు ఎన్ఎస్ఈలో ఒక్కోటి రూ.246.50 వద్ద తమ ప్రయాణాన్ని ముగించాయి. ఈ క్రమంలో కంపెనీ మార్కెట్ క్యాప్ సుమారు రూ.9,830 కోట్లుగా ఉంది. అయితే మార్కెట్ల ఒడిదొడుకుల కారణంగా గడచిన నెల రోజులుగా స్టాక్ ధర 12 శాతానికి పైగా క్షీణతను నమోదు చేసింది.
అనిల్ అంబానీ బిజినెస్ ప్లాన్..
రిలయన్స్ ఇన్‌ఫ్రా ఇప్పటికే ఇవాన్ సాహాను తన రెన్యూవబుల్ ఎనర్జీ పరికరాల తయారీ విభాగానికి సీఈవోగా నియమించింది. ఇదే క్రమంలో కంపెనీ ముష్తాక్ హుస్సేన్‌ను బ్యాటరీ తయారీ వ్యాపారానికి సీఈవోగా నిర్ణయించినట్లు ప్రముఖ వార్తా సంస్థ పీటీఐ నివేదించింది. సాహాకు వాస్తవంగా సోలార్ ఎనర్జీ రంగంలో మూడు దశాబ్ధాల అనుభవం ఉండగా.. ఈ కాలంలో ఆయన విక్రమ్ సోలార్, రీన్యూ పవర్ వంటి కంపెనీల్లో పనిచేశారు. ఇక హుస్సేన్ ఆటోమోటివ్, రెన్యూవబుల్ ఎనర్జీ, కన్జూమర్ ఎలక్ట్రానిక్స్, విద్యుత్ పరికరాల రంగాల్లో 25 ఏళ్లు పనిచేసిన అనుభవం ఉంది. ఈయన రిలయన్స్ ఇండస్ట్రీస్, టెస్లాలో పనిచేసిన అనుభవం ఉంది.
భారత్ చైనాకు ప్రత్యామ్నాయంగా దేశంలో సోలాల్ ప్యానెల్స్, ఇతర విడిభాగాల తయారీకి ప్రోత్సాహకాలు అందుతున్న వేళ అనిల్ అంబానీ ఈ రంగంలోకి ప్రవేశించాలని చూస్తున్నారు. క్లీన్ ఎనర్జీలో స్వయం ప్రతిపత్తి సాధించడం లక్ష్యంగా కంపెనీ ఒక ఇంటిగ్రేటెడ్ సోలార్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తుంది. రిలయన్స్ ఇన్ ఫ్రా ఇప్పటికే ఎనర్జీ, రోడ్డు, మెట్రో రైలు, ఇతర మౌలిక సదుపాయాల రంగాలకు ఇంజనీరింగ్ అండ్ నిర్మాణ సేవలను అందించే వ్యాపారంలో ఉంది.


Click it and Unblock the Notifications