అనిల్ అంబానీ..ఈ పేరు ఒకప్పుడు టెలికం మార్కెట్లో సంచలనం.. రిలయన్స్ CDMA టెక్నాలజీ ఫోన్ తో ఎన్నో సంచలనాలు నమోదు చేసిన టెక్ నేత. నేడు మోసగాడిగా ముద్రపడిపోయాడు. ఒకప్పుడు ప్రపంచంలోనే ధనవంతుల జాబితాలో ఆరవస్థానంలోని నిలిచిన ఈ ధీరుడు ఇప్పుడు దివాళాతో పాతాళానికి పడిపోయాడు. దేశంలో ప్రముఖ వ్యాపారవేత్తలలో ఒకరిగా ఎదిగిన అనిల్ అంబానీ ఇప్పుడు పేదవాడిగా మారిపోయాడు.
యెస్ బ్యాంక్ కు సంబంధించిన రూ. 3000 కోట్ల కుంభకోణానికి సంబంధించి ఆయన కార్యాలయాలపై ఈడీ దాడులు చేసింది. దేశంలోని అతిపెద్ద బ్యాంకు ఎస్బిఐ అతన్ని మోసగాడిగా ప్రకటించింది.ఈ నేపథ్యంలో అనిల్ అంబానీ వ్యాపార సామ్రాజ్యం పతనానికి తగిలిన మూడు దెబ్బలు ఏంటో ఓ సారి చూద్దాం.
అనిల్ అంబానీ వ్యాపార సామ్రాజ్యం పతనానికి తగిలిన మూడు దెబ్బలు ఇవే..
మొదటి దెబ్బ: తన వ్యాపారం శిఖర స్థాయిలో ఉన్న సమయంలో, అనిల్ అంబానీ తన పతనం ఎప్పుడూ ఊహించలేదు. 2000ల మధ్యలో అతని వ్యాపార నిర్ణయాలు విజయాలతో నిండిపోయినా, దూకుడు విస్తరణ, భారీ రుణ భారం, అనుకూలించని మార్కెట్ పరిస్థితులు, మరియు వ్యాపార వ్యూహాల లోపాలు కలయికగా చివరికి అతని సామ్రాజ్యాన్ని వంశపారంపర్య పతన దిశగా నెట్టాయి. 2008 నాటికి అనిల్ అంబానీకి చెందిన ADAG గ్రూప్ లాభం దాదాపు రూ. 9,000 కోట్ల వరకు చేరింది. అయితే, ఇందులో 75 శాతం లాభం కేవలం ఒకే కంపెనీ రిలయన్స్ కమ్యూనికేషన్ నుండి వచ్చింది. ఇది గ్రూప్ మొత్తం వృద్ధి మీద అధికంగా ఆధారపడింది.

అయితే రిలయన్స్ కమ్యూనికేషన్ ఆఫర్ చేసిన సేవలు కాలానుగుణంగా ఆధునీకరించపోవడం, ముఖ్యంగా 4G టెక్నాలజీకి అప్‌గ్రేడ్ కాకపోవడం, దాని పతనానికి కారణమైంది. వోడాఫోన్, ఎయిర్‌టెల్ వంటి టెలికాం దిగ్గజాలు అప్పటికే 4G ప్లాన్లతో ప్రజలకు వేగవంతమైన ఇంటర్నెట్‌ను అందించగా, రిలయన్స్ కమ్యూనికేషన్ భారీ అప్పుల్లో మునిగిపోవడంతో ఆ స్థాయికి చేరలేకపోయింది.దీంతో వినియోగదారులు మెరుగైన సేవల కోసం వోడాఫోన్, ఎయిర్‌టెల్ వైపుకు వెళ్లారు. ఇది రిలయన్స్ కమ్యూనికేషన్‌కు తీవ్రమైన ఆర్థిక సంక్షోభానికి దారి తీసింది.
రెండవ దెబ్బ: రిలయన్స్ పవర్ ప్లాన్ విఫలమవడం.. రిలయన్స్ కమ్యూనికేషన్ తరువాత, అనిల్ అంబానీ వ్యాపార సామ్రాజ్యానికి మరో తీవ్రమైన ఎదురుదెబ్బ రిలయన్స్ పవర్ రూపంలో వచ్చింది. ఈ సంస్థ దాద్రి, షాపూర్ ప్రాంతాల్లో రెండు గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్లను అభివృద్ధి చేసింది. ఇవి విద్యుత్ ఉత్పత్తి కోసం సహజ వాయువుపై పూర్తిగా ఆధారపడి ఉండేవి. అయితే, అనిల్ అంబానీకి సహజ వాయువును సరఫరా చేయాల్సిన వ్యక్తి ఆయన సోదరుడు ముఖేష్ అంబానీనే.
వారి మధ్య ఉన్న విభజన ఒప్పందం ప్రకారం యూనిట్‌కు 2.34 డాలర్ల ధరకు సహజ వాయువును రిలయన్స్ పవర్‌కు సరఫరా చేయాలని నిర్ణయం బెడిసికొట్టింది. కానీ అనంతరం ముఖేష్ ధరను రెట్టింపు చేశాడు, ఇది ఒప్పంద ఉల్లంఘనగా భావించిన అనిల్, బాంబే హైకోర్టులో ముఖేష్‌పై కేసు దాఖలు చేశాడు. అయితే, ముఖేష్ ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేయగా.. చివరకు సుప్రీంకోర్టు ముఖేష్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో అనిల్ అంబానీకి ఖరీదైన మార్కెట్ రేటుకే గ్యాస్ కొనడం తప్ప వేరే మార్గం లేకుండా పోయింది.
ఈ పరిణామాల నేపథ్యంలో అనిల్ అంబానీ భవిష్యత్తు ఆశాకిరణం దాద్రి పవర్ ప్రాజెక్టు పూర్తిగా మూతపడింది. ఇది ఆయనకు వ్యక్తిగతంగా, వ్యాపారపరంగా గట్టి నష్టాలను మిగిల్చింది.2015 నాటికి, రిలయన్స్ క్యాపిటల్ మినహా, అతని ఇతర కంపెనీలన్నీ మూతపడే దశలో ఉన్నాయి.పవర్, టెలికం, ఎంటర్టైన్మెంట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో పెట్టిన భారీ పెట్టుబడులు అప్పులను మిగిల్చాయి.
మూడవ దెబ్బ: రక్షణ రంగంలో అర్థరహిత ప్రవేశం.. 2015 నాటికి అనిల్ అంబానీ నేతృత్వంలోని అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్ (ADAG) సంస్థలు ఇప్పటికే రూ. 1,25,000 కోట్ల భారీ అప్పుల్లో కూరుకుపోయాయి. అయినా సరే ఆర్థిక కష్టాలను లెక్కచేయకుండా అనిల్ అంబానీ మరో కొత్త రంగంలో అడుగుపెట్టే సాహసానికి పాల్పడ్డారు. అదే రక్షణ తయారీ (Defence Manufacturing). అతను నష్టాలలో ఉన్న పిపావావ్ డిఫెన్స్ అండ్ ఆఫ్షోర్ ఇంజినీరింగ్ కంపెనీని రూ. 2 వేల కోట్లకు కొనుగోలు చేశారు. ఈ సంస్థ అప్పటికే రూ. 6,700 కోట్ల అప్పు భారంతో కొట్టుమిట్టాడుతోంది.అనిల్ అంబానీ దానిని "రిలయన్స్ డిఫెన్స్ గా మార్పు చేశారు. అదే ఆయన పాలిట శాపంలా మారింది.
రక్షణ రంగంపై గణనీయమైన అనుభవం లేకపోవడంతో అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. కంపెనీకి తగిన మానవ వనరులు, నిర్మాణ సామర్థ్యం లేకపోవడం వల్ల ఆ వ్యాపారంలో కూడా నష్టాల పాలయ్యాడు. ఉద్యోగుల జీతాల్లాంటివే చెల్లించలేని స్థాయిలో అప్పుల భారం పెరిగింది. కాంట్రాక్టులు సకాలంలో పూర్తి చేయలేకపోయాడు. పలు డిఫెన్స్ ప్రాజెక్టులు నిలిచిపోయాయి. దీంతో భారత ప్రభుత్వం కూడా రిలయన్స్ డిఫెన్స్‌పై విశ్వాసం కోల్పోయింది.చివరికి రిలయన్స్ డిఫెన్స్ కూడా సామర్థ్యం లేక మూసివేయాల్సిన పరిస్థితి ఎదురైంది. ఇది అనిల్ అంబానీ వ్యాపార పతనాన్ని మరింతగా కిందకు తోసింది.
2016లో ముఖేష్ అంబానీ జియో రంగ ప్రవేశం చేసింది. టెలికాం రంగంలోకి ముఖేష్ అంబానీ ప్రవేశం అనిల్ అంబానీనీ పాతాళానికి తొక్కేసింది. జియో సంపద బాగా పెరిగగా అదే సమయంలో అనిల్ రిలయన్స్ కమ్యూనికేషన్స్ మార్కెట్ 2 శాతానికి పడిపోయింది.2019లో అనిల్ అంబానీ తన వ్యాపార సామ్రాజ్యాన్ని కోల్పోయిన దశలో ఉన్నప్పుడు, అతని సంస్థ రిలయన్స్ కమ్యూనికేషన్స్ (RCom) స్వీడన్‌కు చెందిన టెలికాం దిగ్గజం ఎరిక్సన్‌కు చెల్లించాల్సిన రూ. 453 కోట్ల రుణాన్ని ఎప్పటికప్పుడు క్లియర్ చేయలేకపోయింది. ఒక నెలలో బాకీ చెల్లించకపోతే, అనిల్ అంబానీకి మూడునెలల జైలు శిక్ష విధించబడుతుందని కోర్టు స్పష్టం చేసింది. అనిల్ సోదరుడు ముఖేష్ అంబానీ ఆ రుణాన్ని తన సొంత ఖర్చుతో తీర్చారు. ముఖేష్ చెల్లించిన రూ. 453 కోట్లు అనిల్‌ను జైలు శిక్ష నుంచి తప్పించాయి. అన్నకు ధన్యవాదాలు కూడా తెలిపారు.
2020 ప్రారంభంలో, అనిల్ అంబానీ యొక్క ప్రధాన కంపెనీ రిలయన్స్ కమ్యూనికేషన్స్ (RCom), అనివార్యంగా దివాలా కోసం దరఖాస్తు చేయాల్సి వచ్చింది. అప్పటికే వేల కోట్ల అప్పుల్లో మునిగిపోయిన RCom కు మరిన్ని రుణాలు అందించే బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లు కనబడలేదు. ఆర్ధిక ఇబ్బందులు అనిల్‌కి చెందిన ఇతర సంస్థలన్నింటిని కుదిపేశాయి.నా వద్ద అమ్మడానికి ఏ ఆస్తులు లేవు... కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు సంపత్తి లేదని కోర్టుకు అనిల్ అంబానీ తెలిపారు.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు

TCS Q4 ఫలితాలు: ఇన్వెస్టర్ల అంచనాలను అందుకుంటుందా?



Click it and Unblock the Notifications