Reliance Infra: ఇటీవలి కాలంలో అనిల్ అంబానీ కొత్త వ్యాపార ఆలోచనలతో తిరిగి వస్తున్నారు. దీంతో తిరిగి తాను గతంలో కోల్పోయిన వైభవాన్ని పొందాలని ఆయన తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
ఈ క్రమంలోనే అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎలక్ట్రిక్ కార్లు, బ్యాటరీలను తయారు చేసే ప్రణాళికలను పరిశీలిస్తోంది. ఇందుకోసం అనిల్ ఇప్పటికే చైనాకు చెందిన ప్రముఖ ఆటో మేకర్ BYD కంపెనీ మాజీ భారతీయ అధిపతిని నియమించుకుంది. ఏడాది 2.5 లక్షల వాహనాల తయారీ కెపాసిటీతో ఈవీ ప్లాంట్ ఏర్పాటుకు సలహాదారులను నియమించుకున్నట్లు రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది. ఈ ప్రణాళిక ద్వారా రానున్న కొద్ది సంవత్సరాల్లో 7,50,000 వాహనాలను తయారు చేసేందుకు కంపెనీ కృషి చేస్తుంది.

అలాగే అనిల్ అంబానీ కంపెనీ 10 గిగావాట్ గంటల(GWh) సామర్థ్యంతో ప్రారంభమయ్యే బ్యాటరీ ప్లాంట్‌ను నిర్మించే సాధ్యాసాధ్యాలను కూడా పరిశీలిస్తోందని సమాచారం. అయితే రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మాత్రం అధికారికంగా దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. మూలాల ప్రకారం రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ చైనా కంపెనీలతో సహా భాగస్వాముల కోసం కూడా వెతుకుతోందని తెలుస్తోంది. ఈ క్రమంలో ముఖేష్ కంపెనీ ఇప్పటికే స్థానికంగా బ్యాటరీలను తయారు చేయడానికి కృషి చేస్తోంది. ఈ వారం 10 GW బ్యాటరీ సెల్ ఉత్పత్తికి మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వ సబ్సిడీ కోసం బిడ్‌ను గెలుచుకుంది. ఈ లెక్కన అనిల్ అంబానీ తన బ్యాటరీ ప్లాంట్ విషయంలో అన్నతో పోటీ పడక తప్పదని తెలుస్తోంది.
గత ఏడాది దేశంలో విక్రయించబడిన 42 లక్షల కార్లలో ఎలక్ట్రిక్ వాహనాల వాటా 2% కంటే తక్కువగా ఉంది. అయితే 2030 నాటికి ప్రభుత్వం దానిని 30%కి పెంచాలని చూస్తోంది. ఈ క్రమంలో స్థానికంగా EVలు, వాటి భాగాలను తయారు చేసే కంపెనీలకు $5 బిలియన్ల కంటే ఎక్కువ ప్రోత్సాహకాలను బడ్జెట్‌లో కేటాయించింది. అయితే ఇండియా ఇప్పటికీ బ్యాటరీ టెక్నాలజీల విషయంలో ఇప్పటికీ ప్రారంభ దశల్లోనే ఉంది. ఈ క్రమంలో అమర రాజా వంటి కొన్ని స్థానిక బ్యాటరీ తయారీదారులు దేశంలో లిథియం-అయాన్ బ్యాటరీ సెల్‌లను తయారు చేసే సాంకేతికతను కొనుగోలు చేయడానికి ఇప్పటికే చైనా కంపెనీలతో జతకట్టిన సంగతి తెలిసిందే.
రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఆటోమొబైల్స్‌కు సంబంధించి రెండు కొత్త పూర్తి యాజమాన్య అనుబంధ సంస్థలను ఏర్పాటు చేసింది. వీటిలో ఒకదాని పేరు రిలయన్స్ EV ప్రైవేట్ లిమిటెడ్. ప్రస్తుతం రిలయన్స్ ఇన్‌ఫ్రా షేర్లు శుక్రవారం ఒక్కొక్కటి 1.66 శాతం పెరిగి రూ.213.45 వద్ద ఎన్ఎస్ఈలో ముగిశాయి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications