Reliance Infra Stock: చాలా కాలం తర్వాత మార్కెట్లో మళ్లీ తిరిగి అనిల్ అంబానీ పేరు వినిపిస్తోంది. ఇప్పుడిప్పుడే సమస్యను నుంచి గట్టెక్కుతున్న ఆయనకు నేడు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.
నేడు అనిల్ అంబానీకి పెద్ద షాక్ తగిలింది. రూ.8,000 కోట్ల విలువైన ఆర్బిట్రేషన్ అవార్డును సుప్రీంకోర్టు రద్దు చేయటం తలనొప్పిగా మారింది. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు చెందిన దిల్లీ ఎయిర్‌పోర్ట్ మెట్రో ఎక్స్‌ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్(DAMEPL)కి మధ్యవర్తిత్వ తీర్పు అనుకూలంగా ఉంది. అయితే ఆర్బిట్రేషన్ ఆర్డర్ రద్దు కావడంతో అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇన్‌ఫ్రా, రిలయన్స్ పవర్ షేర్లు ఇట్రాడేలో నేడు కుప్పకూలాయి.

రూ.8,000 కోట్ల మధ్యవర్తిత్వ తీర్పును సుప్రీంకోర్టు రద్దు చేయడంతో అనిల్ అంబానీకి చెందిన కంపెనీల షేర్లు భారీగా క్షీణతను ఎదుర్కొంటున్నాయి. రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ షేర్లు ఇంట్రాడేలో అత్యధికంగా 20% క్షీణించి రూ.227.40కి చేరాయి. దీనికి ముందు మంగళవారం కంపెనీ షేర్లు రూ.284.20 వద్ద ముగిశాయి. ఇదే క్రమంలో రిలయన్స్ పవర్ షేర్లలో 5 శాతం లోయర్ సర్క్యూట్ తాకి రూ.28.34 రేటుకు పడిపోయాయి.
మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ)పై ఆర్బిట్రేషన్ తీర్పు పేటెంట్ చట్టవిరుద్ధమని పేర్కొన్న హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలను సుప్రీంకోర్టు సమర్థించింది. ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం, 'డిఎంఆర్‌సి డిపాజిట్ చేసిన మొత్తం తిరిగి ఇవ్వబడుతుంది. బలవంతపు చర్యలో భాగంగా, పిటిషనర్ చెల్లించిన ఏదైనా మొత్తాన్ని తిరిగి చెల్లించవలసి ఉంటుంది. సుప్రీం కోర్టు తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది మరియు DMRC యొక్క క్యూరేటివ్ పిటిషన్‌ను అనుమతించింది.


Click it and Unblock the Notifications