Reliance Jai Properties: సంవత్సరాల క్రితం దివాలా ప్రకటనతో వార్తల్లో నిలిచిన బిలియనీర్ వ్యాపారవేత్త అనిల్ అంబానీ. అప్పుల ఊబి నుంచి ఇప్పుడిప్పుడే బయటపడిన అనిల్ అంబానీ వ్యాపారం విషయంలో తిరిగి గాడిన పడుతున్నారు. ఈ క్రమంలో ఆసక్తికర విషయం ఏమిటంటే.. అనిల్ తన కుమారుల పేరుతో కొత్త కంపెనీని ప్రారంభించటమే.
వివరాల ప్రకారం అనిల్ అంబానీ తన కొత్త కంపెనీకి రిలయన్స్ జై ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్(RJPPL) అని పేరు పెట్టారు. వాస్తవానికి కంపెనీ పేరులో జై అనేది అనిల్ అంబానీ కుమారుల ఇద్దరి పేర్లలోని ప్రారంభ అక్షరంగా తెలుస్తోంది. వాస్తవానికి అనిల్ ఇద్దరి కొడుకుల పేర్లు 'జై'తో మొదలవుతాయి. అతని పెద్ద కొడుకు పేరు జై అన్మోల్ అంబానీ కాగా చిన్న కొడుకు పేరు జై అన్షుల్ అంబానీ. అయితే ఇప్పుడు స్టాక్ మార్కెట్లతో పాటు దేశవ్యాప్తంగా వ్యాపార కుటుంబాల్లో జరుగుతున్న చర్చ అనిల్ అంబానీ అకస్మాత్తుగా రియల్ ఎస్టేట్ రంగంలోకి ఎందుకు అడుగుపెడుతున్నారన్నదే.

RJPPL కంపెనీ రిలయన్స్ ఎనర్జీ లిమిటెడ్ అనుబంధ సంస్థ. RJPPL వివిధ ఆస్తులను కొనుగోలు చేయడం, విక్రయించడం, లీజుకు ఇవ్వడం, అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టనుంది. RJPPL 12 ఆగస్టు 2024న రిలయన్స్ ఎనర్జీ లిమిటెడ్ క్రింద విలీనం చేయబడింది. రిలయన్స్ ఎనర్జీ లిమిటెడ్ రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు అనుబంధ సంస్థ. భారీగా అప్పుల ఊబిలో కూరుకుపోయిన అనిల్ అంబానీ కంపెనీలు దివాలా తీయటం ప్రారంభించిన సంగతి తెలిసిందే. కొంతకాలం తర్వాత ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. దాదాపు అన్ని కంపెనీల అప్పులు తీరటంతో.. సదరు కంపెనీల నష్టాలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. ఈ క్రమంలో రిలయన్స్ క్యాపిటల్‌ను రూ.9,861 కోట్లకు కొనుగోలు చేసిన హిందూజా గ్రూప్ పెద్ద అడుగుగా చెప్పుకోవచ్చు.
అనిల్ అంబానీ దివాలా తీసిన తర్వాత గొప్పగా తిరిగి వచ్చారని తాజా పరిణామాలతో చెప్పుకోవచ్చు. తాజాగా అనిల్ అంబానీ రియల్ ఎస్టేట్ రంగంలోకి ప్రవేశించడం, ఆర్థిక పట్టును బలోపేతం చేయడానికి ఒక వ్యూహాత్మక అడుగుగా చాలా మంది పరిగణిస్తున్నారు. అనిల్ అంబానీ కొత్తగా ఏర్పాటు చేసిన రియల్టీ సంస్థ ప్రధాని మోదీ డ్రీమ్ ప్లాన్ కింద పనిచేస్తుందని తెలుస్తోంది.
రిలయన్స్ జై ప్రాపర్టీస్ లిమిటెడ్ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (PMAY-U) 2.0 కింద పట్టణ పేదలు, మధ్యతరగతి కుటుంబాలకు సరసమైన ధరలకు గృహాలను అందించే ప్రాజెక్టులో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకునేందుకు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కంపెనీ ఎలా పనిచేస్తుంది, ఎటువంటి ప్రణాళికలతో రియల్టీ రంగంలో ముందుకు అడుగులు వేస్తుందనే పూర్తి విషయాలు భవిష్యత్తులో ఇన్వెస్టర్లకు మార్గనిర్ధేశం చేస్తాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications