అనిల్ అంబానీకి గుడ్ న్యూస్.. లోన్ ఫ్రీగా రిలయన్స్ ఇన్‌ఫ్రా, రూ.4387 కోట్ల భారీ లాభం!

రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీకి ఇది నిజంగా శుభవార్త అని చెప్పవచ్చు. ఎందుకంటే అతని ఆధీనంలోని రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (Reliance Infra) కంపెనీ ఒక కీలక మైలురాయిని సాధించింది. 2025 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుండి తీసుకున్న రూ.3300 కోట్ల రుణాన్ని తాజాగా కంపెనీ పూర్తిగా తిరిగి చెల్లించి, లోన్ ఫ్రీగా మారింది. ఈ పరిణామం కంపెనీ ఆర్థిక బలాన్ని చాటుతు, దీనికి సంబంధించిన సమాచారాన్ని కంపెనీ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో వెల్లడించింది.

Anil Ambanis another company is now debt free repaid loan of 3300 crores know how much was profit

భారీ లాభం, పెరిగిన నికర విలువ: 26 మే 2025న రిలయన్స్ ఇన్‌ఫ్రా నాల్గవ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ఈ త్రైమాసికంలో కంపెనీ రూ. 4,387.08 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ. 220 కోట్ల నష్టాన్ని చవిచూడగా, మూడవ త్రైమాసికంలో (అక్టోబర్-డిసెంబర్ 2024) రూ. 3,298 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. ఇప్పుడు ఈ లాభాల వార్త కంపెనీకి, దాని పెట్టుబడిదారులకు పెద్ద రిలీఫ్ ఇచ్చింది.

రిలయన్స్ ఇన్‌ఫ్రా మొత్తం నికర విలువ ఒక సంవత్సరంలో ఏకంగా రూ. 5,859 కోట్లు పెరిగి రూ. 14,287 కోట్లకు చేరుకుంది. ఇది గత సంవత్సరం రూ. 8,428 కోట్ల కంటే 70% ఎక్కువ. కంపెనీ EBITDA రూ. 514 కోట్లతో పోలిస్తే రూ. 8,876 కోట్లుగా ఉంది. 26 మే 2025 నాటికి కంపెనీ మార్కెట్ విలువ రూ. 11,593 కోట్లకు పెరిగింది. రిలయన్స్ ఇన్‌ఫ్రా ప్రధానంగా విద్యుత్, మెట్రో, రోడ్డు ఇంకా రక్షణ రంగాలలో పనిచేస్తుంది. రుణం చెల్లించి, లాభాలు ఆర్జించిన తర్వాత కంపెనీ ఇప్పుడు ఈ రంగాలలో మరింత వృద్ధి చెందాలని యోచిస్తోంది.

స్టాక్ పనితీరు అదుర్స్: రిలయన్స్ ఇన్‌ఫ్రా స్టాక్ గత ఐదు సంవత్సరాలలో 1600% కంటే ఎక్కువ వృద్ధిని నమోదు చేసింది. ఐదు సంవత్సరాల క్రితం అంటే 29 మే 2020న ఈ స్టాక్ రూ.16.70 స్థాయిలో ఉండగా, నేడు సోమవారం (మే 26, 2025) రిలయన్స్ ఇన్‌ఫ్రా షేర్లు దాదాపు 4 శాతం తగ్గి రూ. 293.40 వద్ద ముగిశాయి. అయితే, శుక్రవారం ప్రారంభంలో ఈ స్టాక్ రూ. 305 వద్ద ముగిసింది. గత మూడు సంవత్సరాలలో అనిల్ అంబానీ కంపెనీ షేర్లు 190 శాతానికి పైగా పెరిగాయి. గత ఏడాది కాలంలోనే రిలయన్స్ ఇన్‌ఫ్రా వాటా 71 శాతానికి పైగా పెరిగింది. రిలయన్స్ ఇన్‌ఫ్రా షేరు 52 వారాల గరిష్ట స్థాయి రూ. 350.90, కనిష్ట స్థాయి రూ. 143.70.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+