Reliance Communication: అనిల్ అంబానీ తన కుమారుల సాయంతో భారతీయ వ్యాపార సామ్రాజ్యంలో ఎవ్వరూ ఊహించని పునరాగమనాన్ని చూస్తున్నారు. ప్రపంచ కుబేరుల జాబితా నుంచి జీరోకి జారిన అనిల్ తిరిగి చరిత్ర గుర్తుంచుకునే బౌన్స్ బ్యాక్ ప్రయాణాన్ని ఇప్పటికే ప్రారంభించారు. అయితే ఈ క్రమంలో కొన్ని ఎదురుదెబ్బలు ఆయన ప్రయాణాన్ని చాలెంజ్ చేస్తున్నాయి.
తాజాగా అనిల్ అంబానీకి చెందిన టెలికాం వెంచర్ రిలయన్స్ కమ్యూనికేషన్స్ నుంచి బకాయిలను క్లెయిమ్ చేస్తూ రాష్ట్ర పన్ను శాఖ దాఖలు చేసిన పిటిషన్‌ను NCLAT పక్కన పెట్టింది. రుణ భారంతో దివాలా ప్రక్రియ ప్రారంభించబడిన తర్వాత చేసిన మదింపుపై ఆధారపడింది. రూ.6.10 కోట్ల రాష్ట్ర పన్ను శాఖ రెండో క్లెయిమ్‌ను తిరస్కరించిన నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ముంబై బెంచ్ గతంలో జారీ చేసిన ఉత్తర్వులను ఇద్దరు సభ్యుల ఎన్‌సిఎల్‌ఎటి బెంచ్ సమర్థించింది.

వాస్తవానికి జూన్ 22,2019న ఆర్‌కామ్‌కు వ్యతిరేకంగా కార్పొరేట్ ఇన్‌సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్ ప్రారంభించబడింది. రాష్ట్ర పన్ను శాఖ రెండు క్లెయిమ్‌లను దాఖలు చేసింది. మొదటి క్లెయిమ్ జూలై 24, 2019న రూ.94.97 లక్షలకు దాఖలు చేయగా.. రెండవ క్లెయిమ్ రూ.6.10 కోట్లకు నవంబర్ 15, 2021న దాఖలు చేయబడింది. ఇది ఆగస్టు 30, 2021 నాటి అసెస్‌మెంట్ ఆర్డర్ నుండి ఉద్భవించింది. అయితే కార్పొరేట్ ఇన్‌సాల్వెన్సీ ప్రారంభానికి ముందు ఆమోదించబడిన మొదటి దావాను NCLT అంగీకరించింది. కానీ బెంట్ 2021లో ఆమోదించబడిన అసెస్‌మెంట్ ఆర్డర్ ఆధారంగా వచ్చిన దావాను అంగీకరించలేదు.
మార్చి 2, 2020న RCom క్రెడిటర్స్ కమిటీ కూడా ప్లాన్‌ను ఆమోదించింది. తదుపరి క్లెయిమ్‌ను రాష్ట్ర పన్ను శాఖ నవంబర్ 15, 2021న దాఖలు చేసింది. ఈ ఆర్డర్‌ను రాష్ట్ర పన్ను శాఖ నేషనల్ కంపెనీ ముందు సవాలు చేసింది. లా అప్పిలేట్ ట్రిబ్యునల్ NCLT మొత్తం క్లెయిమ్‌ను అంగీకరించి ఉండాలని వాదించింది. అయినప్పటికీ క్రెడిటార్స్ కమిటీ ప్రణాళిక ఆమోదం పొందిన తర్వాత తదుపరి దావా దాఖలు చేయబడిందని గమనించి NCLAT కూడా దానిని తిరస్కరించింది. రెండవ దావాను దాఖలు చేయడంలో జాప్యాన్ని క్షమించలేమని NCLT తీసుకున్న అభిప్రాయాన్ని ఇది సమర్థించింది.
ఈ వ్యవహారంపై స్పందించిన జస్టిస్ అశోక్ భూషణ్, అరుణ్ బరోకాతో కూడిన ఎన్‌సిఎల్‌ఎటి బెంచ్ అడ్జుడికేటింగ్ అథారిటీ దరఖాస్తును పాక్షికంగా అనుమతిస్తూ ఆమోదించిన ఆర్డర్‌లో మేము ఎటువంటి దోషాన్ని కనుగొనలేదని తీర్పు ఇచ్చింది. అలాగే అప్పీల్‌లో ఎటువంటి మెరిట్ లేదని పేర్కొంది. దీంతో అప్పీల్ కొట్టివేయబడిందని బెంచ్ స్పష్టం చేసింది.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...



Click it and Unblock the Notifications