Anil Ambani: అంబానీ షేరు తుఫాన్.. రూ.1 నుంచి రూ.28కి ర్యాలీ.. మీ దగ్గర ఉందా..??
Reliance Power Share: దివాలా తీసిన బిలియనీర్, అంబానీ సోదరుడు అనిల్ కు మంచిరోజులు రావటంతో ఆయన కంపెనీలు సైతం ఇన్వెస్టర్లలో కొత్త ఆశలు చిగురింపచేస్తున్నాయి. ఈ క్రమంలో గత కొన్ని నెలలుగా అనిల్ అంబానీకి చెందిన అనేక కంపెనీలు తుఫాను రాబడులను అందిస్తున్నాయి.
ప్రస్తుతం మనం మాట్లాడుకోబోతున్నది అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్ గురించే. ఈ కంపెనీకి చెందిన షేర్లు మార్కెట్లో రాకెట్ వేగంతో తిరిగి పుంజుకుంటున్నాయి. రిలయన్స్ పవర్ షేర్లు మంగళవారం దాదాపు 7% పెరిగి రూ.28 స్థాయికి చేరాయి. దీనికి ముందు సోమవారం నాడు కంపెనీ షేర్లు రూ.26.07 వద్ద ముగిశాయి. రిలయన్స్ పవర్ షేర్లు గత కొన్ని సంవత్సరాలలో 2300% కంటే ఎక్కువ రాబడిని ఇన్వెస్టర్లకు అందించింది. ఈ కాలంలో పవర్ కంపెనీ షేర్ల ధర ఒక్కోటి రూ.1 నుంచి రూ.28కి పెరిగాయి. రిలయన్స్ పవర్ షేర్ల 52 వారాల గరిష్ఠ స్థాయి రూ.34.35గా ఉండగా.. 52 వారాల కనిష్ట స్థాయి ధర రూ.13.80గా ఉంది.

అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్ షేర్లు భారీ పతనం తర్వాత గత 4 ఏళ్లలో మల్టీబ్యాగర్ రిటర్న్స్ ఇచ్చింది. రిలయన్స్ పవర్ షేర్లు మార్చి 27, 2020న రూ.1.13 వద్ద ఉండగా.. జూన్ 11, 2024న కంపెనీ షేర్లు రూ.28కి చేరుకున్నాయి. రిలయన్స్ పవర్ షేర్లు కేవలం 4 సంవత్సరాల వ్యవధిలో పెట్టుబడిదారులకు 2300% కంటే ఎక్కువ రాబడిని అందించాయి. ఎవరైనా ఇన్వెస్టర్ మార్చి 27, 2020న రిలయన్స్ పవర్ షేర్లలో రూ.లక్ష పెట్టుబడి పెట్టి దానిని ఇప్పటి వరకు కొనసాగించి ఉన్నట్లయితే ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం దాని విలువ రూ.24.77 లక్షలుగా ఉండేది.
జూన్ 12, 2023న రిలయన్స్ పవర్ షేర్లు రూ.15.85 వద్ద ఉన్నాయి. జూన్ 11, 2024న కంపెనీ షేర్లు రూ.28కి చేరుకున్నాయి. అలాగే గత 3 నెలల్లో రిలయన్స్ పవర్ షేర్లు దాదాపు 40 శాతం పెరిగాయి. మార్చి 13, 2024న కంపెనీ షేర్లు రూ.20.38 వద్ద ఉన్నాయి. జూన్ 11, 2024న రిలయన్స్ పవర్ షేర్లు రూ.28కి చేరుకున్నాయి. ఇక గత 5 రోజుల్లో రిలయన్స్ పవర్ షేర్లు దాదాపు 20% పెరిగటంతో ప్రస్తుతం మార్కెట్లో అందరి చూపు ఈ పవర్ స్టాక్ పైనే కొనసాగుతోంది. ఈ క్రమంలో రిలయన్స్ పవర్ స్టాక్ ధర నేడు ఉదయం 11 గంటల సమయంలో ఎన్ఎస్ఈలో 8.63 శాతం లాభంలో రూ.28.33 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తోంది.


Click it and Unblock the Notifications