Reliance Communication Stock: అనిల్ అంబానీ ప్రస్తుతం స్టాక్ మార్కెట్లలో కనీసం వారానికి ఒకసారైనా అందరూ తలుచుకుంటున్న పేరు. వార్తల్లోనూ ఎక్కువగా వినిపిస్తున్న పేరు. లక్షల మంది ఇన్వెస్టర్లు అనిల్ పతనంతో భారీగా నష్టపోయినప్పటికీ ఆయనపై నమ్మకాన్ని కొనసాగిస్తున్నా చాలా మంది పెట్టుబడిదారులు మాత్రం ప్రస్తుతం లాభాలను చూస్తున్నారు.
ఈ క్రమంలో అనిల్ అంబానీకి చెందిన అనేక లిస్టెడ్ కంపెనీల షేర్లు పెట్టుబడిదారులకు తమ పాత రోజులను తిరిగి లాభాల రూపంలో అందిస్తున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది నిరంతరం పెరుగుతున్న లయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ కంపెనీ షేర్ల గురించే. చివరిగా శుక్రవారం కంపెనీ షేర్ల ధర ఒక్కోటి రూ.2.32ని తాకి ఇంట్రాడేలో గరిష్ఠాన్ని చేరుకున్నాయి. దీంతో గడచిన 5 ట్రేడింగ్ సెషన్లలో స్టాక్ 20 శాతానికి పైగా రాబడిని ఇన్వెస్టర్లకు అందించింది. అయితే ఈ నిరంతర పెరుగుదలకు కారణం డిసెంబర్ 5 కంపెనీ నుంచి వచ్చిన కీలక ప్రకటనగా తెలుస్తోంది.

ఆర్కామ్ సబ్సిడరీ సింగపూర్‌లోని గేట్‌వే నెట్ ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్ మూసివేత గురించి స్టాక్ ఎక్స్ఛేంజీలకు అందించిన సమాచారమేనని వెల్లడైంది. చాలా కాలంగా చతికిల పడి పెద్దగా చలనం లేకుండా కొనసాగిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ స్టాక్ గడచిన ఆరు నెలలుగా పెట్టుబడిదారులను అలరిస్తూ ఏకంగా 34 శాతం రాబడిని అందించింది. అలాగే 5 ఏళ్ల కాలంలో 94 శాతం రాబడిని తెచ్చిపెట్టింది. ఇక కంపెనీ పెట్టుబడిదారులకు ఇచ్చిన భారీ నష్టాల గురించి పరిశీలిస్తే.. జనవరి 11, 2008న RCom షేర్లు ఒక్కోటి రూ.792 రేటు వద్ద తమ ట్రేడింగ్ ముగించాయి. అయితే ఆ తర్వాత అనిల్ అంబానీ పతనంతో స్టాక్ కూడా భారీ పతనాన్ని చూసింది. ఈ స్థాయి నుంచి రేటు దాదాపు 99 శాతం పడిపోయి ఇన్వెస్టర్లను నిండుగా ముంచేసింది.
అయితే ప్రస్తుతం అనిల్ అంబానీకి చెందిన టెలికాం కంపెనీ దివాలా ప్రక్రియను చూస్తోంది. రిలయన్స్ కమ్యూనికేషన్స్ కూడా దివాలా ప్రక్రియను కొనసాగిస్తున్నప్పటికీ చాలా మంది ఇప్పటికీ కంపెనీ షేర్లపై బెట్టింగ్ వేయటం మాత్రం నిరంతరాయంగా కొనసాగిస్తూనే ఉన్నారు. జరుగుతున్న పరిణామాలతో కంపెనీ షేర్ల నుంచి ఎంతోకొంత లాభాన్ని పొందేందుకు భారీ రిస్కీ గేమ్ ఆడుతూనే ఉన్నారు.
అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ రుణ ఖాతాను "మోసం"గా ప్రకటించాలని కెనరా బ్యాంక్ నోటీసు జారీ చేసింది. అంబానీ కంపెనీ తీసుకున్న రుణాలను భారీగా దుర్వినియోగం చేసిందని బ్యాంక్ అందులో పేర్కొంది. అనిల్ అంబానీ ఆర్ కామ్ కంపెనీకి క్రెడిట్ సౌకర్యాలుగా మంజూరు చేయబడిన రూ.1,050 కోట్ల రుణాలను ఉపయోగించడంలో సమస్యలను తాజా నోటీసులో బ్యాంక్ ప్రస్థావించింది. టర్మ్ లోన్‌లు, గ్యారెంటీలు, క్రెడిట్ లెటర్‌లను కలిగి ఉన్న రుణాలను RCOM తిరిగి చెల్లించడంలో డిఫాల్ట్ అయి, మంజూరు నిబంధనలను ఉల్లంఘించిన తర్వాత మార్చి 9, 2017న నిరర్థక ఆస్తులుగా వర్గీకరించబడ్డాయి.
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications