Anil Ambani: నక్కతోక తొక్కిన అనిల్ అంబానీ.. ప్రభుత్వ నిర్ణయంతో అంబానీ స్టాక్ దూకుడు..

Reliance Infra: గత ఏడాది కాలంగా అంబానీ సోదరుడు అనిల్ కష్టాలు వరుసగా ఒకదాని తర్వాత మరొకటి తగ్గుతున్నాయి. దీంతో తరచుగా ఆయన పేరు వార్తల్లో వినిపిస్తోంది. దివాలాతో వ్యాపారవేత్తగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన అనిల్ అంబానీ పేరు ప్రస్తుతం తిరిగి వినిపిస్తోంది.

వాస్తవానికి అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇన్‌ఫ్రా కంపెనీ షేర్లు మార్కెట్ల ఒడిదొడుకుల్లో సైతం స్థిరంగా పెరుగుదలను చూస్తున్నాయి. దీంతో లక్షల మంది రిటైల్ ఇన్వెస్టర్లు కంపెనీ షేర్లను కొనుగోలు చేసేందుకు ఎగబడుతున్నారు. అయితే దీని వెనుక పెద్ద కారణమే ఉంది. వివరాల్లోకి వెళితే మహారాష్ట్రలో అధికారంలో ఉన్న ఏక్నాథ్ షిండే ప్రభుత్వం ముంబై మెట్రో లైన్ 1 పురాతన మెట్రో లైన్‌ను కొనుగోలు చేయకూడదని నిర్ణయించుకుంది. అయితే ముంబై మెట్రో వన్ ప్రైవేట్ లిమిటెడ్ (MMOPL) ద్వారా బకాయిపడిన రూ.1,700 కోట్ల రుణాన్ని వన్‌టైమ్ సెటిల్‌మెంట్‌ చేయాలని నిర్ణయించింది.

Anil Ambani s Reliance Infra stock zooming amis maharastra gov agrees to pay company debt

మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం అనిల్ అంబానీ కష్టాలను తీర్చనుంది. ఎందుకంటే ఈ ప్రాజెక్టులో రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ 74% వాటాలను కలిగి ఉంది. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం రూపంలో మెట్రో ప్రాజెక్టులో రోజుకు దాదాపు 4.6 లక్షల మంది ప్రయాణికులు ఈ కారిడార్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ వార్తల నేపథ్యంలో శుక్రవారం మార్కెట్ల ముగింపు సమయానికి రిలయన్స్ ఇన్‌ఫ్రా స్టాక్ ధర ఎన్ఎస్ఈలో ఒక్కోటి రూ.198.60 రేటు వద్ద స్థిరపడింది.

ముంబై మెట్రో వన్ ప్రైవేట్ లిమిటెడ్ (MMOPL)స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, IDBI బ్యాంక్, కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, IIFCL (UK)లకు చెల్లించాల్సి ఉంది. ఈ ఏడాది మార్చిలో రూ.1,700 కోట్లతో లోన్స్ తీర్చేందుకు రుణదాతలతో అంగీకారానికి వచ్చింది. అలాగే ఒప్పందం ప్రకారం MMRDA, MMOPL రుణదాతలకు రూ.171 కోట్ల ప్రాథమిక చెల్లింపును చేశాయి.

ముంబై మెట్రో-1లో రిలయన్స్ ఇన్‌ఫ్రా 74% వాటాను రూ.4,000 కోట్లకు MMRDA కొనుగోలు చేసేందుకు మార్చి 11న రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అయితే MMRDA దీనికి నిధులు లేవని పేర్కొంటూ మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి అందుకు ఆర్థిక సహాయాన్ని కోరింది. ఇది తిరస్కరణకు గురికావటంతో తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో షిండే ప్రభుత్వ అంబానీ వాటా కొనుగోలును నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. అయితే కంపెనీ రుణాలను చెల్లించటానికి మార్గం సుగమం కావటంతో ఇన్వెస్టర్లలో కొత్త జోష్ నెలకొంది. కంపెనీ రుణాన్ని చెల్లించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ముందుకురావటంతో షేర్లలో దూకుడు పెరుగుదల కొనసాగుతోంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+