అనిల్ అంబానీ..ఈ పేరు ఒకప్పుడు టెలికం మార్కెట్లో సంచలనం.. రిలయన్స్ CDMA టెక్నాలజీ ఫోన్ తో ఎన్నో సంచలనాలు నమోదు చేసిన టెక్ నేత. నేడు మోసగాడిగా ముద్రపడిపోయాడు. ఒకప్పుడు ప్రపంచంలోనే ధనవంతుల జాబితాలో ఆరవస్థానంలోని నిలిచిన ఈ ధీరుడు ఇప్పుడు దివాళాతో పాతాళానికి పడిపోయాడు. దేశంలో ప్రముఖ వ్యాపారవేత్తలలో ఒకరిగా ఎదిగిన అనిల్ అంబానీ ఇప్పుడు పేదవాడిగా మారిపోయాడు. యెస్ బ్యాంక్ కు సంబంధించిన రూ. 3000 కోట్ల కుంభకోణానికి సంబంధించి ఆయన కార్యాలయాలపై ఈడీ దాడులు చేసింది. దేశంలోని అతిపెద్ద బ్యాంకు ఎస్బిఐ అతన్ని మోసగాడిగా ప్రకటించింది. ధనవంతుల జాబితా నుండి మోసగాడిగా మారిన అతని కథ ఇదే..
అంబానీ బ్రదర్స్ వ్యాపారంలో విభజన: 2005వ సంవత్సరంలో ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ మధ్య తీవ్రమైన వ్యాపార విభేదాలు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీశాయి. కుటుంబ విభేదాలు తీవ్రస్థాయికి చేరిన సమయంలో వారి తల్లి కోకిలాబెన్ అంబానీ ఇద్దరి మధ్య మధ్యవర్తిగా ప్రవేశించింది. రిలయన్స్ గ్రూప్‌ను సమానంగా విభజించి ఇద్దరికీ పంచడంలో కీలక పాత్ర పోషించారు.జూన్ 18, 2005 రిలయన్స్ గ్రూప్‌ను ఇద్దరు కొడుకులు విడిగా కేటాయిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

ముఖేష్ అంబానీకి ఎలాంటి కంపెనీలు దక్కాయి? : విభజనలో భాగంగా, ముఖేష్ అంబానీకి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL), ఇండియన్ పేట్రోకెమికల్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (IPCL) దక్కాయి. ఈ కంపెనీలు ముడి చమురు శుద్ధి, పెట్రోకెమికల్స్ ఉత్పత్తి, చమురు & గ్యాస్ అన్వేషణ రంగాల్లో ప్రసిద్ధి గాంచాయి. ఇవి అప్పటికే భారీగా లాభాలను ఆర్జిస్తున్న వ్యాపారాలు కావడం వల్ల, ముఖేష్‌కు బలమైన స్థితి ఏర్పడింది.
అనిల్ అంబానీకి దక్కిన వ్యాపారాలు : అనిల్ అంబానీకి విభజనలో భాగంగా రిలయన్స్ కమ్యూనికేషన్స్, రిలయన్స్ క్యాపిటల్, రిలయన్స్ పవర్ లాంటి కంపెనీలు దక్కాయి. ఈ వ్యాపారాలను కలిపి ఆయన అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్ (ADAG) అని పిలిచారు. ఈ సంస్థలు అప్పటి వరకు ఎక్కువ లాభాలు చూపకపోయినా, భవిష్యత్తులో భారీ వృద్ధికి అవకాశమున్న రంగాల్లో ఉన్నట్లు భావించబడింది. ముఖ్యంగా టెలికాం, ఫైనాన్స్ ఎనర్జీ రంగాలపై భవిష్యత్ ప్రభావం కనిపించింది. అనిల్ అంబానీ మౌలిక సదుపాయాలు, రక్షణ, వినోదం వంటి వివిధ రంగాలలోకి ప్రవేశించారు కానీ పరిమితంగానే విజయం సాధించారు.
ఎవరి వ్యాపారం ఎలా సాగింది: విభజనలో ముఖేష్ అంబానీకు స్థిరమైన క్యాష్ ఫ్లో కలిగిన, స్థిరంగా పెరుగుతున్న వ్యాపారాలు దక్కాయి. అనిల్‌కు భవిష్యత్తులో విస్తరించే అవకాశం ఉన్న వ్యాపారాలు దక్కినప్పటికీ, వాటిలో పారదర్శకత, నిర్దిష్ట వ్యూహాలు, నిధుల పొందడం విషయంలో సమస్యలు ఉండటం వల్ల తర్వాత కాలంలో అనిల్ వ్యాపార సామ్రాజ్యానికి ఎదురుదెబ్బ తగలడానికి కారణమయ్యింది.ఉత్తరప్రదేశ్‌లోని దాద్రిలో గ్యాస్ ఆధారిత మెగా పవర్ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేయడానికి ఆయన చేసిన ప్రయత్నం 2009లో అలహాబాద్ హైకోర్టు భూసేకరణను రద్దు చేయడంతో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. అడ్లాబ్స్, డ్రీమ్‌వర్క్స్‌తో ఒప్పందాలు కూడా వినోద పరిశ్రమలో ఆశించిన లాభాలను ఇవ్వలేకపోయాయి.
అనిల్ అంబానీ వ్యాపార విస్తరణ: 2005లో ముఖేష్ అంబానీతో వ్యాపార విభజన తర్వాత, అనిల్ అంబానీకు తన వ్యాపారాలపై పూర్తిగా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం లభిచింది. కోకిలాబెన్ అంబానీ మధ్యవర్తిత్వంతో రిలయన్స్ గ్రూప్‌ను రెండు భాగాలుగా విభజించిన తర్వాత.. అనిల్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించేందుకు వేగంగా ముందుకెళ్లారు. విభజన ప్రక్రియ పూర్తయిన రెండు రోజుల్లోనే.. అనిల్ తన కొత్త వ్యాపార గ్రూప్ ADAG (Anil Dhirubhai Ambani Group) ద్వారా వేల కోట్ల విలువైన పలు ప్రాజెక్టులను ప్రకటించారు.
భవిష్యత్ ప్రణాళికలు: రిలయన్స్ పవర్ ద్వారా అనిల్ అంబానీ రూ.80,000 కోట్ల భారీ విద్యుత్ ఉత్పత్తి ప్రణాళికను ప్రకటించారు. ఇది అప్పటికి భారతదేశంలో ఎప్పుడూ ప్రకటించబడని అతిపెద్ద ప్రైవేట్ పవర్ ప్రాజెక్టుగా నిలిచింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో మెగా పవర్ ప్లాంట్ల ఏర్పాటుతో లక్షలాది మెగావాట్ల ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నారు.అనిల్ వ్యూహంలో మరో ముఖ్య భాగం రిలయన్స్ క్యాపిటల్ ద్వారా రిటైల్ ఫైనాన్సింగ్ రంగంలో రూ. 2000 కోట్ల పెట్టుబడి చేయడం. ఈ పెట్టుబడి ద్వారా బీమా, మ్యూచువల్ ఫండ్స్, రిటైల్ లోన్లు వంటి విభాగాల్లో విస్తరణ లక్ష్యంగా పెట్టుకున్నారు. పవర్, ఫైనాన్స్ రంగాలతో పాటు, అనిల్ అంబానీ తన వ్యాపార సామ్రాజ్యాన్ని మౌలిక సదుపాయాలు (Infrastructure), వినోద రంగాల్లోకి (Entertainment) విస్తరించాలని ప్రకటించారు. మల్టీప్లెక్స్ థియేటర్స్, మీడియా, టెలివిజన్, మరియు ఫిల్మ్ ప్రొడక్షన్ రంగాలపై దృష్టి పెట్టాలన్నది ఆయన ప్లాన్.
ప్రాజెక్టుల కోసం వేల కోట్ల ఆర్థిక రుణాలు: ఈ విస్తృత ప్రాజెక్టులకు నిధు కోసం అనిల్ అంబానీ దేశంలోని ప్రముఖ బ్యాంకుల నుండి వేల కోట్ల రూపాయల రుణాలను పొందారు. అలాగే కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు. వాటిలో ముఖ్యమైనది రిలయన్స్ కమ్యూనికేషన్ (RCom) యొక్క ప్రాథమిక షేర్ విక్రయం (IPO). ఇది కొన్ని రోజుల్లోనే ప్రారంభమై, పెట్టుబడిదారుల నుంచి భారీ స్పందనను పొందింది. తద్వారా ఆయన తన వ్యాపార సామ్రాజ్యాన్ని మరింతగా విస్తరించారు. భారతదేశంలో అతిపెద్ద టెలికాం సంస్థలలో ఒకటిగా RCom నిలిచింది. ముఖ్యంగా CDMA టెక్నాలజీ ఆధారంగా తక్కువ ధరల మొబైల్ సేవలను ప్రవేశపెట్టడంలో కీలకపాత్ర పోషించింది. ఇది సామాన్య వినియోగదారులకు టెలికాం సేవలను సులభంగా అందించడంలో విప్లవాత్మక మార్పు తీసుకువచ్చింది.
టెలికాం రంగంతో పాటు అనిల్ విద్యుత్ రంగంలో కూడా దూసుకెళ్లారు. రిలయన్స్ పవర్ను స్థాపించి, భారతదేశంలో అతిపెద్ద ప్రైవేట్ పవర్ ప్రాజెక్టులను ప్రారంభించారు. 2008లో రిలయన్స్ పవర్ IPOకి వచ్చిన స్పందన అపూర్వం - కేవలం 60 సెకన్లలో పూర్తి సభ్యత్వం (oversubscription) పొందడం ద్వారా భారత కార్పొరేట్ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. ఇది అప్పటికి భారతదేశపు అతిపెద్ద IPOగా నిలిచింది.
2007లో అనిల్ అంబానీ సంపద: 2007 నాటికి అనిల్ అంబానీ సంపద రూ. 4 లక్షల కోట్ల (సుమారు 100 బిలియన్ డాలర్లు)ను దాటి, భారతీయ కార్పొరేట్ ప్రపంచంలో ఒక అసాధారణ విజయగాధగా నిలిచింది. 2008 నాటికి అనిల్ అంబానీ నికర విలువ 42 బిలియన్ డాలర్లకు ఎగసింది. ఆయనను ప్రపంచంలోనే ఆరవ ధనవంతుడిగా మార్చింది. ఇది ఆ కాలంలో భారత వ్యాపార చరిత్రలోనే అరుదైన ఘనతగా చెప్పుకోవచ్చు. నేడు దివాళాతొ చరిత్రలో మరో ఘనతగా మిగిలిపోయారు అనిల్.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications