రిలయన్స్ అడాగ్ అధినేత అనిల్ అంబానీకి చెందిన ఢిల్లీ పవర్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ అమ్మకానికి ఉందట. దీనిని కొనుగోలు చేసేందుకు దాదాపు 8 మంది ఇన్వెస్టర్లు సిద్ధంగా ఉన్నారట. క్యాస్ డీ డీపోట్ (CDPQ), యాక్టిస్ ఎల్ఎల్‌పీ అండ్ బ్రూక్‌ఫీల్డ్స్ అసెట్ మేనేజ్‌మెంట్ సహా వివిధ సంస్థలు రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్‌కు చెందిన ఢిల్లీ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్బిజినెస్ కొనుగోలుకు ఆసక్తిగా ఉన్నాయని తెలుస్తోంది.

కొనుగోలు చేసేందుకు 8 సంస్థలు ఆసక్తి
CDPQ, యాక్టిస్ ఎల్ఎల్‌పీ అండ్ బ్రూక్‌ఫీల్డ్స్ అసెట్ మేనేజ్‌మెంట్‌తో పాటు గ్రీన్‌కో ఎనర్జీ హోల్డింగ్స్, ఎనెల్ గ్రూప్, ఐ స్క్వేర్డ్ కేపిటల్, టోరెంట్ పౌడర్ అండ్ వేడ్ క్యాపిటల్ గ్రూప్ ఎల్ఎల్‌సీ తదితర ఎనిమిది సంస్థలు కొనుగోలు చేసేందుకు ఆసక్తిగా ఉన్నాయని అంటున్నారు.

వాటా విక్రయానికి KPMG
BSES రాజ్‌ధాని పవర్ లిమిటెడ్ (BRPL), BSES యమనా పవర్ లిమిటెడ్ (BYPL)లో 51 శాతం వాటాను విక్రయించేందుకు బయ్యర్స్‌ను గుర్తించేందు కోసం ఇప్పటికే రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్... KPMGని నియమించుకుంది. ఈ రెండు విద్యుత్ పంపిణీ వ్యాపారాలు దేశ రాజధాని ఢిల్లీలో దాదాపు 4.4 మిలియన్ల వినియోగదారులను కలిగి ఉన్నాయి. రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రూ.18,800 కోట్లకు తన ముంబై సిటీ పవర్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్‌ను అదానీ ట్రాన్స్‌మిషన్ లిమిటెడ్‌కు అమ్మేందుకు ప్లాన్ చేసింది.

రుణాలు తగ్గించుకోవడం కోసం విక్రయం
అనిల్ ధీరుబాయ్ అంబానీ గ్రూప్‌లో భాగమైన రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తన రుణాలు తగ్గించుకోవడం కోసం ఆస్తులు విక్రయిస్తోంది. కాగా, దీనిపై రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అధికార ప్రతినిధి స్పందించాల్సి ఉంది. కొనుగోలు చేసేందుకు ఆసక్తిగా ఉన్న కంపెనీలు కూడా స్పందించాల్సి ఉంది. మే 8న మార్చ్ క్వార్టర్ ఫలితాల సందర్భంగా.. వచ్చే ఏడాది నాటికి జీరో డెబిట్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది.


Click it and Unblock the Notifications