Anil Ambani: రూ.3కి పడిపోయిన రూ.120 స్టాక్.. ఎగబడి కొంటున్న ఇన్వెస్టర్స్.. ఎల్ఐసీ కూడా
Reliance Home Finance: పతనంతో కాలగర్భంలో కలిసిపోయిన అనిల్ అంబానీ పేరు ప్రస్తుతం తిరిగి వార్తల్లో తరచుగా వినిపిస్తోంది. ఒకప్పుడు మెరుపుమెరిసిన అనిల్ అంబానీ స్టాక్స్ కళ తప్పినప్పటికీ.. ప్రస్తుతం ఆ కంపెనీల షేర్లు కొనేందుకు ఇన్వెస్టర్లు ఎగబడుతున్నారు.
వివరాల్లోకి వెళితే ఒకప్పటి బిలియనీర్ అనిల్ అంబానీకి చెందిన చాలా కంపెనీలు దివాలా ప్రక్రియను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. దీంతో సదరు కంపెనీల షేర్ ధరలు చాలా కాలంగా నష్టపోయాయి. అలా ఇన్వెస్టర్లను నిండా ముంచిన కంపెనీల్లో రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఒకటిగా ఉంది. అయితే రెండు రూపాయల కంటే తక్కువకు పడిపోయిన కంపెనీ షేర్లను కొనుగోలు చేసేందుకు నేడు మార్కెట్లో ఇన్వెస్టర్ల నుంచి హడావిడి నెలకొంది. దీంతో నేడు షేర్ ధర పెరిగి రూ.3.64కి పెరిగింది. దీనికి ముందు రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ షేర్ల ధర రూ.6.22 స్థాయికి చేరుకుంది.

అయితే హోమ్ ఫైనాన్స్ స్టాక్ ధర 2017లో రూ.120 కంటే ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. కంపెనీలో ప్రమోటర్ అనిల్ అంబానీకి సైతం 0.74 శాతం వాటాలు ఉన్నాయి. అలాగే కంపెనీలో పబ్లిక్ షేర్ హోల్డింగ్ ఏకంగా 99.26 శాతంగా ఉంది. ఇక్కడ పబ్లిక్ షేర్‌హోల్డర్‌లలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(LIC) కూడా ఉంది. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్‌లో ఎల్‌ఐసీకి 74,86,599 షేర్లు ఉన్నాయి.
ఇటీవల నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ రిలయన్స్ హోమ్ ఫైనాన్స్‌లో ప్రొఫెషనల్ అండ్ ఆడిట్ సంబంధిత అవకతవకలకు సంబంధించి ఒక ఆడిట్ కంపెనీ, ఇద్దరు ఆడిటర్‌లపై మొత్తం రూ.1.6 కోట్ల జరిమానా విధించింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆడిట్ పనుల్లో అవకతవకలకు పాల్పడిన ఆడిట్ సంస్థ ధీరజ్ & ధీరజ్‌పై కోటి రూపాయలు, ఆడిటర్లు పీయూష్ పట్నీపై రూ.50 లక్షలు, పవన్ కుమార్ గుప్తాపై రూ.10 లక్షలు జరిమానా విధించినట్లు ఎన్‌ఎఫ్‌ఆర్‌ఎ వెల్లడించింది.


Click it and Unblock the Notifications