Anil Ambani: తెరమీదకు అనిల్ అంబానీ కొత్త ప్లాన్.. ఆ స్టాక్ ఎగబడి కొంటున్న ఇన్వెస్టర్స్..
Reliance Infra Stock: అనిల్ అంబానీ పతనం తర్వాత వ్యాపార ప్రపంచం గుర్తుంచుకునే విజయం సాధించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో ఆయన కంపెనీలు భారీగా పేరుకుపోయిన అప్పులను సెటిల్ చేసుకుని ముందుకు సాగుతున్నాయి. ఇదే క్రమంలో అంబానీ సోదరుడు ఈవీ రంగంలోకి కూడా అరంగేట్రం చేయాలని పావులు కదుపుతున్నారు.
ఇదే సమయంలో అనిల్ లిస్టెడ్ కంపెనీలు మాత్రం మార్కెట్లో తమ పవర్ చూపిస్తున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ గురించే. కంపెనీ షేర్లు ఇంట్రాడేలో ఏకంగా 7 శాతానికి పైగా పెరిగి బుల్ ర్యాలీని కొనసాగిస్తున్నాయి. దీంతో నేడు కంపెనీ షేర్ల ధర ఒక్కోటి రూ.232.80 స్థాయికి చేరుకుంది. ఇప్పుడు కంపెనీ షేర్లపై ఇన్వెస్టర్లు దాడి చేయటానికి కారణం నిధుల సమీకరణకు ఇన్‌ఫ్రా కంపెనీ సన్నాహాలు చేయటమేనని తెలుస్తోంది. గడచిన నాలుగేళ్లుగా కంపెనీ షేర్లు ఇన్వెస్టర్లకు 2400% కంటే ఎక్కువ పెరుగుదలతో మల్టీబ్యాగర్ రాబడులను అందించింది.

ప్రస్తుతం రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ షేర్ల 52 వారాల గరిష్ఠ ధర రూ.308గా ఉండగా.. 52 వారాల కనిష్ఠ ధర రూ.143.70గా ఉంది. రెండు రోజుల్లో సెప్టెంబర్ 19న జరగనున్న బోర్డు సమావేశంలో కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయని తెలుస్తోంది. ఈ సమయంలో కొత్త నిధులను సమీకరించటంపై నిర్ణయం ఉండవచ్చని సమాచారం. దానిని ప్రిఫరెన్షియల్ షేర్ ఇష్యూ రూపంలో తీసుకురావచ్చు. అయితే ఎంత మొత్తంలో నిధులు సమీకరించాలనుకుంటున్నారనే విషయాన్ని కంపెనీ వెల్లడించలేదు. ఈక్విటీ షేర్లను జారీ చేయడం, ఈక్విటీ లింక్డ్ సెక్యూరిటీలు లేదా ఈక్విటీగా మార్చుకునే వారెంట్‌లను జారీ చేయటానికి ఉన్న మార్గాలను నిధుల సమీకరణ కోసం అన్వేషణలో ఉన్నాయి. ఏ మార్గం ద్వారా నిధుల సమీకరణ చేపట్టాలనేదానిపై ప్రస్తుతం యాజమాన్యం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు మాత్రం నిజంగా నక్కతోకతొక్కారు. నాలుగేళ్ల కిందట కంపెనీ షేర్లలో పెట్టుబడులు పెట్టి ఇప్పటి వరకు కొనసాగించిన ఇన్వెస్టర్లు మల్టీబ్యాగర్ రాబడులను రిలయన్స్ స్టాక్ నుంచి అందుకున్నారు. ఈ క్రమంలో మార్చి 27, 2020న కంపెనీ షేర్లు రూ.9.20గా ఉంది. అప్పట్లో కేవలం లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసి దానిని ఇప్పటి వరకు కొనసాగించి ఉంటే సదరు ఇన్వెస్టర్లు నేటి మార్కెట్ రేటు ప్రకారం రూ.25 లక్షలకు పైగా రాబడిని అందుకునేవారు. అలాగే స్టాక్ మూడేళ్ల కాలంలో 145 శాకానికి పైగా రాబడిని ఇచ్చింది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.9100 కోట్లకు చేరుకుంది.


Click it and Unblock the Notifications