అనిల్ అంబానీ రాజీనామా: ఆ రెండు కంపెనీల నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటన
ముంబై: అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్ (అడాగ్) ఆఫ్ కంపెనీల చైర్మన్ అనిల్ అంబానీ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. తన గ్రూప్ ఆఫ్ కంపెనీల్లో ఉన్న రిలయన్స్ పవర్, రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డైరెక్టర్ పదవులకి రాజీనామా చేశారు. సెక్యూరిటీ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఉత్తర్వులను జారీ చేసిన తరువాత ఆయన తన పదవుల నుంచి తప్పుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. బోంబే స్టాక్ ఎక్స్ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ లిస్టెడ్ కంపెనీల్లో చేరకుండా అనిల్ అంబానీని సెబి నిషేధించింది.
దీనితో ఆయన రిలయన్స్ పవర్, రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డైరెక్టర్ పదవుల నుంచి వైదొలిగారు. సెబీ మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసిన అనంతరం కంపెనీ డైరెక్టర్ పదవి నుంచి అనిల్ అంబానీ వైదొలిగినట్లు రిలయన్స్ పవర్ వెల్లడించింది. ఈ మేరకు స్టాక్ మార్కెట్‌కు సమాచారాన్ని ఇచ్చింది. రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇదే సమాచారాన్ని అధికారికంగా స్టాక్ మార్కెట్‌కు తెలిపింది. సెబి మధ్యంతర ఉత్తర్వులకు అనుగుణంగా కంపెనీ డైరెక్టర్ల బోర్డు నుంచి అనిల్ అంబానీ రాజీనామా చేసినట్లు వివరించింది.

రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్, పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ, మరో ముగ్గురిపై డబ్బు విత్‌డ్రా చేశారనే ఆరోపణలపై సెబి లిస్టెడ్ కంపెనీల్లో చేరకుండా నిషేధం విధించింది. రిలయన్స్ పవర్, రిలయన్స్ ఇన్‌ఫ్రా డైరెక్టర్ల బోర్డు రాహుల్ షరీన్‌ను స్వతంత్ర డైరెక్టర్‌గా, అదనపు డైరెక్టర్‌గా నియమించింది. ఈ రెండు పదవుల్లో అయిదు సంవత్సరాల పాటు కొనసాగుతారు. కాగా- అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ క్యాపిటల్‌పై అప్పుల భారం పడింది.
గౌతమ్ అదానీకి చెందిన అదానీ ఫైనాన్షియల్ సర్వీసెస్, కెకెఆర్, పిరమల్ ఫైనాన్స్, పూనావాలా ఫైనాన్స్‌తో సహా 14 ప్రధాన కంపెనీలు ఈ కంపెనీని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నియమించిన అడ్మినిస్ట్రేటర్ బిడ్‌ల సమర్పణకు చివరి తేదీని మార్చి 11 నుంచి మార్చి 25 వరకు పొడిగించారు. పాలనా లోపం చెల్లింపు డిఫాల్ట్ కారణంగా నవంబర్ 29న రిలయన్స్ క్యాపిటల్ బోర్డును ఆర్‌బిఐ రద్దు చేసింది.


Click it and Unblock the Notifications