Ambani News: అమ్మకాలు పూర్తిచేసిన అంబానీ బ్రదర్.. ఒక్కదెబ్బతో బ్యాంకులకు ఇచ్చిపడేశాడుగా..
Anil Ambani: ముఖేష్ అంబానీ కుటుంబం మొత్తం అనంత్ పెళ్లి వేడుకల్లో మునిగి తేలుతోంది. కోట్లాది రూపాయలను మంచినీళ్లలా ఖర్చు చేస్తున్నారు. అయితే మరో అంబానీ బ్రదర్ పరిస్థితి మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. తీవ్రమైన అప్పుల్లో కూరుకుపోయి దివాళా స్థాయికి వెళ్లారు. సోదరుడి కుమారుడి పెళ్లిలోనూ దీనస్థితిలో దర్శనమిచ్చారు.
అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. అనిల్ అంబానీకి కూడా మంచి రోజులు మొదలయ్యాయని మార్కెట్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇందుకు కారణం మాత్రం రిలయన్స్ పవర్. రుణదాతలకు చెల్లించాల్సిన బకాయిలు అన్నింటినీ పూర్తిగా క్లియర్ చేసినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. దాదాపు 800 కోట్ల మేర అప్పును తిరిగి పే చేసినట్లు సమాచారం.

నివేదికల ప్రకారం.. డిసెంబర్ 2023 మరియు మార్చి 2024 మధ్య IDBI, ICICI, యాక్సిస్ మరియు DBS బ్యాంకులు సహా పలు ఆర్థిక సంస్థలతో రుణ పరిష్కార ఒప్పందాలపై రిలయన్స్ పవర్ సంతకం చేసింది. కాగా ఇప్పుడు ఈ బ్యాంకులకు మొత్తం రుణాన్ని చెల్లించింది. ఫలితంగా రిలయన్స్ పవర్ స్వతంత్ర ప్రాతిపదికన రుణ రహిత సంస్థగా మారింది.
డిసెంబర్ 2023లో అరుణాచల్ ప్రదేశ్‌లో ప్రతిపాదిత 1,200 మెగావాట్ల హైడ్రో-ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అభివృద్ధి హక్కులను THDCకి 128 కోట్లకు రిలయన్స్ పవర్ విక్రయించింది. మార్చి 2024లో మహారాష్ట్రలోని వాష్‌పేట్‌లో తన 45 మెగావాట్ల పవన శక్తి ప్రాజెక్టును JSW రెన్యూవబుల్ ఎనర్జీకి 132 కోట్లకు అమ్మేసింది. ఈ రెండు డీల్స్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని రుణాల చెల్లింపునకు ఉపయోగించినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications