ధీరూభాయ్ అంబానీ ఆస్తులను, వ్యాపార కార్యకలాపాలను ఆయన కుమారులు ముఖేష్ అంబానీలు, అనిల్ అంబానీలు పంచుకున్న విషయం తెలిసిందే. అనంతరం ఓ వెలుగు వెలిగిన అనిల్ అంబానీ కాలక్రమేణా చతికిలపడ్డారు. అందుకు భిన్నంగా ముఖేష్ మాత్రం అంచెలంచెలుగా తండ్రి వారసత్వాన్ని నిలబెడుతూ ప్రపంచ బిలియనీర్లలో ఒకరిగా పేరు సంపాదించారు.
2008 నాటికి తన సోదరుడిని వెనక్కు నెట్టి 42 బిలియన్ల నికర సంపదను అనిల్ సంపాదించారు. తద్వారా ప్రపంచంలోనే 6వ అత్యంత సంపన్నుడిగా నిలిచారు. ఇదే జోరుతో తండ్రి ధీరూభాయ్ అంబానీ లెగసీని ముందుకు తీసుకువెళ్తారని అందరూ భావించారు. కానీ వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. 15 ఏళ్లుగా అంచెలంచెలుగా దిగజారుతూ భారీ రుణాల్లో కూరుకుపోయారు.

ఇందుకు ప్రధాన కారణం దక్షిణాఫ్రికా టెలికాం దిగ్గజం MTNతో ఒప్పందం పెట్టుకోవడమేనని అంచనా. అదికాస్తా న్యాపరమైన సమస్యల వల్ల విఫలం కావడంతో భారీ నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. ఈ పరిస్థితుల్లో 2G కుంభకోణం వల్ల తన సంస్థ రిలయన్స్ కమ్యూనికేషన్స్ లోని టాప్ ఎగ్జిక్యూటివ్స్ కంపెనీని వీడారు. ఇదే వ్యవహారంలో CBI విచారణను సైతం ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇవన్నీ వెరసి కంపెనీ స్టాక్స్ విలువను పాతాళానికి నెట్టాయి.
అప్పుల ఊబిలో కూరుకుపోయిన అనిల్.. వ్యక్తిగత హామీ మీద చైనా బ్యాంకుల నుంచి 1.2 బిలియన్ల మేర రుణాలను సమీకరించారు. అయితే వాటిని తిరిగి తీర్చడంలో విఫలం కావడంతో వారి నుంచి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వచ్చింది. అనంతరం 2016లో సోదరుడు ముఖేష్ అంబానీ జియో ద్వారా టెలికాం వ్యాపారంలోకి ప్రవేశించడంతో భారీ పోటీ ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో రిలయన్స్ కమ్యూనికేషన్స్ విలువ 2 శాతానికి పడిపోయింది.
రుణాల చెల్లింపుల కోసం తన అతిపెద్ద వ్యాపార విభాగం రిలయన్స్ పవర్ ఆస్తులను అనిల్ అమ్ముకోవాల్సి వచ్చింది. 80 మిలియన్ డాలర్ల అప్పు మొత్తాన్ని తిరిగి పే చేయాలంటూ స్పీడన్ కు చెందిన ఎరిక్సన్ డిమాండ్ చేయసాగింది. ఇదికాస్తా పెద్ద తలనొప్పి వ్యవహారంగా తయారైంది. వేలకోట్ల అధిపతిగా ప్రస్థానం మొదలుపెట్టి చివరకు దివాళా స్థాయికి పడిపోవడం భాదాకరం.


Click it and Unblock the Notifications