Anil Ambani: నేడు ఫోకస్‍లో అనిల్ అంబానీ స్టాక్.. స్టాక్ పరుగల వెనుక శుభవార్త..!

Reliance Power Stock: అనిల్ అంబానీ తన 2.0 జర్నీలో తిరుగులేని విజయాలను చూస్తున్నారు. ఈ ప్రయాణంలో కొన్ని ఒడిదొడుకులు కొనసాగుతున్నప్పటికీ తిరిగి వ్యాపారవేత్తగా విజయాలను నమోదు చేస్తున్నారు. దశాబ్ధకాలం కిందట దివాలా తీసిన వ్యాపారవేత్త ప్రస్తుతం తిరిగి తన ప్రయాణ స్పీడు పెంచారు.

ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది అనిల్ అంబానీ కంపెనీ రిలయన్స్ పవర్ కంపెనీ షేర్ల గురించే. నేడు కంపెనీ షేర్లు ఫోకస్ లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే దీనికి అసలు కారణం రిలయన్స్ పవర్ అనుబంధ సంస్థ మెగా సోలార్ పవర్ బిడ్డింగ్ గెలుచుకోవటమే. వివరాల్లోకి వెళితే అనిల్ అంబానీ నేతృత్వంలోని కంపెనీకి అనుబంధంగా ఉన్న రిలయన్స్ ఎన్‌యు సన్‌టెక్ డిసెంబర్ 9న జరిగిన ఇ-రివర్స్ వేలంలో 930 మెగావాట్ల సోలార్ ఎనర్జీ కాంట్రాక్ట్‌ను బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీసిస్టమ్ ప్రాజెక్టును.. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి పొందింది. దీంతో కంపెనీ షేర్లు నేడు ప్రధానంగా ఫోకస్ లో కొనసాగుతున్నాయి. రిలయన్స్ పవర్ షేర్లు గత ఆరు నెలల్లో 39.38 శాతం పెరగగా.. ఏడాదికి 83.55 శాతం పెరుగుదలను చూశాయి.

Anil Ambani s Reliance Power Stock rocking amid subscidary secured solar order from SECI

ఉదయం 9.50 గంటల సమయంలో రిలయన్స్ పవర్ కంపెనీ షేర్లు ఒక్కోటి 4.56 శాతం లాభపడి ఒక్కోటి రూ.46.05 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. దీంతో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.18,520 కోట్లుగా కొనసాగుతోంది. ప్రస్తుతం స్టాక్ 52 వారాల కనిష్ఠ ధర రూ.19.40 వద్ద ఉండగా, స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ.53.64 వద్ద కొనసాగుతోంది. రిలయన్స్ పవర్ స్టాక్ ఎక్స్ఛేంజీలకు అందించిన వివరాల ప్రకారం లెటర్ ఆఫ్ అవార్డ్ కోసం కంపెనీ వేచి ఉంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం కిలోవాట్ సోలార్ విద్యుత్తును రూ.3.53 టారిఫ్‌తో రిలయన్స్ NU సన్‌టెక్ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి దక్కించుకోగలిగింది. దేశంలోని ప్రముఖ పవర్ జనరేటర్లలో కంపెనీ, మొత్తం కోట్ చేయబడిన సామర్థ్యం కోసం పోటీ పడుతున్న ఐదు కంపెనీల్లో అతిపెద్ద వ్యక్తిగత కేటాయింపులను దక్కించుకుంది. 2,000 మెగావాట్ల ఇంటర్-స్టేట్ ట్రాన్స్‌మిషన్ సిస్టమ్ కనెక్ట్ చేయబడిన సోలార్ 1,000 MW/4,000 MWh శక్తి నిల్వ వ్యవస్థలతో కూడిన పవర్ ప్రాజెక్టులని రిలయన్స్ పవర్ తెలిపింది.

రిలయన్స్ ఎన్‌యు సన్‌టెక్ విజయం భారతదేశంలో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ప్రజెక్టు సోలార్ ఎనర్జీతో సాధించిన సాంకేతిక పురోగతిని నొక్కిచెప్పింది. ఇది పునరుత్పాదక ఇంధన ఎంపికలకు తక్కువ ఖర్చుతో కూడిన ప్రత్యామ్నాయంగా మారిందని అనిల్ అంబానీ సంస్థ పేర్కొంది. ప్రస్తుతం అంబానీ ప్రాజెక్ట్ ప్రతిరోజూ నాలుగు గంటల పాటు గరిష్ట విద్యుత్ సరఫరాకు హామీ ఇచ్చింది. ఈ క్రమంలో రిలయన్స్ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ మధ్య రానున్న 25 ఏళ్లకు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ జరిగింది. దీని ద్వారా కంపెనీ దేశంలోని బహుళ డిస్కమ్‌లకు పవర్ విక్రయించనుంది. రిలయన్స్ పవర్ ఆర్మ్ ప్రాజెక్ట్‌ను బిల్డ్-ఓన్-ఆపరేట్ ప్రాతిపదికన అభివృద్ధి చేస్తుందని వెల్లడించబడింది.

Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+