Anil Ambani: అనిల్ అంబానీ తలుపుతట్టిన అదృష్టం.. మ్యాటర్ లీక్, స్టాక్ అప్..
Reliance Power Stock: అనిల్ అంబానీ అంటే ఒకప్పుడు దివాలా తీసిన వ్యాపారవేత్తగానే అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఆయన తిరిగి బౌన్స్ బ్యాక్ అవుతున్న తీరు వ్యాపార చరిత్రలో రాబోయే తరాలు గుర్తుంచుకునే విధంగా ఉంది. ప్రస్తుతం అనిల్ అంబానీ తన కంపెనీల రుణాలను వేగంగా సెటిల్ చేస్తూ తిరిగి వ్యాపారాన్ని పరుగులు పెట్టించే పనిలో నిమగ్నమై ఉన్నారు.
ఈ క్రమంలో అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్ షేర్లు ఏడాది కాలంలో 160 శాతానికి పైగా పెరిగాయి. ప్రస్తుతం కంపెనీ షేర్ల వెనుక ఇన్వెస్టర్లు తిరిగి కొనుగోలు కోసం పరిగెడుతున్నారు. స్టాక్‌లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో స్టాక్ తరచుగా అప్పర్ సర్క్యూట్‌లో ట్రేడ్ అవుతోంది. ఈ క్రమంలోనే నేడు ఇంట్రాడేలో కంపెనీ షేర్లు 5 శాతం అప్పర్ సర్క్యూట్ తాకాయి. ప్రస్తుతం ఒక్కో షేరు మార్కెట్లో రూ.42.36 వద్ద ట్రేడవుతోంది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాప్ నేడు రూ.17,000 కోట్లుగా ఉంది.

ప్రస్తుతం రిలయన్స్ పవర్ కంపెనీ షేర్లు పుంజుకోవటానికి కారణం అంబానీ కంపెనీ ప్రిఫరెన్స్ షేర్ల జారీ ద్వారా రూ.1,524.60 కోట్లను సమీకరించేందుకు ఇన్వెస్టర్లు ఆమోదం పొందటమే. కంపెనీ ఈ విషయాన్ని స్టాక్ ఎక్స్ఛేంజీ ఫైలింగ్స్ ద్వారా వెల్లడించింది. ఈ క్రమంలో పోస్టల్ బ్యాలెట్ నోటిఫికేషన్ ద్వారా అవసరమైన మెజారిటీతో ప్రతిపాదన ఆమోదం పొందింది. 99.5% వాటాదారులు ప్రిఫరెన్షియల్ ఇష్యూ ద్వారా క్యాపిటల్ రైజ్ చేయటానికి అనుకూలంగా ఓటు వేశారు. దీని ప్రకారం ఒక్కో షేరును రూ.33 చొప్పున 46.20 కోట్ల సమాన సంఖ్యలో ఈక్విటీ షేర్ల కన్వర్టిబుల్ వారెంట్ల ద్వారా రూ.1,524.60 కోట్ల వరకు సమీకరించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. కంపెనీ మాతృసంస్థ రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రూ.604 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. మిగిలిన రూ.900 కోట్లు మరో ఇద్దరు ఇన్వెస్టర్ల నుంచి కంపెనీ రైజ్ చేస్తోంది.
అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం అథమ్ ఇన్వెస్ట్‌మెంట్ రూ.720 కోట్లు, సనాతన్ ఫైనాన్షియల్ రూ.200 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నాయని వెల్లడైంది. ప్రిఫరెన్స్ షేర్లు రిలయన్స్ పవర్ నికర విలువను రూ.11,155 కోట్ల నుంచి రూ.12,680 కోట్లకు పెంచుతాయి. ఈ మెరుగైన మూలధనం పునరుత్పాదక ఇంధన రంగానికి సంస్థ సహకారాన్ని మరింత పెంచుతుంది. కంపెనీ కొత్తగా సమీకరిస్తున్న నిధులను వ్యాపార విస్తరణతో పాటు జాయింట్ వెంచర్ల పెట్టుబడిలో, రుణాల చెల్లింపులు వంటి అవసరాలకు వినియోగించాలని నిర్ణయించింది.


Click it and Unblock the Notifications