Hinduja Group: అన్న ముఖేష్ అంబానీ నుంచి విడిపోయిన తర్వాత అనిల్ అంబానీ పాతాళానికి పడిపోయారు. పవర్, టెలికాం, ఫైనాన్స్ అంటూ అనేక రంగాల్లోకి విస్తరించినప్పటికీ అనిల్ వ్యాపారాలు చివరికి నష్టాల పాలయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన చాలా కంపెనీలు దివాలా ప్రక్రియలో ఉన్నాయి.
ఈ క్రమంలో అనిల్ అంబానికి చెందిన అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీ రిలయన్స్ క్యాపిటల్ త్వరలో చేతులు మారనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్టర్లను ఈ పెద్ద వార్త ఆకర్షిస్తోంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం రిలయన్స్ క్యాపిటల్ కంపెనీని హిందూజా గ్రూప్ దక్కించుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కంపెనీని కొనుగోలు చేసేందుకు హిందూజా గ్రూప్ కంపెనీ ఇండస్‌ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ లిమిటెడ్ రూ.9,650 కోట్ల రిజల్యూషన్ ప్లాన్‌ను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ నేడు ఆమోదించింది. ఇండస్‌ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ సమర్పించిన ప్లాన్‌ను ఎన్‌సిఎల్‌టి ముంబై బెంచ్ ఆమోదించింది. IIHL జూన్ 2023కి సంబంధించిన ప్రణాళికను రెండవ రౌండ్ బిడ్డింగ్‌లో సమర్పించింది.

నవంబర్ 2021లో రిలయన్స్ క్యాపిటల్ బోర్డును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తొలగించిన సంగతి తెలిసిందే. అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్ కంపెనీకి చెందిన గవర్నెన్స్ సమస్యలు, పేమెంట్ డిఫాల్ట్‌ల కారణంగా రిజర్వు బ్యాంక్ బోర్డును తొలగించింది. రిజర్వ్ బ్యాంక్ నాగేశ్వరరావు వైని అడ్మినిస్ట్రేటర్‌గా నియమించింది. దీంతో కంపెనీని టేకోవర్ చేయడానికి ఫిబ్రవరి 2022లో బిడ్‌లను ఆహ్వానించారు.
రిలయన్స్ క్యాపిటల్ రూ.40,000 కోట్లకు పైగా అప్పులను కలిగి ఉంది. ప్రారంభంలో 4 దరఖాస్తుదారులు రిజల్యూషన్ ప్లాన్‌లతో బిడ్ చేశారు. అయితే తక్కువ బిడ్ విలువల కారణంగా రుణదాతల కమిటీ మొత్తం నాలుగు ప్లాన్‌లను తిరస్కరించింది. దీంతో ఛాలెంజ్ మెకానిజం ప్రారంభించబడగా.. ఇందులో ఇండస్ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ లిమిటెడ్, టోరెంట్ ఇన్వెస్ట్‌మెంట్స్ పాల్గొన్నాయి. జూన్ 2023లో కమిటీ హిందుజా గ్రూప్ కంపెనీని రూ.9,661 కోట్ల ముందస్తు నగదు బిడ్ కోసం ఎంపిక చేసింది. ఇదే జరిగితే రానున్న రోజుల్లో ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు లాభపడే అవకాశం ఎక్కువగా కనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications