Anil Ambani: వావ్.. అప్పులు zero చేసిన అంబానీ.. అప్పర్ సర్క్యూట్‌లో స్టాక్ లాక్..!!
Reliance Power Stock: ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అనిల్ అంబానీ కమ్ బ్యాక్ వ్యాపార చరిత్రలో మరో 100 ఏళ్లు గుర్తుండిపోయే మాదిరిగా కనిపిస్తోంది. గడచిన కొన్ని నెలలుగా పతనం నుంచి తిరిగి వేగంగా కోలుకునేందుకు అనిల్ అంబానీ చేస్తున్న పనులు ఇన్వెస్టర్లను సైతం అబ్బురపరుస్తున్నాయి. దీంతో అనిల్ భవిష్యత్తు ప్రణాళికలపై కూడా ఆశలు చిగురిస్తున్నాయి.
అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్ కంపెనీ షేర్లు నేడు ప్రారంభంలోనే 5 శాతం అప్పర్ సర్క్యూట్ తాకాయి. అయితే దీని వెనుకాల ఇన్వెస్టర్లతో పాటు కార్పొరేట్ ప్రపంచాన్ని సంతోషానికి గురిచేసిన ఒక అద్భుతం ఉంది. అవును అంబానీ పవర్ కంపెనీ తనకు ఉన్న మెుత్తం రూ.3872 కోట్ల అప్పులను సెటిల్ చేసుకోవటమే దీనికి కారణంగా నిలిచింది. విదర్భ ఇండస్ట్రీస్ పవర్ తరపున గ్యారెంటర్‌గా కంపెనీ బాధ్యతలు పూర్తిగా పరిష్కరించబడ్డాయి. దీని ఫలితంగా కార్పొరేట్ గ్యారెంటీ, అండర్‌టేకింగ్‌లు, బకాయి రుణానికి సంబంధించిన అన్ని బాధ్యతల నుంచి కంపెనీ విముక్తి పొందింది.

తాజా పరిణామాలతో కంపెనీకి CFM అసెట్ రీకన్‌స్ట్రక్షన్‌తో ఉన్న అన్ని వివాదాలు పరిష్కరింపబడ్డాయి. వాస్తవానికి రిలయన్స్ పవర్ ఇచ్చిన కార్పొరేట్ గ్యారెంటీకు బదులుగా విదర్భ ఇండస్ట్రీస్ పవర్ 100 శాతం షేర్లను గ్యారెంటీగా అందించటంతో అనిల్ అంబానీ కంపెనీకి పెద్ద విముక్తి లభించింది. దీంతో రిలయన్స్ పవర్ పూర్తిగా అప్పులు లేని కంపెనీగా అవతరించినట్లు ప్రకటించబడింది.
అనిల్ అంబానీ కంపెనీ రిలయన్స్ పవర్ మంగళవారం తన స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో సమాచారాన్ని పంచుకుంటూ కంపెనీ 'సున్నా రుణం' స్థితిని పొందిందని తెలిపింది. అలాగే బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి ఎటువంటి అప్పులు లేవని పేర్కొంది. జూన్ 30 నాటికి కంపెనీ మొత్తం ఆస్తులు రూ.11,155 కోట్లుగా ఉన్నాయి. అలాగే వీఐపీఎల్ ఇకపై అనుబంధ సంస్థ కాదని కంపెనీ ఫైలింగ్‌లో స్పష్టం చేసింది.
కంపెనీ సమాచారాన్ని బహిర్గతం చేసిన తర్వాత పవర్ స్టాక్ నేడు అద్భుతాలను కొనసాగిస్తోంది. ఉదయం మార్కెట్ల ప్రారంభంతోనే రిలయన్స్ పవర్ స్టాక్ 5 శాతం అప్పర్ సర్క్యూట్ తాకింది. దీంతో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో కంపెనీ షేర్ల ధర రూ.32.97గా కొనసాగుతోంది. దీనికి ముందు ఆగస్టు 22న మార్కెట్ రెగ్యులేటరీ బాడీ సెబీ అనిల్ అంబానీని సెక్యూరిటీల మార్కెట్ నుంచి ఐదేళ్లపాటు నిషేధించింది. అనిల్ అంబానీపై రూ. 25 కోట్ల పెనాల్టీని విధించింది. అలాగే అంబానీ సోదరుడిని లిస్టెడ్ కంపెనీలు లేదా మధ్యవర్తులలో రిజిస్టర్ చేయబడిన కంపెనీలలో డైరెక్టర్ లేదా కీలక నిర్వాహక సిబ్బంది(KMP) పాత్రలతో సహా సెక్యూరిటీ మార్కెట్‌తో ఎటువంటి అనుబంధం కలిగి ఉండకూడదని స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది.


Click it and Unblock the Notifications