అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ప్రకటించిన 50 శాతం సుంకాలు ఆంధ్రప్రదేశ్ రొయ్యల పరిశ్రమను తీవ్రమైన సంక్షోభంలోకి నెట్టేశాయి. ఇప్పటికే 25 శాతం సుంకం అమల్లో ఉండగా, దీనికి మరో 25 శాతం అదనంగా కలిపారు. దీనికి తోడు 5.76 శాతం కౌంటర్‌వెయిలింగ్ డ్యూటీ 3.96 శాతం యాంటీ-డంపింగ్ డ్యూటీ కూడా విధించనున్నారు. దీంతో మొత్తం సుంకాల భారం 59.72 శాతానికి చేరుతుందని నిపుణుల అంచనా.
ఈ సుంకాల పెంపుతో Andhra Pradesh రొయ్యల రైతులపై గట్టి దెబ్బ పడుతోంది. ఎగుమతులు కష్టాల్లోకి వెళ్లాయి. పెద్ద రొయ్యలు ఇక అమ్ముడు కాోమేననే ఆందోళనలో రైతులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ (ఆక్వాకల్చర్) ఎస్. లాల్ మొహమ్మద్ దీనిపై మాట్లాడుతూ.. అమెరికా ఈ సుంకాల నిర్ణయాన్ని అమలు చేస్తే..ఏపీలో పెద్ద రొయ్యలు (30-కౌంట్, 40-కౌంట్) సాగు చేసే రైతులు కష్టాల్లో పడతారని తెలిపారు.ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ రొయ్యలలో 90 శాతం అమెరికాకు ఎగుమతి అవుతాయి. కిలోకు రూ. 350-రూ.400 మధ్య ధర వస్తుంది. అయితే భారీ సుంకాల కారణంగా ఎగుమతిదారులు వీటిని కొనరని ఆయన అన్నారు.
భారత సముద్ర ఆహార ఎగుమతులలో రొయ్యల వాటా: 2024-25లో భారత సముద్ర ఆహార ఎగుమతులను చూస్తూ 7.38 బిలియన్ డాలర్లు (1.78 మిలియన్ మెట్రిక్ టన్నులు) ఎగుమతి అయ్యాయి. ఇందులో రొయ్యల వాటానే అధికం. దాదాపు 92 శాతం అమెరికాకు ఎగుమతి అయ్యాయి. US మార్కెట్ వాటానే 40 శాతం కంటే ఎక్కువగా ఉంది. ఇక రొయ్యల ఉత్పత్తి పరంగా చూస్తే భారత రొయ్యలలో 60 శాతం ఏపీ నుంచే ఉత్పత్తి అవుతున్నాయి.

