శుభవార్త: ఒక్కో మహిళకు ఏడాదికి రూ.15వేలు, కాపు నేస్తానికి రూ.900 కోట్లు!

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాపులకు శుభవార్త చెప్పింది. వైయస్సార్ కాపు నేస్తం పేరుతో కొత్త పథకం ప్రకటించింది. కాపు, బలిజ, తెలగ, ఒంటరి, ఉపకులాలకు చెందిన ఆర్థికంగా వెనుకబడిన మహిళల జీవన ప్రమాణాలు పెంచి, ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు వారికి ఏటా రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం అందించనుంది. 45-60 ఏళ్ల మధ్య వయస్సు మహిళలకు ఏటా రూ.15వేల చొప్పున అయిదేళ్లలో రూ.75వేలు అందిస్తుంది.

ఎప్పటి నుంచి అమలు?

ఎప్పటి నుంచి అమలు?

కాపు నేస్తం పథకం ఈ ఆర్థిక సంవత్సరం నుంచే అమలు చేస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన మహిళలకు వచ్చే ఏడాది నుంచి ఇలాంటి పథకం అమలు చేస్తున్నారు. వారికి నాలుగేళ్లలో రూ.75వేలు ఇస్తున్నారు. 45-60 ఏళ్ల మధ్య ఉన్న కాపు మహిళలకు కూడా ఏడాదికి రూ.15వేల చొప్పున అయిదేళ్లలో రూ.75వేలు అందిస్తారు. కాపు నేస్తానికి రూ.900 కోట్లు అవసరం అవుతుందని అంచనా. ఈ సంవత్సరం రూ.1,101 కోట్లు కేటాయిస్తున్నారు. రూ.2.5 లక్షల రూపాయల లోపు ఆదాయం ఉన్న కాపులకు కాపు నేస్తం వర్తిస్తుంది. అలాగే కాపుల సంక్షేమానికి రూ.2వేల కోట్లు కేటాయింపు.

కడప స్టీల్ ప్లాంట్

కడప స్టీల్ ప్లాంట్

కడప జిల్లాలోని జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లలో ఉక్కు కర్మాగారం నిర్మాణానికి డిసెంబర్ 26న శంకుస్థాపన చేయనున్నారు. నిర్మాణ పనులు జూన్ నెలలో ప్రారంభిస్తారు. స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి 3295 ఎకరాల భూమి సేకరిస్తారు. ఏపీ హైగ్రేడ్ స్టీల్ కార్పోరేషన్ ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఇనుప ఖనిజం సరఫరాకు జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థతో ఒప్పందం చేసుకుంటుంది.

కొత్త విద్యుత్ పంపిణీ వ్యవస్థ ఏర్పాటు

కొత్త విద్యుత్ పంపిణీ వ్యవస్థ ఏర్పాటు

పరిపాలనా సౌలభ్యం, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు మరో కొత్త విద్యుత్ పంపిణీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయం.

ఏపీలో నాలుగు విద్యుత్ పంపిణీ సంస్థలు ఉన్నాయి.

ఏపీఎస్పీడీసీఎల్‌ను రెండుగా విభజించి కొత్తగా సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీగా ఏర్పాటు చేయాలని నిర్ణయం.

ఏపీఎస్పీడీసీఎల్‌లో 8 జిల్లాలు ఉండేవి. వీటిలో గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాలను విడదీసి కొత్తగా ఏర్పాటు చేస్తారు.

ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ ద్వారా బ్యాంకుల నుంచి రుణాల స్వీకరణకు ఓకే.

ఆ ఆశా వర్కర్ల జీతాలు 4,000కు పెంపు

ఆ ఆశా వర్కర్ల జీతాలు 4,000కు పెంపు

- గిరిజన ప్రాంతాల్లో ఆశా వర్కర్ల జీతం రూ.400 నుంచి రూ.4వేలకు పెంపు.

- CPS రద్దుపై ఏర్పాటైన వర్కింగ్ కమిటీకి ఆమోదం.

- దోపిడీ, బ్లాక్ మార్కెటింగ్ అరికట్టే లక్ష్యంతో రేషన్ సరుకులు పొందేందుకు, ఆరోగ్యశ్రీ, విద్యా దీవెన వంటి పథకాలకు వేర్వేరు కార్డుల జారీ

- ఇప్పటి వరకు రేషన్ బియ్యం అవసరం లేని వారు ఇతర ప్రయోజనాల కోసం తెల్ల రేషన్ కార్డు తీసుకుంటున్నారు.

- దాని వల్ల బియ్యం రీసైక్లింగ్ జరిగేది. దానిని అరికట్టేందుకు కొత్త విధానాన్ని తీసుకు వస్తున్నారు. కొత్త కార్డుల ముద్రణకు రూ.20 కోట్లు విడుదల చేసేందుకు కేబినెట్ ఆమోదం.

మరిన్ని...

మరిన్ని...

- నవరత్నాల్లో భాగంగా పేదలందరికీ ఇళ్లు స్కీం. ఉగాదికి 25 లక్షల ఇళ్ల స్థలాలు.

- విశాఖ జిల్లా పరవాడ మండలం తాడి గ్రామంలో పారిశ్రామిక వ్యర్థాల నిర్వహణకు ఏపీఐఐసీకి 50 ఎకరాలు కేటాయింపు

- నడికుడి - శ్రీకాళహస్తి బ్రాడ్ గేజ్ లైన్ నిర్మాణం కోసం సౌద్ సెంట్రల్ రైల్వేకు 92.05 ఎకరాల భూమి కేటాయింపు

- మద్యం ధరలు పెంచుతూ నిర్ణయం

- ఏపీ స్కూల్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ పరిధిలోకి ఇంటర్ విద్యను తెస్తూ రూపొందించిన డ్రాఫ్ట్ బిల్లుకు ఆమోదం

- టిటిడి బోర్డులో సభ్యుల సంఖ్యను 19 నుంచి 29కి పెంచుతూ నిర్ణయం

- ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరు కమిషన్ల ఏర్పాటు

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+