Reliance Power Stock: అనిల్ అంబానీ ఒక దివాలా తీసిన బిలియనీర్ అనేది ఒకప్పటి కథ. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఎందుకంటే అనిల్ తిరిగి మార్కెట్లో వ్యాపారవేత్తగా బౌన్స్ బ్యాక్ కావటానికి చేస్తున్న ప్రయత్నాలు ఆయన కంపెనీ షేర్లను పెంచుతున్నాయి.
అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్ షేర్లు గడచిన కొన్ని ట్రేడింగ్ సెషన్ల నుంచి రాకెట్ వేగంతో వృద్ధి చెందుతున్నాయి. ఈ క్రమంలో నేడు పవర్ స్టాక్ 5 శాతం అప్పర్ సర్క్యూట్ తాకి రూ.34.45 స్థాయికి చేరుకున్నాయి. తాజా పెరుగుదలతో కంపెనీ షేర్లు తమ 52 వారాల గరిష్ఠానికి అతి చేరువలోకి వచ్చాయి. వరుసగా ఈ వారం రెండో రోజు కూడా అప్పర్ సర్క్యూట్ తాకిన రిలయన్స్ పవర్ స్టాక్ గడచిన కొన్నేళ్లుగా దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు 2900% కంటే ఎక్కువ రాబడిని అందించాయి. ఈ ప్రయాణంలో కంపెనీ షేర్ల ధర ఒక్కోటి రూ.1.13 స్థాయి నుంచి రూ.34కి ఎగబాకాయి.

ఎవరైనా వ్యక్తి దీర్ఘకాలంలో రిలయన్స్ పవర్ కంపెనీకి చెందిన షేర్లలో రూ.లక్ష ఇన్వెస్ట్ చేసి దానిని ఇప్పటి వరకు కొనసాగించి ఉంటే ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం వారి పెట్టుబడి విలువ రూ.30 లక్షలకు పైగా చేరుకుని ఉండేది. మార్చి 27, 2020లో రిలయన్స్ పవర్ కంపెనీ షేర్ల ధర అత్యల్పంగా రూ.1.13 వద్ద ఉంది ఆ సమయంలో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లు నాలుగున్నరేళ్ల తర్వాత ప్రస్తుతం విపరీతమైన రాబడులను తిరిగి అందుకుంటున్నారు. అప్పట్లో కంపెనీ షేర్లలో లక్ష ఇన్వెస్ట్ చేసి దానిని ఇప్పటి వరకు కొనసాగించిన ఇన్వెస్టర్లు రాబడి రూపంలో రూ.30.48 లక్షలు అందుకోవటం గమనార్హం.
కంపెనీ వేగంగా తన రుణాల పరిష్కారానికి చేస్తున్న చర్యలతో షేర్ ధర గత ఏడాది కాలంలో 110% కంటే ఎక్కువ పెరిగింది. ఆగస్టు 21, 2023న కంపెనీ షేర్లు రూ.16.37 వద్ద ఉండగా ప్రస్తుతం అది ఒక్కోటి రూ.34.45కి చేరాయి. అలాగే 2024లో ఇప్పటి వరకు కంపెనీ షేర్లు తమ పెట్టుబడిదారులకు దాదాపు 44 శాతం రాబడిని అందించాయి. కంపెనీ తన ఇన్వెస్టర్లకు 2008 మే నెలలో ఒకసారి 3:5 నిష్పత్తిలో బోనస్ షేర్లను కూడా అందించిన సంగతి తెలిసిందే. అనిల్ అంబానీ తిరిగి పుంజుకోవటం నిజంగా ఆయన లిస్టెడ్ కంపెనీల పెట్టుబడిదారులకు మంచి రోజులకు తిరిగి తీసుకొస్తోంది.


Click it and Unblock the Notifications