అమెరికా విధించిన సుంకాల ఒత్తిడి వల్ల రైతులు చిన్న రొయ్యలు (100-కౌంట్.. కిలోకు రూ. 220-రూ.230) సాగు చేయవచ్చని మొహమ్మద్ తెలిపారు. ఇవి సాధారణంగా అమెరికాకు ఎగుమతి కావు. దేశీయ మార్కెట్లలోనే అమ్మకాలు జరపాల్సి ఉంటుంది. ఈ అంశంపై భారత సముద్ర ఆహార ఎగుమతిదారుల సంఘం (MPEDA) కార్యదర్శి డి. దిలీప్ మాట్లాడుతూ..సమస్య త్వరగా పరిష్కారం కాని పక్షంలో, కేవలం చెరువులు, పొలాలు మాత్రమే కాకుండా.. హేచరీలు, ప్రాసెసింగ్ యూనిట్లు, ప్యాకేజింగ్, కోల్డ్ స్టోరేజీలు, ఐస్ ఫ్యాక్టరీలు అన్నీ నిలిచిపోతాయన్నారు. 6.5 లక్షల రైతులతో పాటుగా మరో 30-40 లక్షల కార్మికుల జీవనోపాధి దెబ్బతింటుందని తెలిపారు.
ఇక మరో రాష్ట్రం ఒడిశా ఏటా 2 వేల కోట్ల విలువైన రొయ్యలను ఎగుమతి చేస్తుంది. అందులో 30 శాతం అమెరికాకు ఎగుమతి అవుతాయి. ఫాల్కన్ మెరైన్ ఎక్స్‌పోర్ట్స్ చైర్మన్ తారా రంజన్ పట్నాయక్ మాట్లాడుతూ సరఫరా గొలుసు ఇప్పటికే అంతరాయం సంకేతాలు ఇస్తోందని చెప్పారు. ఈ రంగం ఒడిశాలో 15 లక్షల మందికి ఉపాధి ఇస్తోంది.ఈ సుంకాల ప్రభావం వీరిపై పడితే జీవనోపాధి భారీగా దెబ్బతినే అవకాశం ఉందని తెలిపారు. ఇక ఈక్వెడార్ అమెరికాకు దగ్గరగా ఉండటం వల్ల అక్కడికి ఎగుమతి చేస్తున్నార. ఇక్కడ సుంకం కేవలం 15 శాతం మాత్రమే ఉండటం వల్ల ధరల పరంగా భారీ ప్రయోజనం పొందుతోందని దిలీప్ చెప్పారు.ఈ సమయంలో మనం అమెరికా మార్కెట్ కోల్పోతే.. తిరిగి పొందడం చాలా కష్టతరమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఏపీలో భీమవరం ఆధారంగా ఉన్న ప్రమద మెరైన్ ఎక్స్‌పోర్ట్స్ యజమాని వై. ప్రసాద రావు మాట్లాడుతూ..చిన్న రొయ్యల ఎగుమతిదారులు 5-6 శాతం లాభాలతోనే పనిచేస్తున్నారు. సుంకాల పెరుగుదలతో ఉత్పత్తి ధరలు పెరిగి, అమెరికాలో ఎవరూ కొనరు. ఇప్పటికే ఆగస్టు 11 వరకు కొనుగోళ్లు నిలిపివేశామని తెలిపారు. ఇక ఏలూరులోని మధ్యతరగతి రైతు హర్ష రాజు దీనిపై మాట్లాడుతూ..ఏప్రిల్ నుండి పంట సెలవు పరిస్థితి ఉంది. ఒక్క పంటకు రూ. 6 లక్షల పెట్టుబడి పెడతాం, కానీ ఆ పెట్టుబడి తిరిగి రావడం లేదు. ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయాల కోసం వేచి ఉన్నామని తెలిపారు.
ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ ఆక్వాకల్చర్ డెవలప్‌మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ ఆనం వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 5.7 లక్షల ఎకరాల్లో ఆక్వాకల్చర్ సాగుచేస్తున్నారని..అందులో 3 లక్షల ఎకరాలు రొయ్యల సాగు అవుతోందని తెలిపారు. 8-10 లక్షల టన్నులు (రొయ్యలు & చేపలు) ఉత్పత్తి అవుతున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై తగు చర్చలు తీసుకుంటుందని తెలిపారు. రైతుల కోసం ప్రత్యామ్నాయ మార్కెట్ల అన్వేషణ (EU, రష్యా) సాగుతుందన్నారు. దేశీయ వినియోగ ప్రోత్సాహం కల్పిస్తామని చెప్పుకొచ్చారు. AP ప్రాన్ ప్రొడ్యూసర్స్ కంపెనీ ఏర్పాటు చేసి చిన్న రొయ్యలను కొనుగోలు చేస్తామని తెలిపారు.
ఇక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఈ అంశంపై కేంద్రానికి లేఖ రాశారు. ఆ లేఖలో రాష్ట్ర ఆక్వా రంగాన్ని రక్షించాలని కోరారు.సీఎం మాట్లాడుతూ.. ప్రస్తుతం యూనిట్‌కు రూ. 1.50 చొప్పున విద్యుత్ సబ్సిడీ ఇస్తున్నాం. అమెరికా సుంకాల ప్రభావాన్ని తగ్గించడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
More From GoodReturns

క్వాంటం కంప్యూటర్ అంటే ఏమిటి.. దాని వల్ల లాభాలు, వచ్చే నష్టాలు ఏమిటి.. పూర్తి సమాచారం ఇదిగో..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

హార్ముజ్ జలసంధిని మళ్లీ మూసేసిన ఇరాన్.. ఇజ్రాయెల్ దాడులతో సంక్షోభంలోకి కాల్పుల విరమణ ఒప్పందం..

ఇరాన్ ప్రతిపాదనను చెత్త బుట్టలో పడేసిన ట్రంప్.. టెహ్రాన్ కోరికల జాబితాను ఆమోదించే ప్రసక్తే లేదన్న వైట్ హౌస్..

ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాలు 2026 విడుదల.. ఈ డైరెక్ట్ లింక్‌తో మార్కులు డౌన్లోడ్ చేయండి

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?



Click it and Unblock the Notifications