RCom Assets: భారత టెలికాం రంగంలో అనిల్ అంబానీకి చెందిన ఆర్ కామ్ దశాబ్దాల కిందట పెద్ద మార్పును తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. కాల్ ధరలు ఆకాశానికి తాకిన వేళ ప్రజలకు తొలుత సెల్యులార్ సేవలు తక్కువ రేటుకు ఇది తీసుకురావటంలో కీలకపాత్ర పోషించింది.
అయితే నష్టాలతో దివాలా తీసిన కంపెనీకి చెందిన కొన్ని రియల్ ఎస్టేట్ ఆస్తులను విక్రయించేందుకు ముంబై NCLT ట్రిబ్యునల్ తాజాగా అనుమతిని ఇచ్చింది. ట్రిబ్యునల్ CIRP రెగ్యులేషన్ 29 ప్రకారం కార్పొరేట్ రుణగ్రహీత ఆస్తుల విక్రయాన్ని నిర్వహించడానికి దరఖాస్తుదారుకు తన ఆమోదాన్ని వెల్లడించింది. తాజా ఉత్తర్వుల ప్రకారం కంపెనీకి చెందిన కొన్ని జమకాని ఆస్తులను విక్రయించడానికి NCLT నుంచి టెలికాం సంస్థ అనుమతి కోరిన తరుణంలో తీర్పు వెలువడింది.

అమ్మకం కోసం గుర్తించబడిన ఆస్తుల్లో భూమి, భవనంతో కూడిన RCom చెన్నై హాడో ఆఫీస్ ఉంది. చెన్నైలోని అంబత్తూర్‌లో సుమారు 3.44 ఎకరాల విస్తీర్ణంలో ల్యాండ్ పార్శిల్; పూణేలో 871.1 చదరపు మీటర్ల ల్యాండ్ పార్శిల్; భువనేశ్వర్ ఆఫీస్ స్పేస్, క్యాంపియన్ ప్రాపర్టీస్ షేర్లతో పాటు రిలయన్స్ రియల్టీ షేర్లలో పెట్టుబడులు సైతం విక్రయించబడుతున్నాయి.
కొంతకాలంగా రిలయన్స్ కమ్యూనికేషన్స్ షేర్ల ట్రేడింగ్ రూ.2.49 వద్ద ముగిసింది. BSEలో ట్రేడింగ్ రిస్ట్రిక్టెడ్ అనే సందేశం కనిపిస్తోంది. అంటే ప్రస్తుతం షేర్ల ట్రేడింగ్ నిలిచిపోయిందని చెప్పుకోవాలి. 2007లో ఆర్‌కామ్ షేర్లు రూ.785 వద్ద ట్రేడవుతుండేవి. ఆ తర్వాత కంపెనీ పతనంలో ఆర్‌కామ్ స్టాక్ ధర 99 శాతానికి పైగా పతనమైన సంగతి తెలిసిందే. వాస్తవానికి 2016లో ముఖేష్ అంబానీ రిలయన్స్ జియో ప్రారంభించిన తర్వాత అనిల్ అంబానీ సంస్థ పరిస్థితి దిగజారింది. అన్న ప్రకటించిన డేటా వార్ కారణంగా తమ్ముడు భరించలేని నష్టాల్లోకి జారుకున్నాడు. అలా కంపెనీ తన బ్యాంక్ రుణాలను చెల్లించటంలో డిఫాల్ట్ అయి చివరికి దివాలా ప్రక్రియలోకి వెళ్లింది.


Click it and Unblock the Notifications