వృత్తి పన్ను: ఏప్రిల్ 1 నుండి ఆంధ్రప్రదేశ్‌లో అమలు, ఎవరి పై అంటే..?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక పక్క రాష్ట్ర రాజధాని అమరావతి పనులు ముమ్మరం చేస్తుండగా, మరోపక్క అభివృద్ధి పనులకి కూడా శ్రీకారం చుట్టింది. ఈ తరుణంలో తాజాగా బడ్జెట్ సమావేశాలు కూడా జరిగాయి. బడ్జెట్ సమావేశాలు ముగిసాక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏప్రిల్ 1 నుండి వృత్తి పన్ను( professional tax) వసూలు చేసే చేసేందుకు వాణిజ్య పన్నుల శాఖకు బాధ్యతలు అప్పగించింది. భారతదేశంలోని కొన్ని రాష్ట్రాలు వివిధ వృత్తులు, వ్యాపారాలు, ఉపాధిలో కొనసాగుతున్న వారిపై వృత్తి పన్ను విధిస్తున్నాయి. అయితే ఈ పన్ను మొత్తం రాష్ట్రం అలాగే వృత్తిని బట్టి మారుతుంటుంది.

Andhra Pradesh will impose professional tax affecting salaried class Here s how it impacts them

ప్రొఫెషనల్ టాక్స్ అంటే ఏమిటి: వృత్తి పన్ను అనేది ప్రతి రాష్ట్ర వాణిజ్య పన్ను శాఖ ఏదైనా ఉద్యోగ హోదాలో వేతనాలు పొందే వ్యక్తులపై విధించేది. కంపెనీ లేదా యాజమాన్యం ఉద్యోగుల జీతాలు చెల్లించే ముందు ఈ పన్నును కోత విధిస్తుంది. వృత్తిపరమైన పన్ను రాష్ట్ర చట్టాల ద్వారా నిర్వహించబడుతుంది కాబట్టి, ప్రతి రాష్ట్రానికి స్వంత రూల్స్, స్లాబ్ రేట్లు, గడువులు ఉంటాయి. ఉద్యోగులు వేర్వేరు జీతాల కోవాలోకి వస్తారు, అందువల్ల వృత్తిపరమైన పన్నును సమానమైనంగా కాకుండా వేర్వేరుగా ఉంటుంది.

అయితే ఈ పన్ను రాష్ట్రం విధింస్తుంది కాబట్టి ప్రతి రాష్ట్రానికి స్వంత చట్టాలు అలాగే నిబంధనలు ఉంటాయి, దింతో రాష్ట్రాల వారీగా ప్రొఫెషనల్ టాక్స్ భిన్నంగా ఉంటుంది. వృత్తి పన్నును సంబంధిత రాష్ట్రాల వాణిజ్య పన్ను శాఖ వసూలు చేస్తుంది, ఆ తరువాత దానిని మున్సిపల్ కార్పొరేషన్ ఫండ్'కి జమ చేస్తుంది. ఏ రాష్ట్రం అయినా విధించే అత్యధిక వృత్తిపరమైన పన్ను సంవత్సరానికి రూ. 2,500. అంతేకాకుండా, వృత్తిపరమైన పన్ను విధించే పరిమితి స్త్రీలకు ఇంకా పురుషులకు వేరువేరుగా ఉంటుంది.

ఏ రాష్ట్రాలు వృత్తి పన్ను విధిస్తాయి: కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, కేరళ, మధ్యప్రదేశ్, నాగాలాండ్, ఒడిశా, పంజాబ్ వృత్తి పన్ను విధిస్తున్న కొన్ని రాష్ట్రాలు.

ఉదాహరణకి రాష్ట్రాల్లోని ప్రొఫెషనల్ టాక్స్ స్లాబ్‌లు చూస్తే :
ఆంధ్రప్రదేశ్: ఒక నెలకి 15 వేల వరకు ఆదాయం ఉంటె ప్రొఫెషనల్ టాక్స్ ఉండదు. కానీ నెలకు రూ.15,001 నుండి రూ.20 వేల ఆదాయం ఉంటె రూ.150, రూ.20 వేల పైన నెలకు ఆదాయం ఉంటె రూ.200 విధిస్తారు.

గుజరాత్: రూ.5,999 వరకు నో ప్రొఫెషనల్ ట్యాక్స్, నెలకు రూ.6,000 నుండి రూ.8,999కి రూ.80, నెలకు రూ.9,000 నుండి రూ.11,999కి రూ.150, నెలకు రూ.12,000 నుండి అంతకంటే ఎక్కువకి రూ.200

కర్ణాటక: నెలకు రూ.15,000 వరకు ఆదాయం ఉంటె ఎలాంటి ప్రేఫెషనల్ ట్యాక్స్ ఉండదు. నెలకు రూ.15,000 దాటితే రూ.200

మహారాష్ట్ర: నెలకి ఆదాయం రూ.7,500 వరకు (పురుషులకు) నో ప్రేఫెషనల్ ట్యాక్స్ అదే మహిళలకు రూ.10,000 వరకు నో ప్రేఫెషనల్ ట్యాక్స్. నెలకి రూ.7,501 నుండి రూ.10,000 ఆదాయానికి(పురుషులకు): నెలకు రూ.175. నెలకు రూ.10,000 పైన ఆదాయం ఉంటె : రూ.200

పశ్చిమ బెంగాల్: నెలకు రూ.10,000 వరకు ఆదాయం ఉంటె ప్రేఫెషనల్ ట్యాక్స్ లేదు. కానీ రూ.10,001 నుండి రూ.15,000 ఉంటె రూ.110. రూ.15,001 నుండి రూ.25,000 ఉంటె రూ.130. రూ.25,001 నుండి రూ.40,000 ఉంటె రూ.150. రూ.40,000 పైన ఉంటె నెలకు రూ.200

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+