Reliance Power: అనిల్ అంబానీకి చెందిన కంపెనీలు కొన్ని నెలలుగా దేశీయ స్టాక్ మార్కెట్లో సంచలనం సృష్టిస్తున్నాయి. మార్కెట్లు పడుతున్నా అనిల్ స్టాక్స్ మాత్రం పెరుగుతూనే ఉన్నాయి.
ముఖేష్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్ కంపెనీ షేర్లలో భారీ ర్యాలీ కొనసాగుతోంది. వాస్తవానికి దేశీయ మార్కెట్లు కుప్పకూలుతున్నప్పటికీ రిలయన్స్ పవర్ షేర్లు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా 5 శాతం అప్పర్ సర్క్యూట్ తాకిన పవర్ స్టాక్ ప్రస్తుతం రూ.28.26కి చేరుకుంది. వాస్తవానికి అనిల్ పతనంతో దివాలా తీయటంతో స్టాక్ గతంలో 99 శాతం పతనాన్ని చూసింది. అయితే కంపెనీలు తమ రుణాల చెల్లింపులకు చేస్తున్న ప్రయత్నాలు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. ఒకప్పుడు రిలయన్స్ స్టాక్ రూపాయికి పడిపోయిన స్థాయి నుంచి రూ.28కి పెరిగాయి.

రిలయన్స్ పవర్ షేర్లు మార్చి 27, 2020న రూ.1.13కి పడిపోయాయి. అయితే గత నాలుగున్నరేళ్లలో రిలయన్స్ పవర్ షేర్లలో మంచి పెరుగుదల కనిపిస్తోంది. మార్చి 27, 2020న కంపెనీ షేర్లు రూ.1.13 వద్ద నుంచి పవర్ షేర్లు 24 జూలై 2024న రూ.28.26కి చేరుకున్నాయి. ఒక పెట్టుబడిదారుడు మార్చి 27, 2020న రిలయన్స్ పవర్ షేర్లలో రూ.లక్ష పెట్టుబడి పెట్టి దానిని ఇప్పటి వరకు కొనసాగించి ఉంటే వారి పెట్టుబడి విలువ రూ.25 లక్షలుగా మారింది.
గత రెండేళ్లలో రిలయన్స్ పవర్ షేర్లు 140 శాతం పెరిగాయి. ఈ కాలంలో కంపెనీ షేర్లు రూ.11 నుంచి రూ.28కి ఎగబాకాయి. గత ఏడాది కాలంలో రిలయన్స్ పవర్ షేర్లు 80% పెరిగాయి. కంపెనీ షేర్ల 52 వారాల గరిష్ఠ స్థాయి ధర రూ.34.35 ఉండగా.. 52 వారాల కనిష్ఠ స్థాయి రూ.15.53గా ఉంది. ప్రస్తుతం అంబానీ కంపెనీ షేర్లు విపరీతంగా పెరగడానికి అసలు కారణం రిలయన్స్ పవర్ తన లోన్స్ క్లియర్ చేసుకుని రుణ విముక్తిగా మారటమే. పీటీఐ వార్తా సంస్థ నివేదిక ప్రకారం.. కంపెనీకి దాదాపు రూ.800 కోట్ల రుణం ఉంది. దానిని బ్యాంకులకు తిరిగి చెల్లించినట్లు వెల్లడైంది. డిసెంబర్ 2023 నుండి మార్చి 2024 వరకు రిలయన్స్ పవర్ IDBI బ్యాంక్, ICICI బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, DBS వంటి అనేక బ్యాంకులతో రుణ పరిష్కార ఒప్పందాలను కుదుర్చుకుంది. ప్రస్తుతం వాటి చెల్లింపులు జరిగాయని వర్గాలు చెబుతున్నాయి.


Click it and Unblock the Notifications